Cash vs Home Loan : నగదుతో ఇల్లు కొనాలా? హోం లోన్ తీసుకోవాలా? మీ జీతం, EMI ఎంత ఉండాలి? పూర్తి లెక్కలు మీకోసం..!

Cash vs Home Loan : చాలామంది గృహ రుణం తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. నగదుతో ఇల్లు కొనాలా? హోం లోన్ తీసుకోవాలా? ఏది బెటర్? ఎందులో రిస్క్ ఎక్కువ? రిస్క్ తక్కువ ఉంటుంది? పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Updated on: November 19, 2025

Cash vs Home Loan : నగదుతో ఇల్లు కొనాలా? లేదా హోం లోన్ తీసుకోవాలా? ఈ రెండింటిలో ఏది బెటర్? ఎందులో రిస్క్ ఎక్కువ? రిస్క్ తక్కువ ఉంటుంది? మీరు కూడా ఇదే ప్రశ్నతో ఆలోచనలో పడ్డారా? అయితే, అప్పులపాలవ్వకుండా ఉండాలంటే మీరు ఈ లెక్కలను తప్పక అర్థం చేసుకోవాల్సిందే..

అలా చేస్తే మీరు చాలా (Cash vs Home Loan) సంపాదించుకోవచ్చు. మీ దగ్గర ఇల్లు కొనేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బు ఉందా? అయితే, చాలామంది గృహ రుణం తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.

కొన్ని సందర్భాల్లో ఈ నిర్ణయం తెలివైనదే కావొచ్చు. మరికొన్నింటిలో అది కాదని గమనించాలి. సరైన ఆర్థిక వ్యూహాన్ని పాటించాలి. తద్వారా మీరు రాబోయే 20 ఏళ్లలో భారీగా అధిక లాభాలను సంపాదించవచ్చు. వాస్తవానికి, చాలా మంది ధనవంతులు అప్పుల గురించి అసలు భయపడరు. వారు ఆ అప్పులనే పెట్టుబడికి సాధనంగా ఉపయోగిస్తుంటారు.

Cash vs Home Loan
Cash vs Home Loan

మనలో చాలామంది ఇల్లు కొనేందుకు లేదా బ్యాంకు నుంచి గృహ రుణం తీసుకునేందుకు ఏళ్ల తరబడి డబ్బులు ఆదా చేస్తారు. చేతిలో డబ్బులు ఉండగా అప్పు తీసుకోవడం ఎందుకు అని భావిస్తుంటారు. మీ దగ్గర డబ్బు ఉంటే అప్పు ఎందుకు తీసుకోవాలి? కానీ నిజం ఏమిటంటే? అప్పు లేకుండా ఇల్లు తీసుకోవడం అనేది ఎల్లప్పుడూ తెలివైన ఆర్థిక నిర్ణయం కాదని గమనించాలి.

మీ దగ్గర రూ. 50 లక్షలు ఉంటే.. ఒకేసారి ఇంట్లో పెట్టుబడి పెట్టేందుకు బదులుగా తెలివైన వ్యూహాన్ని అనుసరించాలి. తద్వారా రాబోయే 20 ఏళ్లలో అదనపు లాభాలను పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Gold ETF vs Mutual Funds 2025 : గోల్డ్ ETF, మ్యూచువల్ ఫండ్స్‌ మధ్య తేడాలేంటి? ఏది బెటర్? గోల్డ్ పెట్టుబడితో లాభాలే లాభాలు..!

స్మార్ట్ మనీ వ్యూహం ఏంటి? :
ఈ వ్యూహం చాలా సింపుల్.. కానీ, ఆర్థిక తర్కంపై పనిచేస్తుంది. పెట్టుబడి రాబడి అనేది రుణ వడ్డీ కన్నా ఎక్కువగా ఉంటే రుణం తీసుకోవడమే మంచిది. మీరు దాదాపు 9శాతం రేటుతో గృహ రుణం తీసుకోవచ్చు.

మరోవైపు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే సగటున 12శాతం రాబడి పొందవచ్చు. అంటే.. మీరు గృహ రుణం తీసుకొని మీ డబ్బును మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే మీకు 3శాతం అధిక రాబడిని అందిస్తుంది. ఇలా కొనసాగిస్తే కాలక్రమేణా కోట్లు సంపాదించుకోవచ్చు.

Cash vs Home Loan : మీరు ఇల్లు క్యాష్‌తో కొంటే లెక్కలేంటి? :

ఢిల్లీ ఎన్‌సీఆర్ లాంటి ప్రదేశంలో మీరు దాదాపు రూ.50 లక్షలకు 2BHK ఫ్లాట్ కొనుగోలు చేయొచ్చు. మీ దగ్గర రూ.50 లక్షలు ఉంటే డబ్బు చెల్లించి కొత్త ఇల్లు కొనడమే మంచిది. రుణం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈఎంఐలు చెల్లించాల్సిన ఇబ్బంది లేదు. ఇంటి విలువ అనేది కూడా సంవత్సరానికి సగటున 9శాతం చొప్పున పెరుగుతాయి. అంటే.. 20 సంవత్సరాల తర్వాత మీ ఇంటి విలువ దాదాపు రూ.2.80 కోట్లు అవుతుంది.

గృహ రుణం తీసుకుంటే లెక్కలేంటి? :
మీరు రూ.50 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేస్తే.. ఆ మొత్తంలో దాదాపు 20శాతం లేదా దాదాపు రూ. 10 లక్షలు డౌన్‌పేమెంట్‌గా చెల్లించాలి. 80శాతం లేదా రూ.40 లక్షలు గృహ రుణం అవుతుంది. దాదాపు 9శాతం రేటుతో లభిస్తుంది. 20 ఏళ్లలో మీరు రూ.40 లక్షల రుణంపై దాదాపు రూ. 46.37 లక్షల వడ్డీని చెల్లిస్తారు. అంటే.. మీ మొత్తం ఖర్చు రూ. 86.37 లక్షలు ఉంటుంది.

Retirement Planning : 7 Golden Rules to Live Stress-Free Without Asking Anyone for Money
Retirement Planning : రిటైర్మెంట్ ప్లాన్.. ఈ 7 గోల్డెన్ రూల్స్ పాటించండి.. వృద్ధాప్యంలో ఒక్క పైసా ఎవర్ని అడగకుండా బతికేయొచ్చు!

ఇప్పుడు, మీ దగ్గర రూ. 40 లక్షల క్యాష్ మిగిలే ఉంటుంది. మీరు వేరే చోట ఈ డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే మీ డబ్బు 20 సంవత్సరాలలో దాదాపు 12శాతం చొప్పున పెరిగి సుమారు రూ. 3.85 కోట్లకు చేరుకుంటుంది.

మీకు ఎంత లాభమంటే? :
మీరు గృహ రుణంతో ఇల్లు కొనుగోలు చేస్తే.. 20 సంవత్సరాల తర్వాత రూ. 10 లక్షల డౌన్ పేమెంట్, మిగిలిన రుణ వడ్డీ రూ. 40 లక్షలు కలిపి మొత్తం రూ. 86.37 లక్షలు అవుతుంది. అంటే.. రూ. 10 లక్షల డౌన్ పేమెంట్‌తో కూడా మీకు మొత్తం రూ. 96.37 లక్షలు వస్తాయి. ఈ పెట్టుబడి మీకు మొత్తం రూ. 3.85 కోట్లు నికర లాభం చేకూరుస్తుంది. ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా మీకు రూ. 2.88 కోట్ల లాభం ఉంటుంది.

Cash vs Home Loan
Cash vs Home Loan

మీరు నగదుతో ఇల్లు కొంటే.. ఒకేసారి రూ. 50 లక్షలు ఖర్చవుతుంది. 20 ఏళ్ల తర్వాత ఇంటి విలువ 9శాతం పెరిగి రూ. 2.80 కోట్లకు చేరుకుంటుంది. మీరు సుమారు రూ. 8 లక్షలు పొందుతారు. 20 ఏళ్లలో చాలా తక్కువ. అయితే, మీరు మ్యూచువల్ ఫండ్స్ నుంచి అధిక రాబడిని పొందినట్లయితే మీరు భారీ మొత్తంలో ప్రయోజనం పొందుతారు.

Cash vs Home Loan : ఇల్లు ఎప్పుడు నగదుతో కొనాలి? ఎప్పుడు హోం లోన్ తీసుకోవాలి? :

మీకు భవిష్యత్తులో కొనే ఆ ఆస్తి నుంచి మంచి రాబడిని ఇస్తుందని మీరు నమ్మితే నగదు రూపంలో ఇల్లు కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే.. ఆ ఆస్తి రాబడి మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే, మీరు దీన్ని నమ్మకపోతే.. మీరు హోం లోన్ తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా 12శాతం రాబడిని అందిస్తాయి. కానీ, కొన్నిసార్లు ఇది చాలా ఎక్కువగా ఉండవచ్చు. అంటే మీరు భారీ మొత్తంలో రాబడిని సంపాదించవచ్చు.

SBI నుంచి రూ. 50 లక్షల హోం లోన్‌కు జీతం, EMI ఎంత ఉండాలి? :
ఎస్బీఐ నుంచి రూ. 50 లక్షల హోం లోన్ (SBI Home Loans Interest Rates) పొందాలని అనుకుంటున్నారా? లేటెస్ట్ వడ్డీ రేట్లు, ఈఎంఐ లెక్కలు, అవసరమైన జీతం వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి ఒక్కరూ తమ ఇంటిని సొంతం చేసుకోవాలని కలలు కంటారు. కానీ, పెరుగుతున్న ఆస్తి ధరలు కొత్త ఇంటి కలను కష్టతరం చేస్తాయి. ఇలాంటి పరిస్థితిలో బ్యాంక్ హోం లోన్ బిగ్ రిలీఫ్ అందిస్తుంది. హోం లోన్‌తో మీ ఇంటిని వెంటనే కొనుగోలు చేయవచ్చు. ఆ ఖర్చును దీర్ఘకాలికంగా EMIలలో రీ పేమెంట్ చేయొచ్చు.

మీరు కూడా కొత్త ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మీకు అద్భుతమైన అవకాశం అందిస్తోంది. ఆగస్టు 2025 నుంచి అమలులోకి వచ్చిన గృహ రుణ వడ్డీ రేట్లను బ్యాంక్ అప్‌డేట్ చేసింది. మీ CIBIL స్కోరు, రుణ వ్యవధిని బట్టి హోం లోన్ రేట్లు ఇప్పుడు 7.50శాతం నుంచి 8.70శాతం వరకు ఉంటాయి. రూ. 50 లక్షల రుణానికి ఈఎంఐ ఎంత ఉంటుంది? అర్హత పొందడానికి మీ ఆదాయం ఎంత ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Cash vs Home Loan : ఎస్బీఐ లేటెస్ట్ హోం లోన్ వడ్డీ రేట్లు ఇవే :

  • గృహ రుణం (TL) : 7.50శాతం నుంచి 8.70 శాతం
  • గృహ రుణ గరిష్ట లాభం (OD) : 7.75 శాతం నుంచి 8.95 శాతం
  • టాప్ అప్ లోన్ : 8.00 శాతం నుంచి 10.75 శాతం
  • టాప్ అప్ (OD) లోన్ : 8.25 శాతం నుంచి 9.45 శాతం
  • ఆస్తిపై రుణం (P-LAP) : 9.20 శాతం నుంచి 10.75 శాతం
  • రివర్స్ మార్ట్‌గేజ్ లోన్ (RML) : 10.55 శాతం
  • యోనో ఇన్‌స్టా హోమ్ టాప్ అప్ లోన్ : 8.35 శాతం

అన్ని గృహ రుణాలు EBLR (ఎక్స్‌ట్రనల్ బెంచ్‌మార్క్ లోన్ రేటు)తో లింక్ అయి ఉంటాయి. ప్రస్తుతం, ఈబీఎల్ఆర్ 8.15శాతంగా ఉంది.

రూ. 50 లక్షల గృహ రుణంపై ఈఎంఐ ఎంతంటే? :
మీరు 20 ఏళ్లు (240 నెలలు) కాలపరిమితికి 8.50శాతం వడ్డీ రేటుతో రూ. 50 లక్షల రుణం తీసుకున్నారని అనుకుందాం. మీ ఈఎంఐ నెలకు రూ. 43,219 అవుతుంది. అన్ని కాల పరిమితులకు ఈఎంఐ ఎంత ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం..

లోన్ కాలపరిమితిEMI (రూ. 50 లక్షల వరకు)మొత్తం వడ్డీ  మొత్తం చెల్లింపు
10 సంవత్సరాలు రూ.61,990రూ.24,38,800రూ.74,38,800
15 సంవత్సరాలు రూ.49,173రూ.38,51,140రూ.88,51,140
20 సంవత్సరాలురూ.43,219రూ.53,72,560రూ.1,03,72,560
25 సంవత్సరాలురూ.40,293రూ.70,88,030రూ.1,20,88,030
30 సంవత్సరాలురూ.38,468రూ.88,48,480రూ.1,38,48,480   

 జీతం ఎంత ఉండాలి? :
మీ ఈఎంఐ మీ ఆదాయంలో 40 శాతం నుంచి 45 శాతం మించకుండా బ్యాంక్ అందిస్తుంది. ఈఎంఐ రూ.43,219 అయితే, మీ చేతికి వచ్చే జీతం నెలకు కనీసం రూ.95వేలు నుంచి రూ.1,00,000 వరకు ఉండాలి.

గృహ రుణాల వల్ల కలిగే 5 ప్రయోజనాలివే.. ధనవంతులు ఇలానే ఇళ్ళు కొనేస్తుంటారు :

గృహ రుణం అనగానే వెంటనే నెలవారీ ఈఎంఐల భారాన్ని గుర్తుకు తెస్తుంది. చాలా మంది తమ దగ్గర డబ్బు ఉన్నప్పుడే కొత్త ఇల్లు కొనడమే మంచిదని అనుకుంటారు. రుణం కోసం ఎందుకు ఇబ్బంది పడాలి? అయితే, ఎల్లప్పుడూ నగదు కొరత ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, ధనవంతులు కూడా హోం లోన్లపైనే ఆధారపడుతుంటారు.

SIP Investment Tips
SIP Investment Tips : మీకు ఫస్ట్ జీతం వచ్చిన వెంటనే ఈ 5 పెట్టుబడులు పెట్టండి.. జీవితాంతం డబ్బుకు లోటు లేకుండా బతికేయొచ్చు..!

దీనికి కారణం ఒక్కటే.. గృహ రుణం అనేది ఇల్లు కొనేందుకు ఒక మార్గం మాత్రమే కాదు.. తెలివైన ఆర్థిక ప్లానింగ్ టూల్ కూడా. గృహ రుణం తీసుకోవడం కలిగే 5 కీలక ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఫస్ట్ బెనిఫిట్ : ఆదాయపు పన్ను ఆదా :
హోం లోన్ ఫస్ట్ ప్రధాన బెనిఫిట్ పన్ను ఆదా చేయడం.. సెక్షన్ 24(b) వడ్డీపై సంవత్సరానికి రూ.2 లక్షల వరకు మినహాయింపును అందిస్తుంది. సెక్షన్ 80C అసలుపై రూ.1.5 లక్షల వరకు మినహాయింపును అందిస్తుంది. లోన్ జాయింట్‌గా ఉంటే దరఖాస్తుదారులు ఇద్దరూ రూ.7 లక్షల వరకు పన్ను ఆదా చేయొచ్చు.

రెండో బెనిఫిట్ – ఆస్తి హక్కుపై గ్యారెంటీ :
మీరు గృహ రుణం కోసం అప్లయ్ చేసినప్పుడు బ్యాంకులు ఆమోదించే ముందు ఆస్తి టైటిల్, రికార్డులను చెక్ చేస్తాయి. ఆ తర్వాత ఆస్తిపై ఎలాంటి వివాదాలు లేవని నిర్ధారించుకుంటాయి. చట్టపరమైన ధృవీకరణ అన్ని అవసరమైన డాక్యుమెంట్లను ధృవీకరిస్తుంది.

మీరు చూపించే ఆస్తి మరే ఇతర వృత్తిలో లేదని నిర్ధిరించుకోవాలి. గృహ కొనుగోలుదారులకు భారీగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే.. ఇళ్లు కొనుగోలు చేస్తున్న ఆస్తి వివాదాలు లేకుండా ఉందని గ్యారెంటీ ఇవ్వడం అనమాట..

మూడో బెనిఫిట్ – మహిళా సహ-దరఖాస్తుదారునితో ప్రయోజనాలు :

గృహ రుణం కోసం మీతో పాటు సహ దరఖాస్తుదారుడిగా మహిళ ఒకరు ఉంటే.. మీరు కొంచెం చౌకైన రుణాన్ని పొందవచ్చు. మహిళా సహ దరఖాస్తుదారు ఉన్నవారికి చాలా బ్యాంకులు 0.05 శాతం తక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి.

నాల్గో బెనిఫిట్ – కస్టమర్ ఫ్రెండ్లీ లోన్లు :
ఇతర రుణాల కన్నా గృహ రుణాలు మాత్రం కస్టమర్లకు అత్యంతగా అనుకూలంగా ఉంటాయి. ఈ లోన్లలో వడ్డీ రేట్లు వ్యక్తిగత లేదా గోల్డ్ రుణాల కన్నా చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా, తిరిగి చెల్లించే నిబంధనలు సులభంగా ఉంటాయి. కస్టమర్లు కోరుకుంటే ముందస్తు పేమెంట్ లేదా ప్రీక్లోజింగ్ చేయవచ్చు. అందుకే మీ సేవింగ్స్ ఖాళీ చేయడం కన్నా గృహ రుణం తీసుకోవడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

ఐదో బెనిఫిట్ – టాప్-అప్ లోన్ సౌకర్యం :
మీరు తీసుకున్న గృహ రుణంపై టాప్-అప్ రుణాన్ని కూడా పొందవచ్చు. టాప్-అప్ హోం లోన్ అనేది తక్కువ వడ్డీ రేట్లను అందించే అద్భుతమైన పర్సనల్ లోన్. మీకు ఎక్కువ తిరిగి చెల్లించే వ్యవధి కూడా ఉంటుంది.

ఎందుకంటే.. ఈ లోన్ కాలపరిమితి మీ గృహ రుణ కాలపరిమితిపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. పైగా ఇందులో ఎలాంటి హిడెన్ ఛార్జీలు ఉండవు. మీరు సెమీ-ఫర్నిష్డ్ లేదా పాత అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసి ఉంటే.. మీరు ఇంటీరియర్ రీడిజైన్ లేదా మరమ్మత్తుల కోసం సులభంగా టాప్-అప్ లోన్ పొందవచ్చు.

FAQ : హోం లోన్ తీసుకునే కస్టమర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివే :

1. SBI గృహ రుణంపై లేటెస్ట్ వడ్డీ రేటు ఎంతంటే?

సిబిల్ (CIBIL) స్కోర్, లోన్ కాలపరిమితి ఆధారంగా 7.50శాతం నుంచి 8.70 శాతం మధ్య ఉంటుంది.

2. రూ. 50 లక్షల గృహ రుణానికి ఈఎంఐ ఎంత ఉంటుంది?

20 సంవత్సరాల పాటు నెలకు దాదాపు రూ.43,219 చెల్లించాల్సి ఉంటుంది.

3. SBI గృహ రుణానికి జీతం ఎంత ఉండాలి?

నెలవారీ కనీస జీతం రూ.95వేల నుంచి రూ. 1,00,000 ఉండాలి.

4. గృహ రుణం తీసుకోవడం అన్నివేళలా బెనిఫిట్ ఉంటుందా?

లేదనే చెప్పాలి. వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మీ ఆదాయం స్థిరంగా లేనప్పుడు హోం లోన్ తీసుకోవద్దు.

5. అసలు సగటు గృహ రుణ వడ్డీ రేటు ఎంత ఉంటుంది?

ప్రస్తుతం హోం లోన్ వడ్డీ రేటు 8.5 శాతం నుంచి 9.5 శాతం వరకు ఉంటుంది.

6. నేను క్యాష్ ఇచ్చి ఇల్లు కొంటే కలిగే ప్రయోజనాలు ఏంటి?

మీరు EMI, వడ్డీ నుంచి డబ్బును భారీగా ఆదా చేసుకోవచ్చు. కానీ, పెట్టుబడి కాంపౌండింగ్ ప్రయోజనాన్ని కోల్పోతారు.

7. హోం లోన్ ముందుగానే తిరిగి చెల్లించడం సరైన పనేనా?

మీరు పెట్టిన పెట్టుబడిపై రాబడి వడ్డీ కన్నా చాలా తక్కువగా ఉంటే తొందరగా లోన్ మొత్తాన్ని క్లియర్ చేయడం చాలా మంచిది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

‘రీడ్ తెలుగు వాయిస్’లో డిజిటల్ కంటెంట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ వార్తలను రాస్తుంటాను. తెలుగు మీడియా సంస్థల్లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది.