SIP Investment Tips : పెట్టుబడి పెట్టాలనుకునేవారికి అద్భుతమైన న్యూస్.. మీ మొదటి జీతం రాగానే ఈ పని తప్పక చేయండి. అసలు తెలివితేటలు అనేది డబ్బు సంపాదించడంలో కాదు.. సంపాదించిన డబ్బును పొదుపుగా ఎలా దాచుకోవడం నేర్చుకోవడంలో ఉంది. మీ మొదటి జీతం అకౌంటులో పడిన వెంటనే మీరు చేయాల్సిన 5 ముఖ్యమైన పెట్టుబడులు ఉన్నాయి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రతి ఉద్యోగి జీవితంలో (SIP Investment Tips) ఫస్ట్ ఉద్యోగం, ఫస్ట్ జీతం అనేది అందమైన క్షణాలు. బహుమతులు ఇవ్వడం, పార్టీలు చేసుకోవడం కామన్. కానీ, మీరు తెలివైనవారైతే మీ మొదటి జీతంతో పెట్టుబడి పెట్టడం అత్యంత ముఖ్యం.
మీ మొదటి జీతంతో పెట్టుబడి పెట్టే అలవాటును పెంచుకుంటే రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. అప్పుడు మీ స్నేహితులు కూడా మిమ్మల్ని “ఫైనాన్స్ గురువు”గా పిలుస్తారు. ఇంతకీ మీ ఫస్ట్ ఇన్‌కమ్‌తో మీరు చేయవలసిన 5 పెట్టుబడులను ఇప్పుడు పరిశీలిద్దాం..
SIP Investment Tips : 1. SIPతో పెట్టుబడిని ప్రారంభించండి :
మీ మొదటి జీతం పడిన (First Salary Investment Tips) వెంటనే అందులో కొంత మొత్తాన్ని ఆదా చేయండి. ఆ మొత్తాన్ని SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)లో పెట్టుబడి పెట్టండి. మీ ప్రారంభ జీతం తక్కువగా ఉంటే.. కేవలం రూ. 500తో SIPని ప్రారంభించవచ్చు. మీ జీతం పెరిగేకొద్దీ SIP పెట్టుబడిని పెంచుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్లలో ఎస్ఐపీ గురించి అద్భుతమైన విషయం ఏమిటో తెలుసా? చిన్న మొత్తాలు కూడా కాలక్రమేణా రూ. కోట్ల రూపాయలకు పెరుగుతాయి. మార్కెట్ రిస్క్‌ను తగ్గించేందుకు ఎస్ఐపీలు అద్భుతమైన ఆప్షన్‌గా చెప్పవచ్చు.

2. కష్ట సమయాల్లో ఎమర్జెన్సీ ఫండ్ ఆదుకుంటుంది :
జీవితం ఎప్పుడైనా అనూహ్యంగా మారవచ్చు. ఉద్యోగం కోల్పోవడం, ఊహించని వైద్య ఖర్చులు, ఎమర్జెన్సీ ఫండ్‌తో రావచ్చు. కనీసం 6 నెలల ఖర్చులను అత్యవసర నిధిగా పక్కన పెట్టుకోండి. ఈ మొత్తాన్ని FD, సేవింగ్స్ అకౌంట్ లేదా లిక్విడ్ ఫండ్‌లో దాచుకోవచ్చు. మీరు అవసరమైనప్పుడు వెంటనే డబ్బును పొందవచ్చు.
SIP Investment Tips : 3. ఆరోగ్య బీమాతో అంతా ఆరోగ్యమే.. :
ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య బీమా అనేది అత్యంత ముఖ్యం. యువతలో ఎక్కువగా ఇదే ఆలోచన ఉంటుంది. “మనం ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం. కాబట్టి ఆరోగ్య బీమా ఎందుకు కొనాలి?” కానీ, వైద్య అత్యవసర పరిస్థితులు అనేవి చెప్పి రావు. భారీ ఆసుపత్రి బిల్లులను నివారించేందుకు వెంటనే ఆరోగ్య పాలసీని తీసుకోండి. చిన్న పిల్లల ప్రీమియంలు చాలా చౌకగా ఉంటాయి. ఎక్కువ కవరేజీని అందిస్తాయి. మీ కుటుంబంలో వృద్ధులు ఉంటే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అద్భుతమైన ఆప్షన్.
4. గ్యారెంటీ రాబడి పథకాలలో పెట్టుబడి పెట్టండి :
బ్యాలెన్స్ ఆర్థిక పోర్ట్‌ఫోలియో కోసం మీరు RD, PPF లేదా పోస్టాఫీస్ పథకాలతో పాటు SIP పెట్టుబడి ప్లాన్లలో కూడా చేర్చవచ్చు. ఈ పథకాలు సెక్యూరిటీ, గ్యారెంట్ రాబడిని అందిస్తాయి. ముఖ్యంగా PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్), పన్ను బెనిఫిట్స్ కూడా అద్భుతమైన లాంగ్ టైమ్ పెట్టుబడిని పెట్టవచ్చు.
5. NPS (నేషనల్ పెన్షన్ సిస్టమ్)తో రిటైర్మెంట్ చింతలు తీరినట్టే :
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇదో అద్భుతమైన ప్రభుత్వ రిటైర్మెంట్ స్కీమ్. చిన్నమొత్తంలో మొదలై భారీ మొత్తంలో కార్పస్‌ను సృష్టించవచ్చు. ఈ పథకం మీరు రిటైర్మెంట్ ఫండ్, పెన్షన్ రెండింటినీ నిర్వహించేందుకు అనుమతిస్తుంది.
NPSలో పెట్టుబడి పెట్టడం వల్ల సెక్షన్లు 80C, 80CCD(1B) కింద రూ. 2 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే.. మీ రిటైర్మెంట్ కార్పస్ అంత పెద్ద మొత్తంలో కూడబెట్టుకోవచ్చు.
SIP, SWP, STP మధ్య తేడా ఏంటి? ఎందులో బెనిఫిట్స్ ఎక్కువంటే? :
సాధారణంగా మ్యూచువల్ ఫండ్లలో SIP, SWP, STP కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మూడు పెట్టుబడి ఆప్షన్ల మధ్య వ్యత్యాసాన్ని తప్పక తెలుసుకోండి. SIP ఎవరి కోసం? SWP ఎప్పుడు ఉపయోగించాలి? స్మార్ట్ వ్యూహం కోసం STPని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ డబ్బును సంపాదించుకునేందుకు తెలివైన మార్గాలను వెతుకుతున్నారు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే విషయానికి వస్తే.. మనం తరచుగా SIP, SWP, STP వంటి పదాలను వింటుంటాం.
కానీ, అసలు వాటి అర్థం ఏంటి? 3 ఒకేలా ఉన్నాయా లేదా భిన్నంగా పనిచేస్తాయా? అనేది అతిపెద్ద ప్రశ్న. ఏది ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తుంది? మీ డబ్బును బాగా ఉపయోగించుకోవాలనుకుంటే SIP, SWP, STP మధ్య తేడాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
SIP అంటే ఏంటి? (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) :
ఎస్ఐపీ అనేది మీరు ప్రతి నెలా లేదా నిర్ణీత సమయంలో మ్యూచువల్ ఫండ్లలో చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టే పద్ధతి. మీ బడ్జెట్‌కు అనుకూలమైనది. రూపాయి ఖర్చు సగటు ద్వారా దీర్ఘకాలికంగా భారీ రాబడిని అందిస్తుంది. క్రమశిక్షణతో డబ్బు ఆదా చేయాలనుకునే వారికి మార్కెట్ సమయం రిస్క్ తీసుకోకూడదనుకునే వారికి SIP ప్రత్యేకంగా ఉంటుంది.

ఎస్ఐపీ ఎప్పుడు చేయాలి? :
మీరు చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద మొత్తాన్ని సంపాదించుకోవచ్చు. రిటైర్మెంట్, పిల్లల విద్య, అమ్మాయి పెళ్లి కోసం వంటి భారీ భవిష్యత్తు లక్ష్యాల కోసం వినియోగించుకోవచ్చు.
SIP ప్రయోజనాలివే :
కొద్ది మొత్తంలో డబ్బు భారీగా నిధిని సృష్టించగలదు. మీరు కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. స్టాక్
మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ పెట్టుబడి కొనసాగుతూనే ఉంటుంది.
SWP అంటే ఏంటి? (సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్) :
సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్ (SWP) అనేది మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. రిటైర్మెంట్ చేసిన వారికి లేదా సాధారణ ఆదాయం కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే.. మీ డబ్బు భారీ మొత్తంలో పెంచుకోవచ్చు. అవసరమైనప్పుడు ఫండ్స్ పొందవచ్చు.
SWP ఎప్పుడు చేయాలి? :
రిటైర్మెంట్ తర్వాత మీకు నెలవారీ ఆదాయం అవసరమైనప్పుడు SWP చేయాలి.
పన్నుపరంగా అద్భుతమైన ఆదాయాన్ని పొందడానికి
SWPతో ప్రయోజనాలివే :
- క్రమం తప్పకుండా క్యాష్ ఫ్లో (పెన్షన్).
- పన్ను దృక్కోణం నుంచి ప్రయోజనకరం
- ఫండ్స్ అలాగే ఉంటుంది. పైగా విలువ పెరుగుతూనే ఉంటుంది.
STP అంటే ఏంటి? (సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్) :
మీరు మీ డబ్బును ఒక ఫండ్ నుంచి మరొక ఫండ్‌కు క్రమం తప్పకుండా ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్నప్పుడు STP ఉపయోగపడుతుంది. మార్కెట్ అస్థిరత ప్రమాదాన్ని తగ్గించేందుకు సాధారణంగా ఏకమొత్తం పెట్టుబడులను క్రమంగా ఈక్విటీ ఫండ్లలోకి మార్చేందుకు ఉపయోగపడుతుంది.
STP ఎప్పుడు చేయాలి? :
- మీ దగ్గర ఒకేసారి డబ్బు ఉండి SIP మాదిరిగా ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే
- మార్కెట్ రిస్క్ తగ్గించేందుకు
ఎస్‌టీపీ ప్రయోజనాలివే :
- మొత్తం డబ్బు ఒకేసారి మార్కెట్లోకి వెళ్లదు.
- మార్కెట్ అస్థిరతను నియంత్రిస్తుంది.
మీకు ఏది ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుందంటే? :
చిన్న పెట్టుబడులతో ప్రారంభించి దీర్ఘకాలికంగా తమ డబ్బును పెంచుకోవాలనుకునే వారికి SIP అద్భుతంగా ఉంటుంది. SWP అనేది రిటైర్మెంట్ లేదా ఇతర అత్యవసర పరిస్థితులలో క్రమం తప్పకుండా ఆదాయం అవసరమైన వారికి అద్భుతంగా ఉంటుంది. STP అనేది రిస్క్ తగ్గించుకోవడానికి క్రమంగా ఈక్విటీలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే తెలివైన పెట్టుబడిదారులకు అద్భుతంగా ఉంటుంది.
రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ప్రణాళిక సరిగ్గా ఉండాలి. జీవితాన్ని సాఫీగా గడిపేందుకు ఆర్థికంగా ముందస్తు ప్లానింగ్ వేసుకోవడం చాలా అత్యవసరం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, ముందుగానే డబ్బులను సేవింగ్ చేయడం చాలా ముఖ్యం. ఇప్పటికే అనేక రిటైర్మెంట్ పెన్షన్ పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ అన్ని పథకాలలో SWP ద్వారానే అత్యధిక పెన్షన్ లభిస్తుంది.
SWP ద్వారా రూ. 10వేల పెన్షన్ ఎలా పొందాలి? :
మ్యూచువల్ ఫండ్లలో SWP (సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్) అనేది పెట్టుబడి పెట్టేందుకు ఒక మార్గం. SWP, SIP కలిపి ఉపయోగించడం ద్వారా మీరు రిటైర్మెంట్ తర్వాత భారీగా పెన్షన్ పొందవచ్చు. ఎక్కువ బెనిఫిట్స్ పొందాలనుకుంటే వీలైనంత త్వరగా పెట్టుబడి మొదలుపెట్టండి. SIP, SWP రెండూ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు సులభమైన మార్గాలుగా చెప్పవచ్చు. రిటైర్మెంట్ ఫండ్ కోసం ఉపయోగించవచ్చు.
రిటైర్మెంట్ ఫండ్ ఎలా పొందాలంటే? :
ప్రతిఒక్కరూ ముందుగా, వీలైనంత త్వరగా SIPలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. ఎస్ఐపీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే 12శాతం వరకు రాబడి లభిస్తుంది. అయితే, ఈ రాబడి మార్కెట్ హెచ్చుతగ్గులను బట్టి మారుతుందని గమనించాలి. 35 ఏళ్ల వయస్సులో రిటైర్మెంట్ కోసం ఎస్ఐపీలో పెట్టుబడి ప్రారంభిస్తే వారికి రిటైర్మెంట్ వరకు 25 ఏళ్లు ఉంటాయి.
ఈ డబ్బును మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టండి. ఆ తర్వాత 25 ఏళ్లలో ఏ ఫండ్ అయినా SWP ద్వారా పెట్టుబడి పెట్టండి. ఆ తర్వాత మీరు SWP ద్వారా ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని పెన్షన్‌గా పొందవచ్చు. అయితే, కొంత మొత్తం మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అధిక రాబడితో అందుకుంటారు.
ఒక వ్యక్తికి 35 ఏళ్ల వయస్సు నుంచి ప్రతి నెలా రూ. 5వేలు SIPలో పెట్టుబడి పెట్టాడని అనుకుందాం.. 25 సంవత్సరాల తర్వాత, 12శాతం రాబడితో అతని మొత్తం కార్పస్ రూ. 8,511,033 అవుతుంది. ఆపై అతను SWPలో రూ. 8,500,000 పెట్టుబడి పెడతాడు.
60 ఏళ్లు నిండిన తర్వాత ఎస్‌డబ్ల్యూపీ నుంచి రూ.10,000 ఆదాయంగా పొందుతాడు. ఈ డబ్బును SWPలో 10 ఏళ్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటాడు. అలా 10 ఏళ్లు పెట్టుబడి నుంచి ఆదాయాన్ని పొందుతూనే ఉంటాడు. 10 ఏళ్ల తర్వాత అతనికి రూ. 1,65,49,620 కూడా అందుతుంది.
SIP ద్వారా రూ. లక్ష పెట్టుబడి పెడితే :
ఎస్ఐపీలో ఇప్పుడు ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి బదులుగా మీరు 10శాతం వార్షిక రాబడి ఆశించే SIP ద్వారా మ్యూచువల్ ఫండ్‌లో నెలకు రూ. 8,333 (రూ. 1 లక్షను 12 నెలల్లో ) పెట్టుబడి పెట్టారని అనుకుందాం.. రూపాయి ఖర్చు సగటుతో మీరు వేర్వేరు ధర స్థాయిలలో యూనిట్లను కొనుగోలు చేస్తారు. మార్కెట్ రిస్క్ కూడా తగ్గుతుంది. కాంపౌండింగ్, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి కారణంగా కార్పస్ కాలక్రమేణా స్థిరంగా పెరుగుతుంది.
10 ఏళ్ల తర్వాత 10శాతం CAGR అని ఊహిస్తే.. మీ SIP పెట్టుబడి సుమారు రూ. 17 లక్షలకు పెరుగుతుంది. SWP అనేది ఇన్‌స్టంట్ ద్రవ్యతను అందిస్తుంది. కానీ, విత్‌డ్రాలు రాబడిని మించిపోతే మూలధనాన్ని కోల్పోవచ్చు. SIP దీర్ఘకాలిక సంపద సేకరణకు సాయపడుతుంది. కాంపౌండింగ్ పవర్ కూడా పెరుగుతుంది.
పెట్టుబడికి బెస్ట్ SWP ఇన్వెస్టమెంట్ ఆప్షన్లు :
సరైన SWP ఎంచుకోవడం ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. మీరు వెంటనే విత్‌డ్రాలను ప్రారంభించాలనుకుంటే బెస్ట్ ఆప్షన్లు. మీరు వెంటనే ప్రారంభించాలనుకుంటే బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్, ఈక్విటీ హైబ్రిడ్, మల్టీ అసెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు బెస్ట్ SWP ఆప్షన్లు. మీరు 3 ఏళ్ల పెట్టుబడి తర్వాత SWP ప్రారంభించాలనుకుంటే మిడ్‌క్యాప్, మల్టీక్యాప్ ఫండ్స్ బెస్ట్ అని చెప్పొచ్చు.







