Credit Card Tips : క్రెడిట్ కార్డులు ఇలా వాడితే పక్కగా అప్పుల పాలవుతారు జాగ్రత్త.. ఈ 6 పెద్ద తప్పులు అసలు చేయొద్దు..!

Credit Card Tips : అప్పుల ఊబిలో చిక్కుకుపోకుండా ఉండేందుకు ముఖ్యమైన క్రెడిట్ కార్డ్ టిప్స్ తప్పక తెలుసుకోండి. ఈ 6 సాధారణ క్రెడిట్ కార్డ్ తప్పులను అసలు చేయొద్దు.

Credit Card Tips : మీకు క్రెడిట్ కార్డు ఉందా? క్రెడిట్ కార్డు వాడకంలో చాలామంది అనేక తప్పులు చేస్తుంటారు. సాధారణంగా క్రెడిట్ కార్డ్ వాడే విషయంలో జరిగే తప్పులతో అప్పుల్లో కూరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణాలు ఉన్నాయి. బడ్జెట్ లేకుండా ఖర్చు చేయడం, మినిమం అమౌంట్ (Credit Card Tips) మాత్రమే చెల్లించడం, క్యాష్ విత్‌‍డ్రా చేసుకోవడం అనేవి వడ్డీ, పెనాల్టీలను పెంచే కీలక తప్పులుగా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

క్రెడిట్ కార్డులను తెలివిగా వాడకపోతే మాత్రం భారీ మొత్తంలో అప్పులకు దారితీస్తాయి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డ్ తప్పుల కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. బడ్జెట్ లేకుండా ఖర్చు చేయడం అత్యంత సాధారణ తప్పు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ చూసుకుని అదే తమ ఆదాయమని తప్పుగా భావిస్తారు. ప్లానింగ్ లేని ఖర్చు, రీపేమెంట్ సమస్యలకు దారితీస్తుంది.

Credit Card Tips :  సాధారణ మిస్టేక్స్ ఇవే :

మరో సాధారణ తప్పు ఏమిటంటే.. మినిమం పేమెంట్ మాత్రమే చేయడం. దీని కారణంగా క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌పై అధిక వడ్డీ వస్తుంది. కొన్నిసార్లు సంవత్సరానికి 36 శాతం నుంచి 48 శాతానికి చేరుకుంటుంది. ఈ పరిస్థితి క్రమంగా అప్పుల ఊబిలోకి దారితీస్తుంది. ఇంకా, డిలే పేమెంట్లు, డిలే పేమెంట్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. మీ క్రెడిట్ స్కోర్‌ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది.

మూడో అతిపెద్ద తప్పు ఏమిటంటే.. క్రెడిట్ కార్డు ఉపయోగించి క్యాష్ విత్‌డ్రా చేయడం, ముందస్తు వడ్డీ, క్యాష్ అడ్వాన్స్ ఛార్జీలు ఉండటం వల్ల అత్యంత ఖరీదైనది. మీ డబ్బు అవసరాల కోసం వ్యక్తిగత రుణాలు వంటి ఇతర తక్కువ వడ్డీ ఆప్షన్లను ఎంచుకోవడం ఎంతైనా మంచిది.

Credit Card Tips _ 6 Common Big Mistakes That Can Trap You in Debt, Avoid Them Now
Credit Card Tips

అదనంగా, చాలా మంది క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్‌లు, ఆఫర్‌లను సరిగ్గా అర్థం చేసుకోలేరు. తద్వారా ప్లానింగ్ లేని భారీ ఖర్చులకు దారితీస్తుంది. ఫలితంగా అనేక బెనిఫిట్స్ తగ్గుతాయి. నెలవారీ స్టేట్‌మెంట్‌లను పట్టించుకోకపోవడం కూడా మరో పెద్ద తప్పు. ఎందుకంటే క్రెడిట్ కార్డుపై చెల్లించాల్సిన అన్ని లావాదేవీలు నిలిచిపోతాయి.

Read Also : Post Office Scheme : ఈ పోస్టాఫీసు స్కీమ్‌లలో మీ భార్య, తల్లి పేరుతో ఇలా పెట్టుబడి పెట్టండి.. నెలకు వడ్డీనే రూ. 9,250 సంపాందించుకోవచ్చు!

ఈ పెద్ద తప్పులను నివారించేందుకు ఒక సాధారణ బడ్జెట్‌ను క్రియేట్ చేయండి. సమయానికి పూర్తి పేమెంట్లు చేయండి. క్యాష్ విత్‌డ్రాలు అసలు చేయొద్దు. మీ అవసరాలకు తగిన రివార్డులు, ఆఫర్‌లను అందించే సరైన కార్డ్‌ను ఎంచుకోండి. అలాగే, మీ క్రెడిట్ లిమిట్ 30శాతం కన్నా ఎక్కువ ఉపయోగించవద్దు. మీ నెలవారీ స్టేట్‌మెంట్‌ను జాగ్రత్తగా రివ్యూ చేయండి.

అందుకే, క్రెడిట్ కార్డును తెలివిగా వాడటం వల్ల మీ ఫైనాన్షియల్ స్టేటస్ మెరుగుపడుతుంది. అనవసరమైన అప్పుల నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా జాగ్రత్తగా తెలివైన ప్లానింగ్‌‍తో క్రెడిట్ కార్డు వాడటం వల్ల అప్పుల భారం నుంచి బయటపడొచ్చు. క్రెడిట్ కార్డులకు సంబంధించి అన్ని బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

క్రెడిట్ కార్డులతో ఫ్యూయిల్ ఖర్చులు ఎలా తగ్గించాలంటే? :

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి రిలీఫ్ పొందడానికి ఫ్యూయిల్ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఎంచుకోండి. సరైన కార్డును ఎంచుకోవడంతో పాటు తెలివిగా వాడటం వల్ల వేల రూపాయలు ఎలా సేవ్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బెస్ట్ ఫ్యూయిల్ క్రెడిట్ కార్డులు :
ఖరీదైన పెట్రోల్, డీజిల్ ధరలు మన జేబులపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. ఫ్యూయిల్ క్రెడిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్, సర్‌ఛార్జ్ మినహాయింపులు రోజువారీ ప్రయాణాన్ని చౌకగా చేస్తాయి. సరైన కార్డును ఎంచుకోవాలి.

1. ఫ్యూయిల్ క్యాష్‌బ్యాక్ ఎందుకు ముఖ్యమంటే? :
ఫ్యూయిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో సేవింగ్ కోసం ప్రతి లీటరు లెక్కించవచ్చు. ఫ్యూయిల్ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులు మీ ఖర్చులో కొంత భాగాన్ని తిరిగి చెల్లిస్తాయి. మీ మొత్తం ఫ్యూయిల్ ఖర్చులను తగ్గిస్తాయి. ఈ ఫ్యూయిల్ క్యాష్ బ్యాక్ కార్డులు సాధారణంగా ఒక శాతం సర్‌ఛార్జ్‌ను కూడా మాఫీ చేస్తాయి. ప్రతి లావాదేవీపై విధించే అదనపు ఛార్జీలతో మీ డ్రైవింగ్ అలవాట్లను మార్చకుండానే నేరుగా సేవింగ్స్ పొందవచ్చు.

Best Mid Range Mobiles
Best Mid Range Phones Review : ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఫీచర్లు.. ఇప్పుడు మిడ్ రేంజ్‌లో బెస్ట్ 7 స్మార్ట్‌ఫోన్లు కేక.. అసలు మిస్ కాకండి!

2. క్యాష్‌బ్యాక్ ఎలా పొందాలంటే? :
ఫ్యూయిల్ కార్డులతో తరచుగా ఏదైనా పెట్రోల్ పంపు వద్ద ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ లేదా అదనపు రివార్డులను అందిస్తాయి. ఉదాహరణకు.. ఇండియన్ ఆయిల్ లేదా BPCL పెట్రోల్ పంపులలో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించడం వల్ల అధిక రాబడి లభిస్తుంది.

అయితే, ఈ బెనిఫిట్స్ సాధారణంగా నెలవారీ లిమిట్ కలిగి ఉంటాయి. అంటే.. మీరు ప్రతి నెలా కొంత మొత్తంలో క్యాష్‌బ్యాక్‌ను మాత్రమే అందుకుంటారు. లావాదేవీ పరిమితులు రూ. 500 నుంచి రూ. 4వేల వరకు ఉండవచ్చు. అందుకే మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్.

3. ఎక్కువ సేవింగ్ చేయాలంటే? :
మీరు నిజంగా బెనిఫిట్స్ పొందాలనుకుంటే మీకు ఇష్టమైన ఫ్యూయిల్ బ్రాండ్‌తో లింక్ అయిన కార్డును ఎంచుకోండి. సింగిల్ ఫ్యూయిల్ కార్డుల నుంచి స్థిరమైన కొనుగోళ్లతో గరిష్ట రివార్డులను పొందవచ్చు. అంతేకాదు.. క్రెడిట్ కార్డు లావాదేవీలను డివైడ్ చేయకుండా ఉండండి. ఎందుకంటే ఎల్జిబుల్ లిమిట్స్ మించిపోవచ్చు. ఒకే కార్డులో నెలవారీ ఫ్యూయిన్ కొనుగోళ్లను చేయడం వల్ల క్యాష్‌బ్యాక్ స్పష్టంగా కనిపిస్తుంది. రివార్డ్‌లను వాడటం చాలా ఈజీ అవుతుంది.

4. 2025లో ఏయే క్రెడిట్ కార్డులు బెటర్? :

ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, BPCL SBI ఆక్టేన్ కార్డ్, HPCL ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వంటి టాప్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ క్రెడిట్ కార్డులు 3శాతం నుంచి 5శాతం క్యాష్‌బ్యాక్, సర్‌ఛార్జ్ మినహాయింపులను అందిస్తాయి.

కొన్ని క్రెడిట్ కార్డులు డైనింగ్ లేదా షాపింగ్‌పై డిస్కౌంట్‌లను కూడా అందిస్తాయి. క్రెడిట్ కార్డును ఎంచుకునేటప్పుడు క్యాష్‌బ్యాక్‌ను మాత్రమే కాకుండా, వార్షిక రుసుము, రిడెంప్షన్ ఫ్లెక్సిబిలిటీ, రివార్డ్‌లను ఎక్కడ ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుని ఉండాలి.

5. హిడెన్ ఛార్జీలను నివారించండి :
ఫ్యూయిల్ క్యాష్‌బ్యాక్ కార్డులు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ, హిడెన్ ఛార్జీలను నివారించడం కూడా చాలా ముఖ్యం. మీ నెలవారీ బ్యాలెన్స్‌ను సకాలంలో చెల్లించకపోతే వడ్డీ రేట్లు మీ సేవింగ్స్ తుడిచిపెట్టేస్తాయి. మీరు ఫ్యూయిల్ క్యాష్‌బ్యాక్‌ను పొందాలంటే ముందు చాలా క్రెడిట్ కార్డులకు మినిమం ఖర్చు అవసరం కూడా ఉంటుంది. మీ పేమెంట్లను సకాలంలో చేయండి. మీ రివార్డులను వెంటనే రీడీమ్ చేయండి. మీ ఖర్చు అలవాట్లకు సరిపోయే క్రెడిట్ కార్డ్‌ను ఎంచుకోండి.

6. సరైన క్రెడిట్ కార్డుతో వేలల్లో సేవింగ్ :
ఏదైనా బెస్ట్ ఫ్యూయిల్ క్రెడిట్ కార్డు మీ రోజువారీ జర్నీని మరింత సరసమైనదిగా మారుస్తుంది. మంచి క్రెడిట్ కార్డు ఎంచుకుంటే ఏడాది పొడవునా భారీ మొత్తంలో సేవింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ క్రెడిట్ కార్డులు అద్భుతంగా ఉపయోగడపతాయి. మీ బడ్జెట్‌పై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. సేవింగ్స్ ఇతర ముఖ్యమైన ఖర్చులకు తగ్గించుకునేందుకు వీలుంటుంది. మొత్తంమీద, సరైన క్రెడిట్ కార్డు క్యాష్‌బ్యాక్‌ను అందించడమే కాకుండా మీ జేబుపై నెలవారీ భారాన్ని సైతం తగ్గిస్తుంది.

ఈ 6 తప్పులు అసలు చేయొద్దు..
భారత మార్కెట్లో క్రెడిట్ కార్డులపై బాకీ మొత్తంగా రూ. 2.90 లక్షల కోట్లకు చేరుకుంది. చాలా మంది క్రెడిట్ కార్డు వాడే వినియోగదారులు తెలియకుండానే ఇలాంటి తప్పులు చేస్తుంటారు. అలా నెమ్మదిగా వారంతా అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. క్రెడిట్ కార్డుల విషయంలో అత్యంత ప్రమాదకరమైన 6 తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Credit Card Tips : క్రెడిట్ కార్డ్ డెట్ ట్రాప్ :

క్రెడిట్ కార్డ్ వాడకం అతిగా ఉండకూడదు. దేశవ్యాప్తంగా రుణ భారం కూడా అంతే వేగంగా పెరుగుతోంది. మే 2025 నాటికి క్రెడిట్ కార్డులపై బకాయిలు రూ.2.90 లక్షల కోట్లకు చేరుకున్నాయి. డిఫాల్ట్ రేట్లు 44శాతంగా పెరిగాయి. ఇలాంటి సందర్భంలో చిన్న తప్పులు కూడా ఖరీదైనవి మారొచ్చు.

1. మీ బడ్జెట్‌కు మించి ఖర్చులు చేయొద్దు :
క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేయడం చాలా ఈజీ. కానీ, ఈ అలవాటు అప్పులకు దారితీస్తుంది. ఆకర్షణీయమైన ఆఫర్లు, రివార్డుల కోసం అవసరం లేకున్నా షాపింగ్ చేస్తుంటారు. తాము ఖర్చు చేసిన అంతకన్నా ఎక్కువ మొత్తంలో కార్డు నుంచి స్వైప్ చేస్తారు.

క్రెడిట్ కార్డ్ ఖర్చుపై మీ నెలవారీ ఆదాయంలో 30 శాతం నుంచి 35శాతం మించకూడదని ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ప్రతి స్వైప్‌ను వీలైనంత వరకు ట్రాక్ చేయండి. అనవసరమైన షాపింగ్‌ చేయడాన్ని సాధ్యమైనంత తొందరగా నివారించండి. కొంచెం జాగ్రత్తగా కార్డును వాడితే అప్పుల ఊబి నుంచి బయటపడొచ్చు.

2. మినిమం అమౌంట్ మాత్రమే చెల్లించడం :
మీ క్రెడిట్ కార్డ్ బిల్లులో మినిమం డ్యూ అమౌంట్ మాత్రమే చెల్లించొద్దు. ఇది అత్యంత ప్రమాదకరమైన తప్పుగా గమనించాలి. ఇలా చేయడం వల్ల మీ రుణాన్ని తగ్గించదు. దానికి బదులుగా ప్రతి నెలా 3 శాతం నుంచి 3.8శాతం వడ్డీని అందిస్తుంది. ప్రతి ఏటా 42 నుంచి 46శాతానికి చేరుకుంటుంది.

10 Best Ways to Make Money Online And Offline From Home
Make Money Online : ఇంట్లోనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో డబ్బు సంపాదించడం ఎలా? ఈ 10 గోల్డెన్ ట్రిక్స్ ఎవరూ చెప్పరు!

అందుకే, క్రెడిట్ కార్డు యూజర్లు త్వరగా అప్పుల ఊబిలో పడతారు. అందుకే ఎప్పుడైనా పూర్తి బిల్లు చెల్లించడం కష్టమైతే.. కనీసం ముందుగా అధిక వడ్డీ కార్డుల బ్యాలెన్స్‌ క్లియర్ చేయడం అలవాటు చేసుకోండి. అన్ని పరిస్థితులలోనూ క్రెడిట్ కార్డును పూర్తిగా చెల్లించడం అలవాటు చేసుకోండి.

Credit Card Tips _ 6 Common Big Mistakes That Can Trap You in Debt, Avoid Them Now
Credit Card Tips

3. మల్టీ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం :
ఆఫర్లు, లిమిట్స్ పొందడానికి చాలా మంది వేర్వేరు క్రెడిట్ కార్డులపై తెగ ఖర్చు చేస్తుంటారు. ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉంటారు. అయితే, ఈ పద్ధతి కారణంగా మీరు తెలియకుండానే భారీ మొత్తంలో అప్పుల ముప్పును పెంచుతుంది. కార్డులు ఉన్నాయి కదా అని కార్డులన్నీ వాడటం మంచిది కాదు..

ఒకేసారి కార్డులను తిరిగి చెల్లించడం కష్టతరం అవుతుంది. మరొక క్రెడిట్ కార్డు బ్యాలెన్స్‌ను చెల్లించేందుకు ఒక క్రెడిట్ కార్డును వాడటం వల్ల అప్పుల ఉచ్చుకు దారితీస్తుంది. మీరు సులభంగా మేనేజ్ చేయగల కార్డులను కార్డులను ఉంచుకోవడమే బెటర్. రుణ ఏకీకరణ కూడా అద్భుతమైన పరిష్కారంగా చెప్పవచ్చు.

4. బిల్ పేమెంట్ డేట్ మిస్ చేయడం :
క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ గడువు తేదీని ఎప్పుడూ కూడా మిస్ చేయొద్దు. ఫలితంగా భారీగా నష్టపోతారు. ఆలస్య చెల్లింపు రుసుములు, క్రెడిట్ స్కోర్ తగ్గడమే కాదు.. వడ్డీ లేని వ్యవధి కోల్పోవడం అన్నీ ఒకేసారి వస్తాయని గుర్తించాలి.

కొన్నిసార్లు ఒక చిన్న తప్పు కూడా మీ మొత్తం ఆర్థిక రికార్డును సర్వనాశనం చేసేస్తుంది. అందుకే క్రెడిట్ కార్డు డెడ్‌లైన్ తేదీని అసలు మిస్ చేసుకోవద్దు. ఆటో-డెబిట్ లేదా రిమైండర్‌లను తప్పక సెటప్ చేయాలి. తద్వారా మీరు ఈ తప్పును జరగకుండా నివారించవచ్చు.

5. క్యాష్ విత్ డ్రా చేయడం :

ఏటీఎంలో క్రెడిట్ కార్డులతో అసలు డబ్బులు విత్‌డ్రా చేయొద్దు. ఇది అత్యంత సాధారణమైన తప్పు. క్యాష్ విత్‌డ్రా  (Credit Card Tips) చేసేందుకు గ్రేస్ పీరియడ్ లేకుండా వెంటనే వడ్డీ వస్తుంది. తద్వారా మీ రుణాన్ని భారీగా పెంచేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి లావాదేవీలు చేయండి. వీలైనంత త్వరగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించండి. లేదంటే ఇదే అలవాటు మీ సేవింగ్స్ వెంటనే ఖాళీ చేసేస్తుంది జాగ్రత్త.

క్రెడిట్ కార్డులను జారీ చేసే ఎస్బీఐ కార్డ్స్ (SBI Cards), ఈ-కామర్స్ ప్లేయర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సంయుక్తంగా కొత్త ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌ (Flipkart SBI Card)ను ప్రారంభించాయి. ఈ క్రెడిట్ కార్డ్ ప్రత్యేకంగా రోజువారీ కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులను ఉపయోగించేవారికి అద్భుతంగా ఉంటుంది.

ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఆఫర్‌లు, రివార్డులు, క్యాష్‌బ్యాక్ ద్వారా డబ్బుకు తగిన వాల్యూను పొందవచ్చు. ఈ కార్డ్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో కస్టమర్లకు భారీ బెనిఫిట్స్ ప్రయోజనాలను పొందవచ్చు.

క్యాష్‌బ్యాక్ ఆఫర్లు :
ఈ క్రెడిట్ కార్డుతో వినియోగదారులు అనేక పాపులర్ ప్లాట్‌ఫామ్‌లలో క్యాష్‌బ్యాక్ నుంచి భారీగా బెనిఫిట్స్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్, క్లియర్‌ట్రిప్‌లలో 5శాతం క్యాష్‌బ్యాక్, మింత్రాలో 7.5 శాతం, జొమాటో, నెట్‌మెడ్స్, ఉబెర్ పీవీఆర్ వంటి పార్టనర్లపై​4శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది.

మిగతా అన్ని ఖర్చులకు ఒక శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, క్లియర్‌ట్రిప్‌లలో త్రైమాసిక క్యాష్‌బ్యాక్ లిమిట్ ఒక్కో కేటగిరీకి రూ.4వేలు పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ మాస్టర్ కార్డ్, వీసా నెట్‌వర్క్‌లలో కూడా లభ్యమవుతుంది.

FAQs : క్రెడిట్ కార్డుల వినియోగంపై తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివే

1. క్రెడిట్ కార్డ్ అప్పుల ఉచ్చులలో ఎందుకు పడతారంటే?

ఎందుకంటే.. మినిమం డ్యూ అమౌంంట్ మాత్రమే చెల్లిస్తారు.. వడ్డీ భారీగా పెరగడానికి ఇదే కారణం

2. క్రెడిట్ కార్డులో ఎంత క్రెడిట్ లిమిట్ వాడాలి?

30శాతం కన్నా తక్కువగా వాడాలి.

3. మల్టీ క్రెడిట్ కార్డులు ఉంటే మంచిది కాదా?

అవును.. మీరు అన్ని కార్డులపై పేమెంట్లు చేయలేకపోతే చాలా నష్టపోతారు.

4. క్రెడిట్ కార్డు పేమెంట్ మిస్ అయితే ఏమౌతుంది?

ఆలస్య రుసుములతో పాటు అధిక మొత్తంలో వడ్డీ, క్రెడిట్ స్కోరు భారీగా తగ్గిపోతుంది.

5. క్రెడిట్ కార్డ్ క్యాష్ విత్ డ్రాలు చేయడం సురక్షితమేనా?

లేదు.. అసలు చేయొద్దు. ఏటీఎంలో క్రెడిట్ కార్డుతో డబ్బులు తీసిన ఫస్ట్ రోజు నుంచి అధిక వడ్డీ పడుతుంది.

6. క్రెడిట్ కార్డ్ లోన్ తొందరగా ఎలా తీర్చవచ్చు?

మీ లోన్ మొత్తంపై ప్రతిసారి అదనంగా చెల్లించండి. తక్కువ వడ్డీ ఈఎంఐలకు మార్చుకోండి. కొత్త ఖర్చులను తగ్గించండి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

నాకు జర్నలిజంలో 5 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ‘రీడ్ తెలుగు వాయిస్’లో డిజిటల్ కంటెంట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ వార్తలను రాస్తుంటాను. తెలుగు మీడియా సంస్థల్లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది.