Retirement Planning : రిటైర్మెంట్ ప్లాన్.. ఈ 7 గోల్డెన్ రూల్స్ పాటించండి.. వృద్ధాప్యంలో ఒక్క పైసా ఎవర్ని అడగకుండా బతికేయొచ్చు!

Retirement Planning : డబ్బు కోసం మీరు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేకుండా వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపాలంటే 7 గోల్డెన్ రూల్స్ ఏంటో తెలుసుకుందాం.

Updated on: November 22, 2025

Retirement Planning : వయస్సులో ఉన్నప్పుడే సంపాదించుకుంటాం.. కానీ, వయస్సు పైబడిన తర్వాత ఆర్థికంగా బలంగా ఉండాలి. లేదంటే ఆ వయస్సులో ఏ పని చేయలేని పరిస్థితి. ఆర్థికంగా ఒకరిపై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే రిటైర్మెంట్ తర్వాత డబ్బుకు లోటు లేకుండా జీవించవచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరి కల. మీరు ముందుగానే ప్లాన్ చేసుకుని రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటే.. రూ. కోటి వరకు సంపాదించుకోవచ్చు. ముందు నుంచి ఒక ప్లానింగ్ ఉంటే కోట్ల డబ్బు కూడబెట్టడం పెద్ద కష్టమేమి కాదు.

ముందుగానే డబ్బులు సేవింగ్ (Retirement Planning) చేయడం, తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ మొత్తంలో డబ్బులను కూడబెట్టుకోవచ్చు. ముందుగా, మీరు పదవీ విరమణ కోసం ఎంత డబ్బు అవసరమో అంత మొత్తాన్ని కూడబెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో ముందుగానే నిర్ణయించుకోండి.

కాంపౌండింగ్ నుంచి ప్రయోజనం కోసం ముందుగానే డబ్బులను సేవింగ్ చేసుకోండి. మీరు ఎంత త్వరగా సేవింగ్ చేయడం మొదలుపెడితే మీ డబ్బు పెరగడానికి అంత ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల ప్రతి నెలా సేవింగ్ చేయాల్సిన అవసరం కూడా తగ్గుతుంది.

నెలవారీ సేవింగ్స్ ఆటోమేట్ చేయండి :
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం సేవింగ్స్ చేయడం ఒక సాధారణ అలవాటుగా మార్చుకోండి. ప్రతి నెలా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ అయ్యేలా (Retirement Planning) సెట్ చేసుకోండి. మీ వయస్సు, రిస్క్ టాలరెన్స్ ప్రకారం.. మీ పెట్టుబడులను ఈక్విటీ, లోన్, సురక్షితమైన విధానంలోనే పెట్టుబడి పెట్టండి. ప్రతి ఏడాదిలో మీ పెట్టుబడులను రివ్యూ చేయండి. అవసరమైతే మార్పులు చేయండి. సరైన ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా మీ లాభాలను పెంచుకోవచ్చు.

Retirement Planning : ఇప్పటినుంచే ఈ 7 గోల్డెన్ రూల్స్ పాటించండి :

ఈరోజు నుంచి ఈ 7 పెట్టుబడి నియమాలను పాటించండి. రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. సరిగ్గా ఎలా ప్లాన్ చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఏయే తప్పులను నివారించాలో తప్పక తెలిసి ఉండాలి. రిటైర్మెంట్ తర్వాత జీవితం అనేది అతిపెద్ద ఆందోళన.. ఎందుకంటే అప్పుడు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయం ఉండదు. కానీ, మీరు కెరీర్ ప్రారంభం నుంచే మీ పెట్టుబడులను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే.. మీ వృద్ధాప్యంలో మీ జేబు నిండా డబ్బు ఉంటుంది. డబ్బు కోసం మీరు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపాలంటే మీ యవ్వనంలో మీరు పాటించాల్సిన 7 గోల్డెన్ రూల్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Retirement Planning _ 7 Golden Rules to Live Stress-Free Without Asking Anyone for Money
Retirement Planning

1. ముందుగానే పెట్టుబడి పెట్టండి :
పెట్టుబడి పెట్టేందుకు సమయం చాలా అవసరం. మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే.. కాంపౌండింగ్ అంత ఎక్కువగా పెరుగుతుంది. మీరు 25 ఏళ్ల వయస్సులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. 60 ఏళ్ల వయస్సులో లేదా 35 ఏళ్లు, 40 ఏళ్ల మధ్య పదవీ విరమణ ప్లానింగ్ చేసే వారి మాదిరిగా మూడు రెట్లు డబ్బును కూడబెట్టుకోవచ్చు. మీ కెరీర్ ప్రారంభం నుంచి SIP ప్రారంభించండి. అది చిన్న మొత్తం అయినా కూడా. ఆ తర్వాత మీ ఆదాయం పెరిగేకొద్దీ కొత్త SIPని ప్రారంభించవచ్చు. మీరు ఇతర మార్గాలలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ముందుగానే పెట్టుబడి పెట్టడం అనేది అత్యంత కీలకం.

Read Also : Gold Rules 2025 : మీ ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? టాక్స్ చెల్లించాలా? బంగారంపై ఎలా పెట్టుబడి పెడితే కలిసివస్తుంది?

2. రిటైర్మెంట్ ప్లానింగ్ టార్గెట్‌గా పెట్టుకోండి :
పదవీ విరమణ ప్లానింగ్ అనేది ఒక ఆర్థిక లక్ష్యంగా భావించండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే సమయం. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని 60 ఏళ్ల వయస్సులోపు మీకు ఎంత డబ్బు అవసరమో ముందుగానే నిర్ణయించుకోండి. ఆపై మీ పెట్టుబడులను ప్లాన్ చేసుకోండి. మీ వృద్ధాప్యానికి ఎంత డబ్బు అవసరమో నిర్ణయించేందుకు ఆన్‌లైన్ రిటైర్మెంట్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. మీ పదవీ విరమణ లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో సాయపడుతుంది.

Cash vs Home Loan
Cash vs Home Loan : నగదుతో ఇల్లు కొనాలా? హోం లోన్ తీసుకోవాలా? మీ జీతం, EMI ఎంత ఉండాలి? పూర్తి లెక్కలు మీకోసం..!

3. మీ పోర్ట్‌ఫోలియోను ఎంచుకోండి :
మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఒకే చోట పెట్టుబడి పెట్టకండి. మ్యూచువల్ ఫండ్స్, EPF, NPS, PPF, స్థిర ఆదాయం, ఈక్విటీలలో కొంత భాగాన్ని కలిపి ఉంచండి. ఈ విధంగా ఒక పెట్టుబడి రాబడి తగ్గినా మరొకటి ద్వారా రాబడి పొందవచ్చు. ఇందులో రిస్క్ తక్కువ ఉంటుంది. ఎక్కువ స్థిరత్వం ఉంటుంది.

4. ఈక్విటీలో దీర్ఘకాలిక పెట్టుబడి :
మీ రిటైర్మెంట్ ప్లాన్ ఇంకా 15 ఏళ్ల నుంచి 20 సంవత్సరాల సమయం ఉంటే ఈక్విటీలు (స్టాక్ మార్కెట్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు) కన్నా అద్భుతమైన ఆప్షన్ మరొకటి లేదు. దీర్ఘకాలికంగా, ఈక్విటీలు ప్రతి సాంప్రదాయ పెట్టుబడి (ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా బంగారం వంటివి) కన్నా మెరుగైన రాబడిని అందించాయి. ఈక్విటీలు స్వల్పకాలంలో అస్థిరంగా ఉంటాయి కానీ దీర్ఘకాలికంగా భారీ మొత్తంలో సంపదను రాబడతాయని గత రికార్డులు సూచిస్తున్నాయి.

5. పన్ను ప్రణాళిక తప్పనిసరి :
మీరు పెట్టుబడితో పాటు పన్ను ప్రణాళిక కూడా అత్యంత కీలకం. NPS, PPF, ELSS వంటి పథకాలు రిటైర్మెంట్ ఫండ్ పెంచడమే కాకుండా పన్ను ఆదా కూడా అందిస్తాయి. ఈ పథకాలు సెక్షన్లు 80C, 80CCD(1B) కింద రూ. 2 లక్షల వరకు డిడెక్షన్ అర్హత పొందవచ్చు. పన్ను సామర్థ్యంతో మీ నికర రాబడి కూడా క్రమంగా పెరుగుతుంది.

6. ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోండి :
మీ రిటైర్మెంట్ ఫండ్ పెట్టుబడి పెట్టే ముందు.. 6 నుంచి 12 నెలల ఖర్చులను కవర్ చేసే విధంగా ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోవాలి. వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు, ఉద్యోగం కోల్పోవడం లేదా ఇతర ఊహించని ఆర్థిక అవసరాలకు ఈ ఎమర్జెన్సీ ఫండ్ చాలా ముఖ్యమైనది. ఇప్పటికే ఎమర్జెన్సీ ఫండ్ కలిగి ఉంటే మీ రిటైర్మెంట్ ఫండ్ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉండదు.

7. ద్రవ్యోల్బణాన్ని నివారించండి :
ద్రవ్యోల్బణం మీ డబ్బుకు నిజమైన శత్రువు. మీ పెట్టుబడి రాబడి రేటు 7శాతం, ద్రవ్యోల్బణం 6శాతంగా ఉంటే మీ వాస్తవ రాబడి కేవలం ఒక శాతం మాత్రమే. ఎల్లప్పుడూ ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని అందించే పెట్టుబడులను ఎంచుకోండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా NPS వంటివి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించే ఆప్షన్లు మాత్రమే గణనీయమైన రిటైర్మెంట్ ఫండ్ కూడబెట్టుకోవడానికి అద్భుతంగా ఉంటుంది.

Retirement Planning : పెట్టుబడి పెట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే :

  • ప్రతి ఏడాదిలో మీ పెట్టుబడులను సమీక్షించుకోండి.
  • మీరు రిటైర్మెంట్ సమయంలో హై-రిస్క్ ఆస్తులను క్రమంగా వదిలివేయండి.
  • ఆర్థిక ప్రణాళికలో మీ ఫ్యామిలీని కూడా చేర్చుకోండి.

మీ రిటైర్మెంట్ ప్లాన్ విషయంలో ఈ 5 తప్పులు చేయొద్దు :
రిటైర్మెంట్ ప్లానింగ్ సమయంలో చాలామంది తరచుగా వృద్ధాప్యంలో డబ్బు పరంగా ఎదురయ్యే కొన్ని పెద్ద తప్పులు చేస్తుంటారు. తప్పుడు లెక్కలు, ఖర్చులను తక్కువగా అంచనా వేయడం, మార్కెట్‌పై అతిగా ఆధారపడటం అనేవి తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ తప్పుడు నిర్ణయాలు మీరు కష్టపడి సంపాదించిన సేవింగ్స్ మొత్తం రిస్క్ లో పడేస్తాయి. మీ రిటైర్మెంట్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. మీ వృద్ధాప్యంలో డబ్బు లేక తీవ్ర ఆందోళనతోనే గడిచిపోతుంది. అందుకే మీ రిటైర్మెంట్ ప్లాన్ రిస్క్‌‍లో పడేసే 5 కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

1. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు :
చాలా మంది తమ రిటైర్మెంట్ ప్లాన్ వేసుకునేటప్పుడు రాబడి, ద్రవ్యోల్బణం స్థిర రేటు వద్ద (Retirement Planning) పెరుగుతాయని భావిస్తారు. అయితే, వాస్తవం ఏమిటంటే.. మార్కెట్లు, ధరలు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండవు. ఇలాంటి అంచనాలపై ఆధారపడటం తప్పుడు నిర్ణయాలకు దారితీయవచ్చు.

2. మీ రాబడి రిస్క్‌లో పడొద్దు :
రిటైర్మెంట్ ప్రారంభంలో పెద్ద నష్టాలు మీ మొత్తం సేవింగ్స్ నాశనం చేస్తాయి. సీక్వెన్స్-ఆఫ్-రిటర్న్ రిస్క్ అంటారు. రాబడి తరువాత కోలుకున్నప్పటికీ ప్రారంభ నష్టాలను తిరిగి పొందడం చాలా కష్టంగా మారుతుంది.

3. పాత వృద్ధి అంచాలపై ఆధారపడటం :
చాలామంది తరచుగా గతంలో అధిక వృద్ధిని చూస్తారు. భవిష్యత్తులో కూడా అదే ఆశిస్తారు. కానీ, ఇది నిజం కాదు. అతిగా అంచనా వేసిన రాబడి అంటే.. మీరు రిటైర్మెంట్ సమయంలో ఆర్థికపరంగా తీవ్రమైన డబ్బు లోటును ఎదుర్కోవలసి వస్తుంది.

SIP Investment Tips
SIP Investment Tips : మీకు ఫస్ట్ జీతం వచ్చిన వెంటనే ఈ 5 పెట్టుబడులు పెట్టండి.. జీవితాంతం డబ్బుకు లోటు లేకుండా బతికేయొచ్చు..!

4. ఖర్చు, ద్రవ్యోల్బణంపై తక్కువ అంచనా వేయడం :
రిటైర్మెంట్ సమయంలో వైద్య ఖర్చులు, రోజువారీ అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. క్రమంగా మీ పొదుపును క్షీణించేలా చేస్తుంది.

5. సరైన వ్యూహం లేకపోవడం :
మీకు సరైన వ్యూహం లేకపోతే, ఫిక్స్‌డ్ విత్‌డ్రా ప్రణాళికపై మాత్రమే ఆధారపడితే మీ రిటైర్మెంట్ ప్లాన్ విఫలం కావచ్చు. బక్కెటింగ్ లేదా డైనమిక్ ఖర్చు వంటి పద్ధతులు సురక్షితమైనవిగా ఉంటాయి.

Retirement Planning : 4 శాతం రిటైర్మెంట్ రూల్ ఏంటి? :

రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోసం 4శాతం రూల్ అద్భుతంగా ఉంటుంది. మీ సేవింగ్స్ త్వరగా కోల్పకుండా (Retirement Planning) ఉండేందుకు వీలుగా ప్రతి ఏడాదిలో మీ రిటైర్మెంట్ కార్పస్ నుంచి ఎంత డబ్బును విత్ డ్రా చేసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. అందుకు ఈ రిటైర్మెంట్  రూల్ అద్భుతంగా సాయపడతుది. ఇంతకీ ఈ 4 శాతం రూల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వృద్ధాప్యంలో ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం రాకూడదని అందరూ కోరుకుంటారు. అందుకే, రిటైర్మెంట్ కోసం సరైన ప్లాన్ చేసుకుంటారు. కొందరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో మరికొందరు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF)లో పెట్టుబడి పెడతారు. చాలామంది నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)ను ఎంచుకుంటారు. కానీ, వీటిలో మీ మొత్తం రిటైర్మెంట్ కోర్సును నిర్ణయించే కీలక నియమం ఉంది..

Retirement Planning _ 7 Golden Rules to Live Stress-Free Without Asking Anyone for Money
Retirement Planning

అదే 4 శాతం రూల్. మీ సేవింగ్స్ ఎక్కువ కాలం ఉంచుకోవాడానికి, రిటైర్మెంట్ తర్వాత ప్రతి ఏడాదిలో మీ రిటైర్మెంట్ కార్పస్ నుంచి ఎంత డబ్బును విత్ డ్రా చేసుకోవాలో ఈ నియమం చెబుతుంది. కీలకమైన విషయం ఏమిటంటే.. మీరు సరిగ్గా ఈ రూల్ పాటిస్తే.. మీ సేవింగ్స్ జీవితాంతం ఉంటాయి. ప్రతి ఏడాదిలో డబ్బును విత్ డ్రా చేసినప్పటికీ మీ కార్పస్ అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది.

4 శాతం రూల్ ప్రవేశపెట్టిందో ఎవరంటే? :
1990లో అమెరికన్ ఆర్థిక సలహాదారుడు ఒకరు 4 శాతం రూల్ ప్రవేశపెట్టాడు. రిటైర్మెంట్ తర్వాత ప్రతి ఏడాదిలో మీ సేవింగ్స్ నుంచి ఎంత డబ్బును విత్ డ్రా చేసుకుంటే సురక్షితమో నిర్ణయించుకోవచ్చు. మీరు రిటైర్మెంట్ చేసే సమయానికి పెద్ద మొత్తాన్ని కూడబెట్టినట్లయితే మీరు ప్రతి ఏడాదిలో అందులో 4శాతం మాత్రమే విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మీ డబ్బు నెమ్మదిగా తగ్గిపోతుంది. మీ సేవింగ్స్ చాలా సంవత్సరాలు అలానే ఉంటాయి.

ఉదాహరణకు.. మీ దగ్గర రూ. 5 కోట్ల కార్పస్ ఉందని అనుకుందాం.. అందులో ప్రతి ఏడాది 4శాతం విత్‌డ్రా చేసుకుంటే.. ప్రతి ఏడాదిలో 6శాతం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా (Retirement Planning) సర్దుబాటు చేస్తే మీరు ఈ మొత్తాన్ని కూడా పెంచుకోవచ్చు. మీరు సగటున 12శాతం వార్షిక వడ్డీ రేటును సంపాదిస్తారు అనుకుంటే.. మీరు 60 ఏళ్ల వయస్సు నుంచి ప్రతి ఏడాదిలో డబ్బును విత్ డ్రా చేసుకుంటే మీ కార్పస్ రాబోయే 30 ఏళ్లలో రూ.17 కోట్ల నుంచి రూ.18 కోట్లకు చేరుకుంటుంది. అంటే.. మీ డబ్బు అసలు తగ్గదు.. అంతకంతకూ పెరుగుతూ పోతూనే ఉంటుంది అనమాట.

FAQ : రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి ప్రశ్నలకు పూర్తి సమాధానాలివే : 

రిటైర్మెంట్ ప్లానింగ్ ఎప్పుడు చేయాలి?

మీ రిటైర్మెంట్ ప్లాన్ ఎంత త్వరగా అయితే అంత మంచిది. 25 ఏళ్ల వయస్సులోపు ప్రారంభించడం ఉత్తమం.

PF, NPS మాత్రమే రిటైర్మెంట్ ప్లానింగ్ అవసరాలను తీరుస్తాయా?

లేదు.. మీరు మ్యూచువల్ ఫండ్స్, కొన్ని ఫిక్స్ డ్ టూల్స్ కూడా చేర్చుకోవాలి.

రిటైర్మెంట్ తర్వాత పెట్టుబడి పెట్టడం ఆపేయాలా?

లేదు.. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి మీరు మీ ఫండ్స్ సేఫ్‌గా వృద్ధి-ఆధారిత మార్గాలలో పెట్టుబడి పెట్టాలి.

ఆలస్యంగా పెట్టుబడి పెడితే ఇప్పుడు ఏదైనా చేయవచ్చా?

కచ్చితంగా చేయొచ్చు.. మీ పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోండి. అధిక రాబడి ఆప్షన్లను కూడా ఎంచుకోండి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

‘రీడ్ తెలుగు వాయిస్’లో డిజిటల్ కంటెంట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ వార్తలను రాస్తుంటాను. తెలుగు మీడియా సంస్థల్లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది.

Leave a Comment