iPhone Evolution : 18 ఏళ్లలో ఐఫోన్ ఎంతగా మారిపోయింది? 2007లో ఫస్ట్ ఐఫోన్ నుంచి 2025 వరకు ఎన్ని ఐఫోన్ మోడల్స్ వచ్చాయంటే?

iPhone Evolution : ఆపిల్ ఫస్ట్ ఐఫోన్‌ 2007లో వచ్చింది. అలా మొదలైన జర్నీ చివరకు ఈ ఏడాది 2025 ఐఫోన్ 17 మోడల్‌ను లాంచ్ చేసింది.

Updated on: October 28, 2025

iPhone Evolution : ఆపిల్ ఐఫోన్లకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఆపిల్ లవర్స్ కొత్త ఐఫోన్ మార్కెట్లోకి రిలీజ్ అయిందంటే ఎగబడి మరి కొనేస్తుంటారు. 2007 నుంచి 2025 వరకు ఆపిల్ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. అదే జోరు కొనసాగుతోంది.

ఐఫోన్ సేల్స్ విషయంలో కూడా మొదలైన (iPhone Evolution) వెంటనే ఐఫోన్ సేల్ అన్ని అమ్ముడైపోతాయి. అంతగా ఐఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ డిమాండ్ తగినట్టుగానే ఆపిల్ ప్రతి ఏడాది సరికొత్త ఐఫోన్లను భారత్ సహా గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేస్తోంది.

ఆపిల్ ఫస్ట్ ఐఫోన్‌ను 2007లో లాంచ్ చేసింది. అప్పటినుంచి ఈ ఆపిల్ ఐఫోన్ జర్నీ (Apple iPhone Models) మొదలైంది. ప్రతి ఏడాదిలో కొత్త ఐఫోన్ మోడళ్లను ప్రవేశపెడతూ ట్రెండ్ కొనసాగిస్తోంది. 2025లో ఆపిల్ కొత్త ఐఫోన్ 17 మోడల్‌ను రిలీజ్ చేసింది. భారీ 6.3 అంగుళాల డిస్‌ప్లేతో పాటు 120Hz ప్రోమోషన్ స్క్రీన్‌ అద్భుతంగా ఉన్నాయి.

అయితే, ఆపిల్ ఫస్ట్ ఐఫోన్ మోడల్ 3.5-అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ 18 సంవత్సరాలలో ఆపిల్ ఏయే ఐఫోన్ మోడళ్లను ప్రవేశపెట్టింది? ఆయా మోడళ్లలో ఎలాంటి కొత్త మార్పులను తీసుకొచ్చింది? ఏయే ఐఫోన్ మోడల్స్ నిలిపివేసింది అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం..

ఆపిల్ ఐఫోన్ (2007) :
ఆపిల్ ఫస్ట్ ఐఫోన్ మోడల్‌ను 2007లో లాంచ్ చేసింది. ఇందులో 3.5-అంగుళాల టచ్ స్క్రీన్, పాతకాలపు బటన్లు ఉన్నాయి. ఆ సమయంలో, 3G నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ సపోర్టుతో కూడా అందుబాటులోకి వచ్చింది.

iPhone Evolution : Apple iPhone models
iPhone Evolution

ఆపిల్ ఐఫోన్ 3G (2008) :
ఆపిల్ రెండో ఐఫోన్ 3Gని 2008లో లాంచ్ చేసింది. ఈ ఐఫోన్ ముందున్న ఫోన్ కన్నా పెద్దగా భిన్నంగా లేదు. కానీ, యాప్ స్టోర్‌ను ప్రవేశపెట్టింది. యాప్ డెవలపర్‌లు, ఐఫోన్ యూజర్ల కోసం మరిన్ని యాప్‌లను యాక్సెస్ చేసేందుకు వీలు కల్పించింది.

ఆపిల్ ఐఫోన్ 3GS (2009) :
టెక్ దిగ్గజం ఆపిల్ 2009లో థర్డ్ మోడల్ ఐఫోన్ 3GS లాంచ్ చేసింది. ఈ ఐఫోన్ S సిరీస్ (iPhone Evolution) కింద ప్రవేశపెట్టిన ఈ మోడల్ 3.5-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే కలిగి ఉంది. మొదటి కాపీ-అండ్-పేస్ట్ ఫీచర్‌ కూడా కలిగి ఉంది. ఇంకా, ఈ సిరీస్ స్పీడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 4 (2010) :
2010లో ఆపిల్ 4వ జనరేషన్ ఐఫోన్ 4 మోడల్ లాంచ్ చేసింది. అద్భుతమైన రెటినా డిస్‌ప్లే కలిగి ఉంది. మెటల్ ఫ్రేమ్, గ్లాస్ డిజైన్‌తో ఐఫోన్ 4 ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో కంపెనీ ఫస్ట్ మోడల్ రిలీజ్ చేసింది. మల్టీ టాస్కింగ్ కోసం iOS 4కి కూడా సపోర్టు ఇస్తుంది.

Read Also : Gold Rules 2025 : మీ ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? టాక్స్ చెల్లించాలా? బంగారంపై ఎలా పెట్టుబడి పెడితే కలిసివస్తుంది?

ఆపిల్ ఐఫోన్ 4S (2011) :
2011లో ఆపిల్ ఐఫోన్ 4S లాంచ్ చేసింది. డిజిటల్ అసిస్టెంట్ సిరికి సపోర్టు ఇచ్చే కంపెనీ ఫస్ట్ మోడల్. ఆపిల్ 5వ జనరేషన్ ఐఫోన్, 8MP బ్యాక్ కెమెరా కూడా కలిగి ఉంది.

ఆపిల్ ఐఫోన్ 5 (2012) :
2012లో ఐఫోన్ 5 మోడల్ ఆపిల్ లాంచ్ చేసింది. గత ఐఫోన్ మోడల్‌తో పోలిస్తే.. 4 అంగుళాల డిస్‌ప్లేతో పెద్ద 3.5-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. ఐఫోన్ 5లో రివర్సిబుల్ లైట్నింగ్ పోర్ట్ కూడా ఉంది.

ఆపిల్ ఐఫోన్ 5S, ఆపిల్ ఐఫోన్ 5C (2013) :
2013లో ఐఫోన్ 5S, ఐఫోన్ 5C మోడళ్లను ఆపిల్ ప్రవేశపెట్టింది. ఈ రెండూ పాలికార్బోనేట్ షెల్‌ను కలిగి ఉన్నాయి. ఐఫోన్ 5C తక్కువ ధరకు లాంచ్ అయింది. ఐఫోన్ 5C ధర ఎక్కువ, టచ్ ID ఫింగర్ ప్రింట్ స్కానర్‌ కలిగి ఉంది. 64-బిట్ A7 ప్రాసెసర్‌ కలిగిన కంపెనీ ఫస్ట్ మోడల్ ఇదే.

ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ (2014) :
2014లో ఆపిల్ ఐఫోన్ 6 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ అనే మోడళ్లు ఉన్నాయి. భారీ డిస్‌ప్లే కలిగి ఉన్నాయి. ఐఫోన్ 6 4.7-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఐఫోన్ 6 ప్లస్ 5.5-అంగుళాల రెటినా డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ సిరీస్ ఐఫోన్‌లు కొంచెం సన్నగా డిజైన్‌ కలిగి ఉన్నాయి.

ఆపిల్ ఐఫోన్ 6S, ఐఫోన్ 6S ప్లస్ (2015) :
2015లో ఆపిల్ ఐఫోన్ 6S, ఆపిల్ ఐఫోన్ 6S ప్లస్ మోడల్స్ ప్రవేశపెట్టింది. ఐఫోన్ 6S సిరీస్ గత ఐఫోన్ 6 సిరీస్‌తో కంపేర్ చేస్తే పెద్దగా మార్పులేమి లేవు. ఐఫోన్ 6S 3D టచ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఐఫోన్ SE (2016) :
2016లో ఆపిల్ ఐఫోన్ SE మోడల్ లాంచ్ చేసింది. ఈ మోడల్ ఐఫోన్ 5S, ఐఫోన్ 6S మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో 4-అంగుళాల డిస్‌ప్లే, 6S ప్రాసెసర్ కూడా ఉన్నాయి.

Best Mid Range Mobiles
Best Mid Range Mobiles Review : ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఫీచర్లు.. ఇప్పుడు మిడ్ రేంజ్‌లో బెస్ట్ 7 స్మార్ట్‌ఫోన్లు కేక.. అసలు మిస్ కాకండి!

ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 7 (2016) :
2017 ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ మోడల్స్ ప్రవేశపెట్టింది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, వాటర్ రెసిస్టెంట్ కలిగిన కంపెనీ మొదటి ఐఫోన్ మోడళ్లు. ఇందులో 2x జూమ్ కెమెరా, పోర్ట్రెయిట్ మోడ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్ 7 సిరీస్ నుంచి హెడ్‌ఫోన్ జాక్ తొలగించి ఆ స్థానంలో డిజిటల్ హోమ్ బటన్ కూడా యాడ్ చేసింది ఆపిల్.

ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ (2017) :
2017లో లాంచ్ అయిన ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ ఫోన్లలో కొత్త ప్రాసెసర్లు ప్రవేశపెట్టింది. ఈ ఐఫోన్లు ఐఫోన్ 7 సిరీస్‌కు అప్‌గ్రేడ్ అయ్యాయి. కెమెరా, ఛార్జింగ్ సిస్టమ్‌లో అనేక మార్పులు ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే కంపెనీ ఫస్ట్ ఐఫోన్ మోడల్స్ ఇవే అని చెప్పొచ్చు.

ఆపిల్ ఐఫోన్ X (2017) :
2017 ఏడాదిలో ఆపిల్ మరో కొత్త ఐఫోన్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఐఫోన్ X, ఐఫోన్ X టచ్ ఐడీని తొలగించి ఆ స్థానంలో నోచ్డ్ డిస్‌ప్లేను అందించింది. ఇందులో న్యూరల్ ఇంజిన్, A11 బయోనిక్ ప్రాసెసర్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.

ఆపిల్ ఐఫోన్ XS, ఐఫోన్ XS మ్యాక్స్ (2018) :
2018 ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ X సిరీస్‌ను తీసుకొచ్చింది. ఐఫోన్ XS మోడల్ 5.8-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. ఐఫోన్ XS మ్యాక్స్ మోడల్ 6.5 అంగుళాల రెటినా డిస్‌ప్లే కలిగి ఉంది. 6 అంగుళాల కన్నా భారీ డిస్‌ప్లేలతో కంపెనీ ఫస్ట్ ఐఫోన్ మోడల్స్ అని చెప్పొచ్చు.

ఆపిల్ ఐఫోన్ XR (2018) :
2018 ఏడాదిలో ఆపిల్ మరో కొత్త ఐఫోన్ మోడల్ ఐఫోన్ XR రిలీజ్ చేసింది. కొత్త ఐఫోన్ SE పేరుతో లాంచ్ అయింది. ఈ ఐఫోన్ మోడల్ డిస్‌ప్లే చాలా చిన్నది అయినప్పటికీ, లేటెస్ట్ ప్రాసెసర్‌ కలిగి ఉంది. ఐఫోన్ XR కలర్‌‍ఫుల్ అల్యూమినియం బ్యాక్ ప్యానెల్‌తో LCD డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఐఫోన్ స్క్రీన్ 3D టచ్‌ కలిగి ఉంది. అంతేకాదు.. టెలిఫోటో కెమెరా కూడా అద్భుతంగా ఉంటుంది.

ఆపిల్ ఐఫోన్ 11 (2019) :
2019లో ఆపిల్ ఐఫోన్ 11 లాంచ్ అయింది. ఆపిల్ ఐఫోన్ XR మాదిరిగానే మల్టీ కలర్ అల్యూమినియం ఛాసిస్‌ కలిగి ఉంది. ఇందులో అల్ట్రా-వైడ్ కెమెరాతో వచ్చిన ఫస్ట్ ఐఫోన్ మోడల్. 64GB వరకు స్టోరేజీని అందించింది.

ఆపిల్ ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్ (2019) :
ఆపిల్ ఐఫోన్ 11 సిరీస్‌లో కెమెరా మాడ్యూల్‌ రిలీజ్ చేసింది. ఈ ఐఫోన్ సిరీస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్‌లో వైడ్, అల్ట్రా-వైడ్, టెలిఫోటో లెన్స్‌తో మొత్తం 3 కెమెరాలు ఉన్నాయి. ఈ ఐఫోన్ మోడళ్లలో ఫస్ట్ టైమ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొచ్చింది.

ఆపిల్ ఐఫోన్ SE (2020) :
2020లో ఆపిల్ ఐఫోన్ SE మోడల్ లాంచ్ అయింది. రెండో జనరేషన్ ఐఫోన్ 8గా మార్కెట్లోకి వచ్చింది. ఐఫోన్ SE మోడల్ 2022 కాంపాక్ట్ డిస్‌ప్లే, ఐఫోన్ 11 సిరీస్‌లోని సేమ్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

Read Also : Gold Investment Schemes : బంగారంపై పెట్టుబడికి భారత్‌లో బెస్ట్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ ఇవే.. నచ్చిన స్కీమ్ ఎంచుకోండి!

ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ (2020) :
2020లో ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ లాంచ్ అయింది. ఈ ఐఫోన్ సిరీస్‌లో ఆపిల్ ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్ వంటివి ఉన్నాయి. ఇందులో 5G కనెక్టివిటీతో పాటు మాగ్‌సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఐఫోన్ ప్రారంభంలోనే ఆపిల్ ఇన్-బాక్స్ ఛార్జర్‌ను నిలిపివేసింది.

ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ (2021) :
2021 ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్‌ లాంచ్ అయింది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ ఉన్నాయి. ఇందులో ఎడిటెడ్ కెమెరా మాడ్యూల్ కూడా ఉంది. ఐఫోన్‌లో చేసిన మార్పులలో ఎక్కువగా బ్యాటరీ లైఫ్, 128GB బేస్ స్టోరేజ్‌ సపోర్టు వంటివి ఉన్నాయి.

ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ (2022) :
2022లో ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ అయింది. ఈ ఐఫోన్ సిరీస్‌లో మొత్తం 4 ఐఫోన్ మోడల్స్ ఉన్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్లస్ ప్రో అద్భుతంగా ఉన్నాయి. ఐఫోన్ 14 సిరీస్‌లో శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ SOS అనే కొత్త ఫీచర్ ఉంది. డైనమిక్ ఐలాండ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ (2023) :
2023 సెప్టెంబర్ 12న ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయింది. ఆపిల్ లేటెస్ట్ మోడల్‌ ఇదే. ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో మొత్తం 4 మోడల్స్ రిలీజ్ అయ్యాయి. ఐఫోన్ 15 ధర రూ. 79,900గా ఉంటే.. ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 89,900, ఆపిల్ ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,34,900, ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర రూ.1,59,900. ఆపిల్ కొత్త డిజైన్, USB టైప్-C పోర్ట్ సపోర్ట్‌తో ఐఫోన్ 15 మోడళ్లను ప్రవేశపెట్టింది.

2024 నుంచి 2025 మధ్య లాంచ్ అయిన ఐఫోన్ మోడల్స్ :

ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ (సెప్టెంబర్ 2024లో లాంచ్) :
ఆపిల్ కొత్త ఐఫోన్ జనరేషన్ మోడళ్లలో కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌ ప్రవేశపెట్టింది. అన్ని కొత్త ఐఫోన్ మోడళ్లకు కస్టమైజడ్ యాక్షన్ బటన్‌ తీసుకొచ్చింది. అన్ని ఐఫోన్ మోడళ్లు కొత్త A18 చిప్‌సెట్‌ కలిగి ఉన్నాయి.

ఆపిల్ ఐఫోన్ 16 (2024) :
ఆపిల్ ఐఫోన్ 16 బేస్ మోడల్స్ అప్‌డేటెడ్ 48MP మెయిన్ కెమెరా, కొత్త అల్ట్రావైడ్ లెన్స్‌ కలిగి ఉంటాయి. కెమెరా రేంజ్ విషయానికి వస్తే.. ఇప్పుడు స్పేషియల్ వీడియో క్యాప్చర్‌కు సపోర్టు ఇస్తాయి. ఇందులో ఐఫోన్ 16 ప్లస్ మోడల్ భారీ స్క్రీన్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్స్ భారీ డిస్‌‍ప్లేలు 6.3, 6.9 అంగుళాలతో కొత్త 48MP అల్ట్రావైడ్ కెమెరా కలిగి ఉన్నాయి. A18 ప్రో చిప్ ద్వారా పవర్ పొందుతాయి. హై రిఫ్రెష్ రేట్ ప్రోమోషన్ డిస్‍‌ప్లే, థర్మల్ డిజైన్‌ కూడా కలిగి ఉన్నాయి.

Top 5 Car insurance 2025 Companies
Car insurance 2025 : కొత్త కారు కొన్నారా? బీమా తీసుకున్నారా? భారత్‌లో టాప్ 5 కారు ఇన్సూరెన్స్ కంపెనీలివే.. ఏది బెస్ట్ అంటే?

ఆపిల్ ఐఫోన్ 16e :
ఆపిల్ ఐఫోన్ SE స్థానంలో ఐఫోన్ 16e బడ్జెట్ మోడల్ లాంచ్ అయింది. స్టాండర్డ్ ఐఫోన్ 16 కన్నా చీపెస్ట్ ధరకే లభిస్తోంది. డైనమిక్ ఐలాండ్, స్పేషియల్ వీడియో క్యాప్చర్ వంటి అదనపు ఫీచర్లు అందుబాటులో లేవు.

2025 సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు ఇవే :

ఐఫోన్ 17 సిరీస్ (2025) :
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ డిజైన్ రిఫ్రెష్ కలిగి ఉంది. ఈ బేస్ వేరియంట్ కొత్త మోడల్ అత్యాధునిక అప్‌గ్రేడ్ ఇంటర్నల్‌ ఫీచర్లు కలిగి ఉంది. ఐఫోన్ 17 బేస్ వేరియంట్ నుంచి ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17ప్రో, ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ అనే మోడల్స్ లాంచ్ అయ్యాయి.

ఐఫోన్ 17 :
ఆపిల్ ఐఫోన్ స్టాండర్డ్ మోడల్ ఐఫోన్ 17 ఇప్పుడు భారీ 6.3 అంగుళాల డిస్‌ప్లే, 120Hz ప్రోమోషన్ స్క్రీన్‌ అద్భుతంగా ఉన్నాయి. ఈ ఫీచర్ పాత ఐఫోన్ ప్రో మోడల్స్ మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు కొత్త A19 చిప్ ద్వారా పవర్ అందిస్తుంది.

iPhone Evolution : Apple iPhone models
iPhone Evolution : Latest iPhone models

ఐఫోన్ ఎయిర్ :
ఆపిల్ అందించే ఐఫోన్ మోడళ్లలో పూర్తిగా సరికొత్త మోడల్. 6.5-అంగుళాల భారీ డిస్‌ప్లే కలిగి ఉంది. చాలా తేలికగా ఉంటుంది. అల్ట్రా-థిన్ ఆప్షన్ అంటే.. చాలా అత్యంత సన్నని ఐఫోన్ అనమాట. టైటానియం ఫ్రేమ్‌ కలిగి ఉంది. A19 ప్రో చిప్ ద్వారా పవర్ అందిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ :
2025 ఆపిల్ ఐఫోన్ మోడల్స్‌లో కొత్త ఐఫోన్ ప్రో మోడల్స్ A19 ప్రో చిప్ ద్వారా పవర్ అందిస్తాయి. పర్ఫార్మెన్స్ పరంగా థర్మల్ సిస్టమ్‌ కలిగి ఉన్నాయి. ఈ ఐఫోన్లలో ట్రిపుల్ 48MP రియర్ కెమెరాలు, 18MP ఫ్రంట్ కెమెరా అత్యంత ఆకర్షణగా ఉన్నాయి.

ఆపిల్ ఐఫోన్ 17e :
2026 ఏడాదిలో ఐఫోన్ 16e తర్వాత కొత్త బడ్జెట్ మోడల్ ఐఫోన్ 17e మోడల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఐఫోన్ మోడల్ ధర కూడా భారీగా ఉండే అవకాశం ఉంది.

ఆపిల్ నిలిపివేసిన ఐఫోన్ మోడల్స్ ఇవే :

2025 సెప్టెంబర్ నెలలో ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ చేసిన తర్వాత అనేక పాత ఐఫోన్ మోడళ్లను నిలిపివేసింది.

  • ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ఐఫోన్ 16 ప్రో మాక్స్
  • ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్

FAQ : 2007 to 2025 వరకు విడుదలైన ఆపిల్ ఐఫోన్ మోడల్స్ :

1. ఆపిల్ ఒరిజినల్ ఫస్ట్ ఐఫోన్ ఎప్పుడు లాంచ్ అయింది? ధర ఎంతంటే?
ఆపిల్ ఒరిజినల్ ఫస్ట్ ఐఫోన్ 2007 జూన్ 29న రిలీజ్ అయింది. ఈ ఐఫోన్ దాదాపు రూ. 30వేల ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇందులో మెయిన్ ఫీచర్ మల్టీ టచ్ డిస్‌ప్లేతో ఫిజికల్ కీబోర్డ్ లేకుండా వచ్చింది.

2. ఆపిల్ ఐఫోన్ 6 ఎప్పుడు రిలీజ్ అయింది? ధర, కీలక ఫీచర్ ఏంటి?
ఐఫోన్ 6 మోడల్ 2014 సెప్టెంబర్ 19న రిలీజ్ అయింది. భారత మార్కెట్లో ఈ ఐఫోన్ 6 మోడల్ ధర రూ. 53వేలు. ఇందులో మెయిన్ ఫీచర్ 4.7 అంగుళాల రెటినా HD డిస్‌ప్లే, కొత్త సన్నని డిజైన్ కలిగి ఉంది.

3. ఆపిల్ ఐఫోన్ 11 భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అయింది?
ఐఫోన్ 11 మోడల్ 2019 సెప్టెంబర్ 10న రిలీజ్ అయింది. ఈ ఐఫోన్ (iPhone comparison) మోడల్ ప్రారంభ ధర రూ.49,900గా ఉంది. ఇందులో కీలక ఫీచర్ డ్యూయల్ కెమెరా సిస్టమ్, అల్ట్రా వైడ్ లెన్స్ కూడా కలిగి ఉంది.

4. ఆపిల్ ఐఫోన్ 13 ఎప్పుడు వచ్చింది? ధర, కీలక ఫీచర్లు ఏంటి?
ఆపిల్ ఐఫోన్ 13 మోడల్ 2021 సెప్టెంబర్ 14న లాంచ్ అయింది. భారత మార్కెట్లో ఈ ఐఫోన్ మోడల్ ప్రారంభ ధర రూ. 69,900గా ఉంది. మెయిన్ ఫీచర్ విషయానికి వస్తే A15 బయోనిక్ చిప్, బ్యాటరీ లైఫ్ అప్‌గ్రేడ్ అయింది.

5. ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్ ఎప్పుడు? ధర, కీలక ఫీచర్లు ఏంటి?
ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 2023 సెప్టెంబర్ 12న రిలీజ్ కాగా, భారత మార్కెట్లో ప్రారంభ ధర రూ.79,900గా ఉంది. కీలక ఫీచర్ USB-C ఛార్జింగ్ పోర్ట్, 48MP మెయిన్ కెమెరా కలిగి ఉంది.

6. ఆపిల్ ఐఫోన్ 17 లాంచ్, ధర కీలక ఫీచర్లు ఏంటి? :
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ 2025 సెప్టెంబర్ నెలలో లాంచ్ అయింది. ఈ ఐఫోన్ ప్రారంభ ధర రూ.82,900గా ఉంది. ఈ కొత్త ఐఫోన్ మోడల్ కీలక ఫీచర్లలో 120Hz OLED డిస్‌ప్లే, A19 చిప్ కలిగి ఉంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

‘రీడ్ తెలుగు వాయిస్’లో డిజిటల్ కంటెంట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ వార్తలను రాస్తుంటాను. తెలుగు మీడియా సంస్థల్లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది.

Leave a Comment