Post Office Scheme : ఈ పోస్టాఫీసు స్కీమ్‌లలో మీ భార్య, తల్లి పేరుతో ఇలా పెట్టుబడి పెట్టండి.. నెలకు వడ్డీనే రూ. 9,250 సంపాందించుకోవచ్చు!

Post Office Scheme : పోస్టాఫీసులో నెలవారీ ఆదాయ పథకం(MIS)లో మీ తల్లి లేదా భార్య పేరుతో పెట్టుబడి పెట్టండి. నెలకు రూ. 9,250 వడ్డీ పొందొచ్చు.

Post Office Scheme : పోస్టాఫీసులో అనేక పథకాలు ఉన్నాయి. అన్ని పథకాల్లో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ప్రభుత్వ పథకం కావడంతో మీ పెట్టుబడికి మంచి రాబడి కూడా ఉంటుంది. మీరు కూడా పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీరు ఈ పోస్టాఫీసులో ఏయే పథకాల్లో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఎంత రాబడి వస్తుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోవచ్చు.

పోస్టాఫీసు అందించే అద్భుతమైన (Post Office Scheme) పథకాల్లో పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) ఒకటి. ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం ద్వారా నెలవారీగా స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. రూ.4 లక్షల పెట్టుబడితో రూ. 2,467 వడ్డీ లభిస్తుంది. 7.4 శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్ల కాలపరిమితి, ప్రభుత్వ గ్యారెంటీతో ఈ స్కీమ్ చాలా సురక్షితమైనది. అంతే స్థాయిలో నమ్మదగినది కూడా. ఆదాయం విషయంలో అంతే గొప్పగా ఉంటుంది.

సాధారణ పౌరులకు, ఇండియా పోస్ట్ పథకాల ద్వారా అనేక అద్భుతమైన సేవింగ్స్, సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఒక పథకమే పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS). ఎలాంటి రిస్క్ లేకుండా స్థిర నెలవారీ ఆదాయాన్ని కోరుకునే వారికి ఈ స్కీమ్ ఒక వరమని చెప్పవచ్చు. ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా మీ అకౌంటులో ఫిక్స్‌డ్ వడ్డీ మొత్తం డిపాజిట్ అవుతుంది.

Post Office Scheme
Post Office Scheme

ఈ పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ పూర్తిగా సురక్షితమైన పెట్టుబడిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పథకాన్ని భారత ప్రభుత్వమే నిర్వహిస్తుంది. మీరు రిటైర్మెంట్ చేసినా లేదా గృహిణి అయినా, లేదా చిన్న వ్యాపార యజమాని అయినా సరే ఎవరైనా ఈ MIS పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రస్తుతం, ఈ పోస్టాఫీసు పథకం సంవత్సరానికి 7.4శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇది చాలా బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా మెరుగైనది. అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. మీరు మీ బ్యాంక్ అకౌంటులో ప్రతి నెలా క్రమం తప్పకుండా వడ్డీని పొందవచ్చు.

Post Office Scheme : రూ. 4 లక్షల పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ వస్తుంది? :

మీరు మీ భార్య, తల్లితో కలిసి ఈ పథకంలో రూ. 4 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం.. మీకు అప్పుడు ప్రతి నెలా ఎంత వడ్డీ వస్తుందో చూద్దాం.

  • పెట్టుబడి మొత్తం : రూ. 4,00,000
  • వడ్డీ రేటు : సంవత్సరానికి 7.4 శాతం
  • మొత్తం వార్షిక వడ్డీ : రూ. 29,600
  • నెలవారీ వడ్డీ : రూ. 29,600 ÷ 12 = రూ. 2,467

అంటే.. రూ. 4 లక్షల పెట్టుబడితో మీరు ప్రతి నెలా మీ అకౌంటులో స్థిరమైన రూ. 2,467 అందుకుంటారు. ఈ పథకం ద్వారా మీకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది.

Read Also : Third-Party Insurance 2025 : కారు, బైక్ ఏదైనా ఈ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ మస్ట్.. లేదంటే భారీగా నష్టపోతారు.. ఎందుకు తీసుకోవాలి? బెనిఫిట్స్ ఏంటి?

ఈ పథకంలో 5 ఏళ్లలో మెచ్యూరిటీ పొందవచ్చు :
పోస్టాఫీస్ MIS పథకంలో 5 సంవత్సరాలు (60 నెలలు) కాలపరిమితి కలిగి ఉంటుంది. అంటే.. మీరు ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత 5 ఏళ్ల పాటు మీకు స్థిర నెలవారీ వడ్డీ మొత్తం లభిస్తుంది. 5 ఏళ్ల తర్వాత మీ మొత్తం అసలు తిరిగి లభిస్తుంది. మీరు కోరుకుంటే మెచ్యూరిటీ తర్వాత అదే పథకంలో తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు. క్రమం తప్పకుండా ఆదాయాన్ని పొందవచ్చు.

Post Office Scheme : జాయింట్ అకౌంట్ సౌకర్యం :

ఈ పథకంలో మీరు సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఒకే ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంటులో (3 మంది వరకు) గరిష్ట పెట్టుబడి లిమిట్ రూ. 15 లక్షలు ఉంటుంది. భార్యాభర్తలు సంయుక్తంగా రూ. 4 లక్షలు డిపాజిట్ చేస్తే.. ప్రతి నెలా రూ. 2,467 వడ్డీ వారి జాయింట్ అకౌంటులో జమ అవుతుంది. సీనియర్ సిటిజన్లు, గృహిణులు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించేందుకు ఇదే అద్భుతమైన మార్గంగా చెప్పవచ్చు.

అకౌంట్ ఓపెన్ చేసేందుకు ముఖ్యమైన విషయాలివే :
MIS అకౌంట్ ఓపెన్ చేసేందుకు మీకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ (Post Office Scheme) కలిగి ఉండాలి. మీకు అకౌంట్ లేకపోతే మీరు ముందుగా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి? సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు మీ సమీపంలోని పోస్టాఫీసును విజిట్ చేయడం ద్వారా సులభంగా MIS అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ పథకం అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. మీ డబ్బు ఇందులో పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే.. పోస్టాఫీసును భారత ప్రభుత్వం నిర్వహిస్తుందని గమనించాలి.

Car Insurance Renewal
Car Insurance Renewal 2025 : కారు ఇన్సూరెన్స్ రెన్యువల్, మెయింట్‌నెన్స్ విషయంలో అందరూ చేసే తప్పులివే.. ఫుల్ గైడ్ మీకోసం

MIS పథకంలో పెట్టుబడి ప్రత్యేకత ఏంటి? :

  1.  ప్రభుత్వ హామీ, జీరో రిస్క్, 100శాతం సెక్యూరిటీ
  2.  సాధారణ ఆదాయం : ప్రతి నెలా స్థిర ఆదాయం.
  3.  అద్భుతమైన వడ్డీ రేటు : 7.4 శాతం వరకు వార్షిక రాబడి.
  4.  సౌలభ్యం : సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెనింగ్ ఆప్షన్.
  5.  రీ ఇన్వెస్ట్ ఆప్షన్ : మెచ్యూరిటీ తర్వాత తిరిగి పెట్టుబడి ఆప్షన్.

ఈ MIS పథకంలో పెట్టుబడి ఎవరికి ప్రయోజనకరమంటే? :
ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఈ పథకం చాలా బెటర్. తమ సేవింగ్స్ నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందాలనుకునే రిటైర్మెంట్ తీసుకున్న వ్యక్తులు. ఇంట్లో కూర్చొని స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే గృహిణులు. చిన్న ఖర్చులను తీర్చుకునేందుకు ప్రతి నెలా స్థిర రాబడి అవసరమయ్యే చిన్న పెట్టుబడిదారులు.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) కేవలం పెట్టుబడి పథకం మాత్రమే కాదని గమనించాలి. స్థిర ఆదాయానికి కూడా గ్యారెంటీ అందిస్తుంది. రూ. 4 లక్షల పెట్టుబడి నెలకు రూ. 2,467 స్థిరమైన ఆదాయానికి హామీ ఇస్తుంది. అన్నీ ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా ఉంటాయి.

పెట్టుబడి ఆప్షన్లు అనిశ్చితంగా ఉన్న సమయంలో పోస్టాఫీస్ అందించే ఈ ప్రభుత్వ పథకం ప్రజలకు సురక్షితమైన స్థిరమైనదిగా చెప్పవచ్చు. మీరు కూడా స్థిర నెలవారీ ఆదాయాన్ని కోరుకుంటే పోస్టాఫీస్ MIS పథకం అనేది మీకు సరైన ఆప్షన్ కావచ్చు.

మీ తల్లి పేరుతో కూడా నెలకు రూ. 4వేలు పెట్టుబడి పెట్టండి :

పోస్టాఫీస్ RD పథకంలో మీ తల్లి పేరు మీద నెలవారీ రూ. 4,000 డిపాజిట్ చేయడం వల్ల 5 సంవత్సరాలలో రూ. 2.85 లక్షల సేఫ్ ఫండ్ క్రియేట్ చేయొచ్చు. ఈ పథకం గ్యారెంటీ అందించే రాబడిని పూర్తి భద్రతను అందిస్తుంది. త్రైమాసికానికి 6.7శాతం వడ్డీని చక్రవడ్డీతో అందిస్తుంది.

ప్రతి తల్లి తన పిల్లల ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. అది చిన్నదైనా లేదా పెద్దదైనా ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. తమ పిల్లలను నవ్వుతూ ఉంచేందుకు వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచేందుకు తరచుగా వారి పేరు మీద పెట్టుబడి పెట్టాలని కోరుకుంటుంది.

Post Office Scheme
Post Office Scheme

అది వారికి సురక్షితంగా ఉండటమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తుంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ( RD ) కూడా ఇలాంటి పథకమే. ఇందులో చిన్న నెలవారీ మొత్తం కూడా భారీ సేవింగ్ సంపాదించుకోవచ్చు. సంవత్సరాలుగా చాలామంది పోస్టాఫీస్ RD పథకంలో పెట్టుబడి పెడుతున్నారు.

RD స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో రిస్క్ లేదు. వడ్డీ కూడా స్థిరంగా ఉంటుంది. తమ తల్లికి సురక్షితమైన స్థిర రాబడితో ఫండ్ సంపాదించేందుకు సరైన ఆప్షన్. ఇప్పుడు మీరు మీ భార్య పేరు మీద కాకుండా మీ తల్లి పేరు మీద RDలో రూ. 4వేలు జమ చేస్తే.. మెచ్యూరిటీ తర్వాత భారీగా రాబడిని పొందవచ్చు.

రూ. 4వేల పెట్టుబడితో ధనవంతుడు అవ్వొచ్చు :

పోస్టాఫీస్ RD పథకంలో 5 ఏళ్ల కాలపరిమితిని కలిగి ఉంది. ప్రస్తుతం 6.7శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీని త్రైమాసిక కాంపౌండింగ్ ఆధారంగా లెక్కిస్తారు. తద్వారా ప్రతి 3 నెలలకు వడ్డీ యాడ్ అవుతుంది. వచ్చే త్రైమాసికంలో మరింత పెరుగుతుంది.

అందుకే ఈ పథకం సాధారణ పొదుపుదారులకు టాప్ ఆప్షన్‌గా ఉంటుంది. మీరు మీ తల్లి పేరు మీద ప్రతి నెలా రూ. 4వేలు జమ చేస్తే.. ఈ చిన్న మొత్తం క్రమంగా 5 ఏళ్లలో భారీ రాబడిగా మారుతుంది. మొత్తంమీద, మీరు 60 నెలల్లో రూ. 240,000 కూడబెట్టుకుంటారు. కానీ, కాంపౌండింగ్ కారణంగా ఈ మొత్తం మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ. 285,463కి పెరుగుతుంది.

మీరు వడ్డీతోనే ధనవంతులు అవుతారు :
మీరు అదనపు వడ్డీ రూపంలో సుమారు రూ. 45,463 సంపాదిస్తారు. పోస్టాఫీసు పథకాలు ప్రభుత్వ మద్దతుతో ఉండటంతో ఈ రాబడి పూర్తిగా గ్యారెంటీ ఉంటుంది. మార్కెట్ పెరిగినా లేదా తగ్గినా ఇందులో పెట్టుబడి పెట్టే ప్రతి పైసా సురక్షితంగా ఉంటుంది.

ఈ పథకం మరో ప్రధాన ప్రయోజనం ఏమిటంటే.. దీనికి ఎలాంటి ముఖ్యమైన పేపర్ వర్క్ అవసరం లేదు. అకౌంట్ వ్యవధిని పొడిగించడం చాలా ఈజీ. అవసరమైతే ఫండ్స్ మధ్యలో వాడేసుకోవచ్చు. కేవలం రూ. 4వేల రూపాయల పెట్టుబడి మిమ్మల్ని 5 ఏళ్లలో ధనవంతుడిని చేస్తుంది.

Read Also : Make Money Online : ఇంట్లోనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో డబ్బు సంపాదించడం ఎలా? ఈ 10 గోల్డెన్ ట్రిక్స్ ఎవరూ చెప్పరు!

Retirement Planning Secrets 7 Golden Rules After 60 in Telugu
Retirement Planning : రిటైర్మెంట్ ప్లాన్.. ఈ 7 గోల్డెన్ రూల్స్ పాటించండి.. వృద్ధాప్యంలో ఎవర్ని ఒక్క పైసా అడగకుండా బతికేయొచ్చు!

ఒక తల్లికి, ఇలాంటి చిన్న సేవింగ్స్ ఉంటే ఆమె భవిష్యత్తును భద్రంగా ఉండటమే కాకుండా తన కొడుకు లేదా కుమార్తె తనకు ఆర్థిక భద్రతను అందించవచ్చు. 5 ఏళ్లలో భారీగా డబ్బులను ఎలా కూడబెట్టాలో చెప్పేందుకు పోస్టాఫీస్ RD పథకం ప్రత్యక్ష ఉదాహరణ. మీరు మీ తల్లిని ఆర్థికంగా బలంగా ఉండేందుకు ప్రతి నెలా రూ. 4వేలు అందించే ఈ చిన్న మొత్తం ఆమె భవిష్యత్తుకు అండగా నిలుస్తుంది.

MIS పథకంలో పెట్టుబడితో నెలకు రూ. 9,250 వడ్డీ :

భార్యాభర్తలు కలిసి పోస్టాఫీస్ MIS పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. గ్యారెంటీ నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. రూ. 4 లక్షలకు మీరు నెలకు రూ. 2,467 చొప్పున 7.4శాతం సురక్షితమైన వడ్డీ రేటును సంపాదిస్తారు. ఎలాంటి రిస్క్ లేకుండా సంపాదించుకోవచ్చు.

ఈ పథకం నెలవారీ ఆదాయానికి సరైన ఆప్షన్ అని చెప్పొచ్చు. తాము దాచుకున్న డబ్బులను సురక్షితంగా ఉంచుకోవాలనుకునే వారికి చాలా బెటర్. స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని పొందాలనుకునే వారికి పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం కూడా అత్యంత అవసరం.

ఈ పోస్టాఫీసు పథకంలో ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులు, గృహిణులు, బిజీగా ఉండే నిపుణులు, రిస్క్ పరంగా దూరంగా ఉండేవారు స్థిరమైన ఆదాయాన్ని కోరుకునేవారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంఐఎస్ పథకాలపై ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీ రేటు ఏడాదికి 4 సార్లు సవరించడం జరుగుతుంది. కానీ, ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత వడ్డీ రేటు 5 ఏళ్ల పాటు మారదు. అలానే ఉంటుందని గమనించాలి.

జాయింట్ అకౌంటులో ఫండ్స్ ఎంత ఉంటాయి? :
ఈ పోస్టాఫీసు పథకాన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ కూడా. ఎంఐఎస్ అనేది మీరు ఒకేసారి డిపాజిట్ చేయాల్సిన పథకం. ప్రతి నెలా స్థిర మొత్తంలో పెన్షన్ మాదిరిగా వడ్డీని పొందే అకౌంట్ అనమాట.

ఉదాహరణకు.. ఒక జంట జాయింట్ అకౌంటులో రూ. 4 లక్షలు జమ చేస్తే.. వారు 7.4శాతం వడ్డీ రేటుతో నెలకు రూ. 2,467 అందుకోవచ్చు. ఈ మొత్తం తప్పనిసరిగా వడ్డీ మాత్రమేనని గమనించాలి. మీరు అసలు 5 ఏళ్ల పాటు దాచుకున్న మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ కాల పరిమితి పూర్తయిన తర్వాత పూర్తిగా మీ డబ్బు తిరిగి పొందవచ్చు.

జాయింట్ అకౌంట్ ప్రయోజనాలు కూడా అత్యంత ముఖ్యమైనవి. జాయింట్ అకౌంటులో ముగ్గురు వ్యక్తుల వరకు ఉండవచ్చు. పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలకు పెంచుకోవచ్చు. ఒక ఫ్యామిలీ ఎక్కువ ఆదాయం కోరుకుంటే రూ. 15 లక్షల డిపాజిట్ వారికి నెలకు సుమారు రూ. 9,250 సంపాదిస్తుంది. తద్వారా భారీగా అదనపు ఆదాయం పొందవచ్చు. అదేవిధంగా, మీరు రూ. 9 లక్షలు జమ చేస్తే.. మీ నెలవారీ ఆదాయం రూ. 5,550కి పెరుగుతుంది.

జాయింట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? :
ఈ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు మీకు కావలసిందల్లా పోస్టాఫీసులో సేవింగ్ అకౌంట్.. మీకు ఒకటి లేకపోతే మీరు ముందుగా ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీరు ఒక సాధారణ ఫారమ్ నింపాలి. తద్వారా MIS అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీసు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేది కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు.

ఇందులో పెట్టుబడి పెట్టే మీ డబ్బులు 100శాతం సురక్షితం. రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం అవసరమైన వారికి MIS వంటి పథకాలు చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ పథకంలో చిన్న పెట్టుబడిదారులు, మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి ఒత్తిడి లేకుండా వారి నెలవారీ ఖర్చులను నిర్వహించుకునేందుకు అద్భుతమైన పథకమని చెప్పొచ్చు.

FAQs : పోస్టాఫీసు పథకాల్లో పథకాలకు సంబంధించి కీలక ప్రశ్నలివే :

1. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) ఏంటో తెలుసా?

ప్రభుత్వ సేవింగ్స్ స్కీమ్. మీరు ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. స్థిరమైన వడ్డీ రూపంలో క్రమం తప్పకుండా నెలవారీ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.

2. పోస్టాఫీస్ MIS పథకంపై వడ్డీ రేటు ఎంతంటే?

ప్రస్తుతం, పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో ఏడాదికి 7.4శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ప్రతి నెలా మీ బ్యాంకు అకౌంటులో డబ్బులు డిపాజిట్ అవుతాయి.

3. మీరు రూ. 4 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ వస్తుందంటే?

మీరు రూ. 4 లక్షలు డిపాజిట్ చేస్తే.. మీరు ప్రతి నెలా రూ. 2,467 వడ్డీని లేదా ఏడాదికి రూ. 29,600 సంపాదిస్తారు.

4. ఈ పోస్టాఫీసు పథకం కాలపరిమితి ఎంత?

పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం కాలపరిమితి 5 ఏళ్లు (60 నెలలు). మెచ్యూరిటీ తర్వాత పూర్తి పెట్టుబడి మొత్తం తిరిగి పొందవచ్చు.

5. MIS పథకం కింద భార్యాభర్తలు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చా?

అవును. ఈ MIS పథకం కింద ముగ్గురు వ్యక్తులు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. జాయింట్ అకౌంటులో గరిష్ట పెట్టుబడి మొత్తం రూ. 15 లక్షలు.

6. పోస్టాఫీస్ RD కాల పరిమితిఎంత?

పోస్టాఫీస్ RD పథకం 5 ఏళ్ల స్థిర కాలానికి ఉంటుంది. అవసరమైతే ఈ పథక కాల పరిమితిని పొడిగించవచ్చు.

7. తల్లి లేదా భార్య ఇతర ఫ్యామిలీ సభ్యుల పేరు మీద RD అకౌంట్ ఓపెన్ చేయొచ్చా?

అవును.. మీ తల్లి లేదా భార్య, ఇతర కుటుంబ సభ్యుల పేరుతో కూడా RD అకౌంట్ ఈజీగా ఓపెన్ చేయొచ్చు.

Disclaimer : ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడిపై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

నాకు జర్నలిజంలో 5 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ‘రీడ్ తెలుగు వాయిస్’లో డిజిటల్ కంటెంట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ వార్తలను రాస్తుంటాను. తెలుగు మీడియా సంస్థల్లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది.