Car insurance 2025 : కొత్త కారు కొన్నారా? బీమా తీసుకున్నారా? భారత్‌లో టాప్ 5 కారు ఇన్సూరెన్స్ కంపెనీలివే.. ఏది బెస్ట్ అంటే?

Car insurance 2025 : భారతీయ వాహనదారులకు కారు ఇన్సూరెన్స్ అనేది అత్యంత అవసరం. మీ వాహనం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

Car insurance 2025 : కొత్త కారు కొన్నారా? లేదా కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే కారు కొన్న వెంటనే ఇన్సూరెన్స్ కూడా చేయించుకోండి. ప్రస్తుత రోజుల్లో భారతీయ వాహనదారులకు కారు ఇన్సూరెన్స్ అనేది అత్యంత అవసరం. మీరు మీ వాహనం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా కారు కొనడంతోనే (Car insurance 2025) ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి. మీ కారు ఏదైనా దురదృష్టకరంగా ప్రమాదానికి గురైనప్పుడు లేదా దొంగిలించబడినా లేదా పోగొట్టుకున్నప్పుడు లేదా మరేదైనా కారణం వల్ల కారును కోల్పోవడం జరుగుతుంటాయి.

ఇలాంటి పరిస్థితుల్లో కారు రిపేరింగ్ ఖర్చులు భారమవుతాయి. అందుకే ఇలాంటి సందర్భాల్లో మీరు ఏదైనా మంచి కారు ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే చట్టపరంగా భద్రత, మనశ్శాంతిని అందిస్తుంది. కారు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ముందుగా ఏ కారు బీమాను ఎంచుకోవాలో నిర్ణయించుకోవడం గందరగోళంగా అనిపిస్తుంది. అయితే, డోంట్ వర్రీ.. భారతీయ వినియోగదారులు 2025లో బెస్ట్ కారు ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

కారు ఇన్సూరెన్స్ ఏంటి? :

మీకు సొంత వాహనం ఉందా? అది కారు అయినా ఏదైనా వాహనం కావొచ్చు. మీకు సొంతంగా కారు ఉంటే జీవనం సాఫీగా సాగిపోతుంది. ఎందుకంటే ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడంటే అప్పుడు ఎక్కడకి అంటే అక్కడికి వెళ్లిపోవచ్చు. సొంత వాహనం ఉంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి.

Read Also : Retirement Planning : రిటైర్మెంట్ ప్లాన్.. ఈ 7 గోల్డెన్ రూల్స్ పాటించండి.. వృద్ధాప్యంలో ఒక్క పైసా ఎవర్ని అడగకుండా బతికేయొచ్చు!

అలాగే అనుకోని ప్రమాదం లేదా నష్టం వాటిల్లినప్పుడు కూడా ప్రయోజనం పొందగలిగేలా ఉండాలి. కొన్నిసార్లు మీ వాహనానికి సంబంధించి దొంగతనం, ప్రమాదం లేదా ప్రకృతి వైపరీత్యం వంటి కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు చాలా ఉన్నాయి.

Top 5 Car insurance 2025 Companies
Top 5 Car insurance 2025 Companies

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీ కారుకు ఇన్సూరెన్స్ ఉంటే అదే కాపాడుతుంది. మీ కారుకు సరైన ఇన్సూరెన్స్ కవరేజీని కలిగి ఉండాలి. ప్రస్తుతం భారత మార్కెట్లో అనేక ఇన్సూరెన్స్ ఆప్షన్లు ఉన్నాయి. మీరు కూడా కారు ఇన్సూరెన్స్ కోసం కోసం చూస్తుంటే మీకోసం అద్భుతమైన ఇన్సూరెన్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాహన చట్టం ప్రకారం.. ఈ కింది కారణాల వల్ల మీ కారుకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించి ఉండాలి. అవేంటో ఒక్కొక్కటిగా చదివి తెలుసుకుందాం..

రోడ్డు ప్రమాదాలు : భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమే. మీ కారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినప్పుడు ఆర్థిక భారాన్ని భరించాల్సిన అవసరం లేదు.

థర్డ్ పార్టీతో ప్రొటెక్ట్ చేయండి : మీరు ఏదైనా కారును ఢీకొట్టినట్లయితే ఆందోళన అక్కర్లేదు. ఈ కారు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ పరిహారం అందేలా చేస్తుంది.

చట్టపరంగా ఈజీ ప్రాసెస్ : కారు ప్రమాదం జరిగినప్పుడు లేదా మీ కారు దెబ్బతిన్నప్పుడు చట్టపరమైన చర్యల కోసం డబ్బు వృధా చేయాల్సిన అవసరం లేదు. చట్టపరమైన ప్రక్రియల విషయంలో ఈ ఇన్సూరెన్స్ బాధ్యత వహిస్తుంది.

Car insurance 2025 : భారత మార్కెట్లో టాప్ కారు ఇన్సూరెన్స్ కంపెనీలివే :

1.ఆకో (ACKO) :
ఆకో కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఒత్తిడి లేని క్లెయిమ్‌లుగా చెప్పొచ్చు. అద్భుతమైన కస్టమర్ సపోర్ట్, ఇతర బెనిఫిట్స్ అందిస్తాయి. కస్టమర్లలో ఎక్కువ మంది సర్వీసుకు సంబంధించి పాజిటివ్ రివ్యూలను అందించారు. సాధారణ పేపర్ వర్క్ ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా సరసమైన సర్వీసును అందిస్తారు. కంపెనీ విశ్వసనీయ కస్టమర్లకు తక్కువ ప్రీమియంలు, ఫ్రీ పికప్, డ్రాప్ క్లెయిమ్ ట్రాకింగ్, ఈజీ ఇన్సూరెన్స్ రెన్యువల్, 24/7 సర్వీసులను కూడా అందిస్తుంది.

ఆకో తమ కస్టమర్ల అవసరాలను తీర్చడానికి అద్భుతమైన ప్లాన్, వివిధ యాడ్-ఆన్‌లతో సహా వైడ్ రేంజ్ కవరేజ్ ఆప్షన్లను కూడా అందిస్తారు. ఆకో భారత్ అంతటా 4వేల కన్నా ఎక్కువ నెట్‌వర్క్ గ్యారేజీలతో టై-అప్‌లను కలిగి ఉంది. ఆర్థిక సంవత్సరం (FY 2023-24)కి క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో 99.10శాతంగా నమోదైంది.

2.ఐసీఐసీఐ లాంబార్డ్ :
ఐసీఐసీఐ లాంబార్డ్ కారు ఇన్సూరెన్స్ అనేది భూకంపాలు, వరదలు, మంటలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు, 6,800కు పైగా నెట్‌వర్క్ గ్యారేజీలలో క్యాష్ లెస్ రిపేరింగ్స్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, థర్డ్ పార్టీ చట్టపరమైన లియాబిలిటీ కవరేజీ, 50శాతం వరకు నో క్లెయిమ్ బోనస్, మల్టీ యాడ్-ఆన్‌లకు కవరేజీని అందిస్తుంది.

Best Mid Range Mobiles
Best Mid Range Phones Review : ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఫీచర్లు.. ఇప్పుడు మిడ్ రేంజ్‌లో బెస్ట్ 7 స్మార్ట్‌ఫోన్లు కేక.. అసలు మిస్ కాకండి!

దొంగతనం, ప్రమాదాలు, ఉగ్రవాద కార్యకలాపాలకు కవరేజ్ వంటి టాప్ ప్లాన్లను కూడా కవర్ అవుతాయి. యాడ్-ఆన్ ప్లాన్ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, జీరో డిప్రిసియేషన్, ఇంజిన్ ప్రొటెక్షన్, క్యాష్‌లెస్ ప్రక్రియల వంటి క్లెయిమ్‌ల ఫీచర్లను కవర్ చేస్తుంది. అంతేకాకుండా, FY 2023-24 (మోటార్ ఓన్ డ్యామేజ్) కోసం ఐసీఐసీఐ లాంబార్డ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో 93.4శాతం వద్ద ఉంటుంది.

3.డిజిట్ ఇన్సూరెన్స్ (Digit Insurance) :

డిజిట్ ఇన్సూరెన్స్ అనేది భారత మార్కెట్లో పాపులర్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఇదొకటి. మల్టీ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌ల ఫీచర్లలో పేపర్‌లెస్ ప్రాసెస్, ఈజీ క్లెయిమ్‌లు, ఫాస్ట్ డిజిటల్ ఆన్‌లైన్ కొనుగోళ్లు, కార్ డ్యామేజ్ కవరేజ్, థర్డ్-పార్టీ కవరేజ్, పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీ ప్లాన్లు ఉన్నాయి. ఈ వైడ్ రేంజ్ ప్లాన్‌లలో జీరో డిప్రిసియేషన్, ఇంజిన్ ప్రొటెక్షన్, కన్స్యూమబుల్ కవర్లు, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి యాడ్-ఆన్‌లు ఉన్నాయి.

అందులో బ్రాండ్ న్యూ కార్లు, సెకండ్ హ్యాండ్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు, పాత కార్లు, వాణిజ్య కార్లు, సీఎన్‌జీ కార్లు వంటి వైడ్ రేంజ్ వెహికల్స్‌ను కవరేజీ అందిస్తారు. డిజిట్ ఇన్సూరెన్స్ అంతటా 9వేల కన్నా ఎక్కువ నెట్‌వర్క్ గ్యారేజీలతో భాగస్వామ్యం కలిగి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో 96.10 శాతంగా ఉంది.

4.బజాజ్ అలియాంజ్ (Bajaj Allianz) :
బజాజ్ అలియాంజ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రమాదాలు, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు, థర్డ్ పార్టీ లియబిలిటీ, ఇన్‌స్టంట్ క్లెయిమ్ సెటిల్మెంట్, మీ కారు రిపేరింగ్ కోసం 7,200కు పైగా నెట్‌వర్క్ గ్యారేజీలు, అలాగే కస్టమర్లకు 24/7 స్పాట్ అసెస్టెన్స్ కవరేజీ అందిస్తుంది.

Top 5 Car insurance 2025 Companies
Top 5 Car insurance 2025 Companies

ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ జీరో డిప్రిషియేషన్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంజిన్ ప్రొటెక్షన్, తక్కువ ఖర్చులు, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో వంటి యాడ్-ఆన్‌లతో కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే కస్టమర్లకు పూర్తి కవరేజీని అందిస్తుంది. అంతేకాకుండా, ఇన్సూరెన్స్ కంపెనీ 98శాతం హై క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది విశ్వసనీయతను మరింత పెంచేలా చేస్తుంది.

5.హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ( HDFC ERGO) :
హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు 9వేల కన్నా ఎక్కువ క్యాష్‌లెస్ (Car insurance 2025) గ్యారేజీల నెట్‌వర్క్‌కు భారీ మొత్తంలో లింక్ అయి ఉంటాయి. ఎక్కడైనా సరే ఈజీగా రిపేరింగ్ చేసుకునేందుకు ఈ గ్యారేజీలు అనుకూలంగా ఉంటాయి.

కంపెనీ పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజీ, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం, థర్డ్ పార్టీ లియబిలిటీ, కొన్ని యాడ్-ఆన్‌లతో సహా వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తుంది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వైడ్ రేంజ్ కవరేజ్ ఆప్షన్లను కూడా అందిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కవరేజీల పోటీ ధర 99.8శాతం హై క్లెయిమ్‌ల పరిష్కార నిష్పత్తి భారతీయ కార్ ఇన్సూరెన్స్ మార్కెట్‌లో గట్టి పోటీదారుగా నిలిచేలా చేస్తాయి.

2025లో సరైన కారు ఇన్సూరెన్స్ కొనడం అనేది అత్యంత అవసరం. మీ వాహనం ఆధారంగా వైడ్ రేంజ్ కవరేజీని అందించే ఆఫర్‌లు లేదా ప్లాన్‌లను ఎంచుకోవాలి. మీ కారు ఏంటో తెలుసు.. అలాగే రోడ్డుపై ఆర్థిక భద్రత, మనశ్శాంతిని అందించే అన్ని ఆప్షన్లు పరిశీలించిన తర్వాత ఇన్సూరెన్స్ ఏది కావాలో ఎంచుకోవచ్చు.

Car Insurance Renewal : కారు ఇన్సూరెన్స్ రెన్యువల్ ఎలా? ఎప్పుడు చేయాలంటే? :

ఆన్‌‍లైన్‍లో కారు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయడం మొదట్లో చాలా ఈజీగానే ఉంటుంది. కానీ, కొన్ని కీలకమైన పనులను నిర్ణక్ష్యం చేస్తే భారీగా ఖర్చులు పెరుగుతాయని మర్చిపోవద్దు. కవరేజీ తగ్గుతుంది లేదంటే అనవసరమైన ఒత్తిడికి దారితీస్తుంది.

మెరుగైన పాలసీ విధానాలు, ఆన్‌లైన్ టూల్స్ 2025లో కారు ఇన్సూరెన్స్ రెన్యువల్ (car insurance renewal online) మరింత ఈజీ అవుతాయి. అందుకే కారు పాలసీకి సంబంధించి అన్ని విషయాలను ఎప్పటికప్పుడూ చెక్ చేస్తుండాలి. మీ కారు ఇన్సూరెన్స్ రెన్యువల్ గైడ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

చాలామంది కారు ఇన్సూరెన్స్ రెన్యువల్ విషయంలో పెద్దగా పట్టించుకోరు. చివరిలో కవర్ గడువు ముగిసిపోయిందని తెగ బాధపడిపోతుంటారు. బీమా లేకుండా కారు డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. అలాగే చట్టవిరుద్ధం కూడా. మీరు క్లెయిమ్ దాఖలు చేయాల్సి వస్తే భారీగా నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు.

అందుకే గడువు తేదీ కన్నా చాలా ముందుగానే నోటిఫికేషన్‌ను సెట్ చేయండి. సాధారణంగా 2 వారాల నుంచి 3 వారాల లీడ్ టైమ్ సరిపోతుంది. చాలా బీమా సంస్థలు ఇమెయిల్ లేదా SMS ద్వారా నోటిఫికేషన్లు కూడా పంపుతాయి. రెన్యువల్ ప్రక్రియను ప్రారంభించేందుకు రిమైండర్‌లుగా కూడా సెట్ చేసుకోవచ్చు.

మీ ప్రస్తుత కవరేజీని రివ్యూ చేయండి :
మీరు మీ కారు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసే ముందు మీ ప్రస్తుత పాలసీని ఇతర ఆఫర్లతో కంపేర్ చేసి చూడాలి. మీ రోజువారీ ప్రయాణం మారిందా? మీరు గత ఏడాదిలో కన్నా ఎక్కువ లేదా తక్కువ డ్రైవింగ్ చేస్తున్నారా? మీ కారులో ఎక్కువ కవరేజ్ అవసరమయ్యే ఏవైనా మార్పులు చేశారా? అనేది చెక్ చేసుకోవాలి.

Credit Card Tips _ 6 Common Big Mistakes That Can Trap You in Debt, Avoid Them Now
Credit Card Tips : క్రెడిట్ కార్డులు ఇలా వాడితే పక్కగా అప్పుల పాలవుతారు జాగ్రత్త.. ఈ 6 పెద్ద తప్పులు అసలు చేయొద్దు..!

అతి చిన్న సర్దుబాటు కూడా ఏ రకమైన పాలసీ అవసరమో తెలిసేలా చేస్తుంది. మీరు థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకుంటే.. వైడ్ కవరేజ్ ఉన్న టాప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కి మారడం గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని గమనించాలి.

ప్లాన్లు, ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌లతో పోల్చండి :
మీరు కారు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసే ముందు ప్రత్యామ్నాయ బీమా ఆప్షన్లను చెక్ చేసుకోవాలి. మీకు అవసరమైన ప్రొటెక్షన్ లెవల్, ప్రస్తుత కారు ఇన్సూరెన్స్ కంపెనీ ఇకపై అత్యల్ప-ధర కవరేజీని కలిగి ఉండకపోవచ్చు. పాపులర్ ఇన్సూరెన్స్ ప్లాన్ వివరాలను ఆయా వెబ్‌సైట్‌లలో ప్లాన్‌లతో సరిపోల్చండి. 

Read Also : Dhanteras 2025 : ధన్‌తేరాస్‌‌‌కు ముందు బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయి? గోల్డ్ ఎలా కొనుగోలు చేస్తే మంచిది?

అతి తక్కువ ప్రీమియం అసలు తీసుకోవద్దు. అలాగే, జీరో డిప్రిసియేషన్ కవర్, ఇంజిన్ ప్రొటెక్షన్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి యాడ్-ఆన్‌లను చెక్ చేయండి. ప్రొవైడర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, కస్టమర్ సర్వీస్ క్వాలిటీ కూడా నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది.

యాడ్-ఆన్‌ వాల్యూను చెక్ చేసుకోండి :
యాడ్-ఆన్‌లు అనేవి మీ ప్రైమరీ ఇన్సూరెన్స్ పాలసీని మించి విస్తరించే అదనపు కవరేజీలు ఉన్నాయి. మీకు అదనపు ఖర్చును అందిస్తాయి. కొన్ని కారణాల వల్ల పాపులర్ పొందిన కొన్ని యాడ్-ఆన్‌లు అందుబాటులో ఉన్నాయి. 

ఆన్‌లైన్‌లో రెన్యువల్‌తో సమయం ఆదా :
ఆన్‌లైన్ రెన్యువల్ ఇప్పుడు చాలా వేగంగా ఉంటుంది. చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు సులభమైన ఆన్‌లైన్ పోర్టల్‌ను అందిస్తాయి. మీరు ఈ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో పోల్చవచ్చు. మీ ప్రీమియం చెల్లించవచ్చు. మీ పాలసీ డాక్యుమెంట్లను నిమిషాల వ్యవధిలో పొందవచ్చు. ఈ విధానంతో పేపర్ వర్క్ ఉండదు. ఆన్‌లైన్‌లో మాత్రమే డిస్కౌంట్‌లను పొందవచ్చు.

మీ కారు కోసం ఒక కాపీని ప్రింట్ తీసుకోండి. మీ పాలసీని రెన్యువల్ చేసినప్పుడు మీ ఫోన్‌లో డిజిటల్ కాపీని తీసుకెళ్లండి. ఈ రెండు కలిగి ఉంటే మీకు బీమా ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు.

మీ నో క్లెయిమ్ బోనస్ (NCB) చెక్ చేసి అప్లయ్ చేయండి :

గత పాలసీ టైమ్‌లో ఎలాంటి క్లెయిమ్‌లు చేయలేదా? మీరు ప్రత్యేక తగ్గింపు పొందవచ్చు. మీరు క్లెయిమ్ చేయనంత వరకు ప్రతిఏటా పెరుగుతుంది. కాలక్రమేణా ఇది 50శాతం వరకు పొందవచ్చు.

మీరు ఇన్సూరెన్స్ కంపెనీలను మార్చినట్లయితే మీ NCB ముందుకు తీసుకెళ్లవచ్చు. కానీ, అలా చేసేందుకు అధికారిక పత్రం కోసం మీ బీమా సంస్థను సంప్రదించాలి. రెన్యువల్ సమయంలో ఎన్‌సీబీ ఉపయోగించడంతో ప్రీమియం ఖర్చులు భారీగా తగ్గుతాయి.

NCB ఎలా ప్రొటెక్ట్ చేయాలి? ఎలా ఉపయోగించాలి? :

  • ఇన్సూరెన్స్ కంపెనీలను మార్చుకుంటే మీ కొత్త బీమా సంస్థకు తెలియజేయండి.
  • మీ ప్రస్తుత బీమా సంస్థ నుంచి NCB సర్టిఫికెట్‌ కోసం రిక్వెస్ట్ చేయండి.
  • మీ నెక్స్ట్ పాలసీ రెన్యువల్ సమయంలో NCB కోసం అప్లయ్ చేసుకోండి.
  • మీ డిస్కౌంట్‌ ప్రొటెక్ట్ చేసుకునేందుకు చిన్న క్లెయిమ్‌ల జోలికి వెళ్లొద్దు.

మీ పాలసీ గడువు ముగియకముందే చెక్ చేయండి :

గత పాలసీ వ్యవధిలో మీరు క్లెయిమ్ చేయకపోతే NCB అనేది ప్రీమియంపై డిస్కౌంట్. డిస్కౌంట్ బేస్ రేటుకు వర్తిస్తుంది. నెక్స్ట్ క్లెయిమ్-ఫ్రీ ఏళ్లకు పేరుకుపోతుంది. గరిష్ట ప్రయోజనం 50శాతం వరకు ఉండవచ్చు. 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

నాకు జర్నలిజంలో 5 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ‘రీడ్ తెలుగు వాయిస్’లో డిజిటల్ కంటెంట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ వార్తలను రాస్తుంటాను. తెలుగు మీడియా సంస్థల్లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది.