Third-Party Insurance 2025 : కారు, బైక్ ఏదైనా ఈ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ మస్ట్.. లేదంటే భారీగా నష్టపోతారు.. ఎందుకు తీసుకోవాలి? బెనిఫిట్స్ ఏంటి?

Third-Party Insurance 2025 : ప్రతి వాహనదారుడు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి కాదా? లేదా ఆప్షనలా? అని తెలుసుకోండి. బెనిఫిట్స్, లీగల్ రూల్స్, కవరేజ్ వివరాలు, ప్రీమియం వివరాలివే..

Third-Party Insurance 2025 : మీ బండికి ఇన్సూరెన్స్ ఉందా? కారు కావొచ్చు లేదా బైక్ కావచ్చు ఏదైనా వాహనానికి మోటారు ఇన్సూరెన్స్ ఉందా? లేదంటే భారీగా చలాన్ వస్తుంది. మీ జేబు ఖాళీ అవుతుంది. ప్రతి వాహన యజమానికి థర్డ్-పార్టీ బీమా చాలా అవసరం. ఎందుకంటే.. ఇది రోడ్డు ప్రమాదాలలో కలిగే నష్టాలను భర్తీ చేస్తుంది. ఈ (Car Insurance) ఇన్సూరెన్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు చట్టపరంగా ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది. తక్కువ ప్రీమియంతో భారీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంతకీ ఈ థర్డ్ పార్టీ ఎవరు తీసుకోవాలి? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. ఒక సింపుల్ ఉదాహరణతో ఇప్పుడు తెలుసుకుందాం..

థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ఏంటి? :
భారత మార్కెట్లో ప్రతి ఒక్కరూ కారు (Third-Party Insurance 2025) కొనేందుకు ఆసక్తి చూపుతారు. అయితే, కారు కొన్నాక ఇన్సూరెన్స్ కేవలం లాంఛనప్రాయంగా భావిస్తారు. కొన్నిసార్లు చాలామంది ఏదో ఒక ఇన్సూరెన్స్ ఉండాలి కదా అని చిక్కులను అర్థం చేసుకోకుండా చీపెస్ట్ ప్లాన్ ఎంచుకుంటారు.

ఆ తర్వాత ఇబ్బందుల్లో పడతారు. అందుకే థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ గురించి తప్పక తెలుసుకోవాలి. మీరు ఏదైనా వాహనాన్ని కలిగి ఉంటే మీరు కచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. చట్టబద్ధంగా తప్పనిసరి మాత్రమే కాదు. రోడ్డుపై మీ వ్యాలెట్, ప్రతిష్టను కాపాడుకోవడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

Third-Party Insurance 2025 : థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? :

థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అనేది (Third-Party Insurance 2025) ఒక మోటారు ఇన్సూరెన్స్. మీ వాహనం మరొక వ్యక్తికి, వాహనానికి లేదా ఆస్తికి నష్టం కలిగిస్తే.. బీమా కంపెనీ మీ సొంత జేబు నుంచి నష్టాలను కవర్ చేయదు. దీన్నే “థర్డ్-పార్టీ” అని పిలుస్తారు. ఇందులో థర్డ్ పార్టీలను కలిగి ఉంటుంది.

  1. పాలసీదారు
  2. ఇన్సూరెన్స్ కంపెనీ
  3. థర్డ్ పార్టీ

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమంటే? :
భారత మార్కెట్లో మోటారు వాహనాల చట్టం ప్రకారం.. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. మీ వాహనం ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే.. భారీ జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. చట్టపరమైన కారణాల వల్ల మాత్రమే కాదు. ఆచరణాత్మక కారణాల వల్ల కూడా జరిమానా చెల్లించాలి. మీ కారు ప్రమాదానికి కారణమై లక్షల రూపాయల నష్టాన్ని కలిగిస్తే పరిహారం చెల్లించడం అంత సులభం కాదని ఊహించుకోండి. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ఈ రిస్క్ కవర్ చేస్తుంది.

Third-Party Insurance 2025 : థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏంటి? :

  • థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. అవేంటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
  • ప్రమాదంలో ఇతరుల నష్టానికి పరిహారం
  • కోర్టు కేసులు, చట్టపరమైన ఖర్చుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది
  • తక్కువ ప్రీమియంతో ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది
  • చట్టపరమైన అవసరాలను తీరుస్తుంది
  • రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనశ్శాంతిని అందిస్తుంది

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి? :
ప్రతి వాహన యజమానికి థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ చాలా అవసరం. మీరు బైక్, కారు లేదా కమర్షియల్ వెహికల్ కలిగి ఉన్నారా? అది అందరికీ తప్పనిసరి. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే లేదా హై ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో డ్రైవ్ చేసే వారికి థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

third party insurance 2025 Car Insurance And Bike Insurance
third party insurance 2025

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎవరి కోసమంటే? :
ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రధానంగా (Third-Party Insurance 2025) థర్డ్ పార్టీకి సంబంధించినది. మీ వెహికల్ ఒక ప్రయాణీకుడిని గాయపరిస్తే ఒకరి కారును ధ్వంసం చేసినా లేదా మరొకరి షాపుకు నష్టం కలిగిస్తే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఆ నష్టాన్ని భర్తీ చేస్తుంది.

Read Also : Make Money Online : ఇంట్లోనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో డబ్బు సంపాదించడం ఎలా? ఈ 10 గోల్డెన్ ట్రిక్స్ ఎవరూ చెప్పరు!

Dhanteras 2025 Gold Buying Guide
Dhanteras 2025 : ధన్‌తేరాస్‌‌‌కు ముందు బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయి? గోల్డ్ ఎలా కొనుగోలు చేస్తే మంచిది?

మీరు మీ కారును ఆఫీసుకు నడుపుతున్నారని ఊహించుకోండి. అకస్మాత్తుగా, మీ కారు జారిపడి పార్క్ చేసిన బైక్‌ను ఢీకొట్టి పూర్తిగా దెబ్బతింది. మీకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే.. బైక్ రిపేర్ ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అయితే, మీకు ఇన్సూరెన్స్ లేకపోతే మీరు మీ జేబులో నుంచి మొత్తం ఖర్చును భరించాలి.

థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అనేది కేవలం లాంఛనప్రాయం కాదు. వాహన యజమానులకు భద్రతా వలయం అనమాట. ఇది రోడ్డుపై ఇతరులకు కలిగే నష్టానికి పరిహారం ఇవ్వడం ద్వారా చట్టపరమైన ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అందిస్తుంది. మీరు వాహనం కలిగి ఉంటే కనీసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ తప్పక కలిగి ఉండాలి.

జీరో డెప్ ఇన్సూరెన్స్ కవర్‌ తీసుకోండి.. బెనిఫిట్స్ ఇవే :

వెహికల్ ఇన్సూరెన్స్ (zero dep insurance) తీసుకునేటప్పుడు కచ్చితంగా జీరో డెప్ కవర్‌ను తీసుకోండి. కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోండి. మీరు కారు కలిగి ఉంటే.. మీకు వెహికల్ ఇన్సూరెన్స్ ఉండే అవకాశం ఉంది. మీరు క్లెయిమ్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ మొత్తం వాహనం మార్కెట్ విలువపై ఆధారపడి ఉంటుంది. అయితే, మీరు జీరో డెప్ కవర్‌ను కలిపితే.. మీరు మీ కారు బీమా మొత్తం నుంచి డిడెక్షన్లను నిరోధించవచ్చు.

మీరు ఒక వాహనాన్ని కలిగి ఉంటే.. దానికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ప్రమాదం లేదా నష్టం జరిగినప్పుడు క్లెయిమ్ దాఖలు చేసేందుకు ఇన్సూరెన్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే, వాహనం వయస్సు ఆధారంగా బీమా కంపెనీ మీకు క్లెయిమ్ చెల్లిస్తుంది. అంటే.. మీ వాహనం వయస్సు పెరిగే కొద్దీ దాని మార్కెట్ వాల్యూ తగ్గుతుంది.

వాహన భాగాలు కూడా కాలక్రమేణా అరిగిపోతాయి లేదా వాడుకలో లేకుండా పోతాయి. అందువల్ల, బీమా మొత్తం వాహనం మార్కెట్ విలువపై ఆధారపడి ఉంటుంది. అయితే, మీ బీమా పాలసీకి జీరో డెప్ కవర్‌ను కలిపితే మీ వాహనం బీమా మొత్తం నుంచి తగ్గింపులను నిరోధించవచ్చు. జీరో డెప్ కవర్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

జీరో డెప్ కవర్ అంటే ఏంటి? :

జీరో డెప్ కవర్‌ (zero dep cover)ను జీరో డిప్రెసియేషన్ లేదా జీరో డెప్ ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. వాహనం పాతబడినా కూడా బీమా మొత్తాన్ని తగ్గించకుండా నిరోధించే అసిస్టెన్స్ కవర్ ఇది. జీరో డిప్రెసియేషన్ అంటే ఇది బీమా మొత్తాన్ని తగ్గకుండా నిరోధించే అసిస్టెన్స్ కవర్. నిజానికి, మీరు ప్రతి ఏడాదిలో మీ కారు బీమాను రెన్యువల్ చేసినప్పుడు కారు వాల్యూ బీమా మొత్తం కూడా తగ్గుతాయి. అయితే, మీరు మీ వాహన బీమాకు జీరో డెప్ కవర్‌ను యాడ్ చేస్తే మీ ఇన్సూరెన్స్ మొత్తం తగ్గదు.

ఇలాంటి పరిస్థితిలో మీ వాహనం ప్రమాదంలో దెబ్బతిన్నట్లయితే.. వాహన భాగాలకు జరిగిన నష్టానికి అయ్యే ఖర్చుతో సహా మొత్తం క్లెయిమ్ మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. మోటారు బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీ బీమా పాలసీకి జీరో డిప్రెషియేషన్ కవర్‌ను కలపడం వల్ల ప్రీమియం కొన్ని శాతం పెరుగుతుందని గుర్తుంచుకోండి. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసి ఉంటే.. మీకు జీరో డిప్రెషియేషన్ కారు ఇన్సూరెన్స్ ఆప్షన్ అందిస్తుంది.

ఈ జీరో డిప్రెషియేషన్ కవర్ ఎవరికి ఎక్కువ ముఖ్యమంటే? :

మీరు కొత్త కారు కొన్నట్లయితే.. జీరో డెప్ ఇన్సూరెన్స్ పొందాలి. ఎందుకంటే కారు లేదా వాహనంలో డిప్రెషియేషన్ కొనుగోలు చేసిన తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మీకు చాలా ఖరీదైన లగ్జరీ కారు ఉన్నప్పటికీ ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఖరీదైన కార్ల స్పేర్ పార్ట్స్ కూడా ఖరీదైనవి. మీరు ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటుంటే.. జీరో డెప్ ఇన్సూరెన్స్‌ను పరిగణించండి.

IDV ఫార్ములా ఏంటి? బీమా కంపెనీ ఎలా నిర్ణయిస్తుంది? :

మీ వాహనం మార్కెట్ వాల్యూను బట్టి ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా నిర్ణయిస్తుంది? IDV ఫార్ములాను అర్థం చేసుకోండి. కంప్రన్సీవ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు బీమా కంపెనీ మీ వాహనం మార్కెట్ వాల్యూను IDVగా రిజిస్టర్ చేస్తుంది. నష్టం జరిగితే.. వారు IDV ఆధారంగా చెల్లిస్తారు. మీ వాహనం వాల్యూ, IDV అంటే ఏంటో నిర్ణయించేందుకు ఈ ఫార్ములాను తెలుసుకోండి.

Applying for A Personal Loan
Personal Loan : మీరు పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా? ఈ 6 తప్పులు అసలు చేయొద్దు.. EMI కట్టలేక అప్పుల పాలవుతారు జాగ్రత్త!

ప్రస్తుత రోజుల్లో చాలా మందికి సొంత వాహనం ఉంటుంది. మీరు టూవీలర్ వాహనం లేదా ఫోర్ వీల్స్ వాహనం ఉన్నా మీరు దానికి ఇన్సూరెన్స్ చేసే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఇష్టపడతారు. ఎందుకంటే.. ఇది ప్రమాదం వల్ల కలిగే అన్ని రకాల నష్టాలను కవర్ చేసే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ. సమగ్ర బీమా పాలసీ థర్డ్ పార్టీకి జరిగే నష్టాన్ని, అలాగే భూకంపాలు, వరదలు, దొంగతనం, అగ్నిప్రమాదాల వంటి విపత్తుల వల్ల మీ వాహనానికి కలిగే నష్టాన్ని కవర్ చేస్తుంది.

third party insurance 2025 Car Insurance And Bike Insurance
third party insurance 2025

కానీ, మీ వాహనానికి జరిగిన నష్టానికి బీమా కంపెనీ చెల్లించే మొత్తం మీ వాహనం IDV (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ)పై ఆధారపడి ఉంటుంది. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మీ వాహనం మార్కెట్ వాల్యూను అంచనా వేస్తుంది. ఈ వాల్యూ IDVగా రిజిస్టర్ అవుతుంది. ఒక కంపెనీ వాహనం IDVని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

IDV ఆధారంగా లెక్కిస్తారు :
IDVని నిర్ణయించేందుకు ఒక నిర్దిష్ట ఫార్ములా ఉంది. ఒక వాహనం కొత్తది అయినప్పుడు దాని ధర షోరూమ్ ధర వద్ద నిర్ణయించవచ్చు. కానీ, వాహనం వయస్సు పెరిగే కొద్దీ, దాని వాల్యూ మారుతుంది. దీని ఆధారంగా IDV నిర్ణయిస్తుంది. IDVని నిర్ణయించేటప్పుడు వాహనం సంవత్సరం, నెల, మోడల్ మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. వాల్యూను తదనుగుణంగా లెక్కించవచ్చు.

Read Also : Cash vs Home Loan : నగదుతో ఇల్లు కొనాలా? హోం లోన్ తీసుకోవాలా? మీ జీతం, EMI ఎంత ఉండాలి? పూర్తి లెక్కలు మీకోసం..! 

సాధారణంగా, 6 నెలల పాత కారు IDV షోరూమ్ ధర కన్నా 5శాతం తక్కువగా అంటే 95శాతంగా నిర్ణయిస్తారు. వాహనం 6 నెలల నుంచి ఒక ఏడాది మధ్య పాతదైతే.. IDV షోరూమ్ ధర కన్నా 15 శాతం తక్కువగా నిర్ణయిస్తారు. ఒక ఏడాది నుంచి 2 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న కారుకు, డిస్కౌంట్ షోరూమ్ ధర కన్నా 20శాతం తక్కువగా అంటే 80శాతానికి సమానంగా ఉంటుంది. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల మధ్య వయస్సు గల కారు IDV షోరూమ్ ధర కన్నా 30 శాతానికి తక్కువగా ఉంటుంది.

3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల మధ్య వయస్సు గల కారు IDV షోరూమ్ ధర కన్నా 40 శాతం తక్కువగా, అంటే షోరూమ్ ధరలో 60 శాతానికి సమానంగా నిర్ణయిస్తారు. 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల మధ్య వయస్సు గల వాహనం IDV షోరూమ్ ధర కన్నా 50శాతం తక్కువగా నిర్ణయిస్తారు. 5 ఏళ్ల కన్నా పాత వాహనాలకు, మార్కెట్ వాల్యూ, సర్వీస్డ్ కండిషన్, బాడీ పార్ట్స్ ఆధారంగా IDV నిర్ణయిస్తారు. చాలా సందర్భాలలో, వాహన వాల్యూ ఇన్సూరెన్స్ కంపెనీ, కస్టమర్ మధ్య డీల్ ద్వారా నిర్ణయిస్తారు.

IDV ఫార్ములా ఎందుకు అవసరమంటే? :

ఇన్సూరెన్స్ కంపెనీకి కస్టమర్‌కు మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు IDV అవసరం. వాస్తవానికి, దొంగిలించిన లేదా దెబ్బతిన్న వాహనానికి పరిహారం విషయానికి వస్తే.. కస్టమర్ ఎక్కువ పరిహార మొత్తాన్ని కోరుకోవచ్చు. అయితే కంపెనీ తక్కువ పరిహార మొత్తాన్ని కోరుకోవచ్చు.

అలాంటి పరిస్థితి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల IDV రూపంలో వాహనం వాల్యూ ఇన్సూరెన్స్ సమయంలో నిర్ణయిస్తారు. వాహనం వాల్యూ ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా నిర్ణయిస్తారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ దాఖలు చేసేటప్పుడు ఎలాంటి వివాదం లేదని తెలుసుకోవచ్చు.

FAQs : థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏంటి? బెనిఫిట్స్ గురించి ముఖ్యమైన ప్రశ్నలివే.. 

1. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి అవసరమా?

అవును.. భారత్‌లో చట్టబద్ధంగా ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి.

2. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏయే నష్టాన్ని కవర్ చేస్తుంది?

వాస్తవానికి, ఈ థర్డ్ పార్టీ బీమా అనేది ఇతరుల వాహనానికి, ఆస్తికి, గాయాలకు నష్టాన్ని కవర్ చేస్తుంది.

3. మీ వాహనానికి జరిగిన నష్టాన్ని ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

లేదు.. ఇతరులకు కలిగే నష్టాలను మాత్రమే కవర్ చేస్తుందని గమనించాలి.

4. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అత్యంత ఖరీదైనదా?

లేదు.. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది.

5. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌తో మాత్రమే డ్రైవ్ చేయవచ్చా?

అవును.. కానీ, మీ వాహనాన్ని ప్రొటెక్ట్ చేసేందుకు సమగ్ర ప్రణాళిక ఉండటం బెటర్.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

నాకు జర్నలిజంలో 5 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ‘రీడ్ తెలుగు వాయిస్’లో డిజిటల్ కంటెంట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ వార్తలను రాస్తుంటాను. తెలుగు మీడియా సంస్థల్లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది.