Personal Loan : మీరు పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా? ఈ 6 తప్పులు అసలు చేయొద్దు.. EMI కట్టలేక అప్పుల పాలవుతారు జాగ్రత్త!

Personal Loan : కొంతమంది (Personal Loan) తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇలాంటి తప్పుల వల్ల కూడా పర్సనల్ లోన్ కోసం అప్లయ్ (Apply Personal Loan) చేసినా రిజెక్ట్ అవుతుంటుంది.

Personal Loan : అందరికి డబ్బు అవసరమే.. ఏదో ఒక అనుకోని కష్టం వచ్చినప్పుడు కంగారుపడిపోతుంటారు. ఎవరినైనా సాయం అడిగినా అంత పెద్దమొత్తంలో డబ్బు దొరకదు.. ఇలాంటి సందర్భాల్లో చాలామంది పర్సనల్ లోన్ కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే, అందరికి బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు పర్సనల్ లోన్ ఇచ్చేందుకు ముందుకు రావు.

దానికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది (Personal Loan) తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇలాంటి తప్పుల వల్ల కూడా పర్సనల్ లోన్ కోసం అప్లయ్ (Apply Personal Loan) చేసినా రిజెక్ట్ అవుతుంటుంది. మరికొందరు పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈఎంఐల విషయంలో కొన్ని తప్పుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది కూడా వారిని అప్పుల ఊబిలోకి లాగుతుందని మర్చిపోతారు.

పర్సనల్ లోన్ తీసుకునేవారిలో అధిక శాతం మంది EMI ఆధారంగా నిర్ణయాలను తీసుకుంటారు. తక్కువ ఈఎంఐ తీసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే.. మీరు ఎక్కువ నెలలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది అనమాట. అదే మీ వడ్డీని భారీగా పెంచుతుంది.

కొంచెం ఎక్కువ ఈఎంఐ చెల్లించి తక్కువ కాలపరిమితిని ఎంచుకుంటే దీర్ఘకాలికంగా మీకు భారీ వడ్డీని సేవ్ చేయవచ్చు. అందుకే మీరు మీ బడ్జెట్ బట్టి ఈఎంఐ తక్కువా లేదా ఎక్కువా అనేది సరైనా నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Credit Card Tips : క్రెడిట్ కార్డులు ఇలా వాడితే పక్కగా అప్పుల పాలవుతారు జాగ్రత్త.. ఈ 6 పెద్ద తప్పులు అసలు చేయొద్దు..!

ప్రస్తుత రోజుల్లో పర్సనల్ లోన్ పొందడం చాలా సులభమే. మీ బ్యాంక్ యాప్‌లో ముందస్తుగా అప్రూవల్ ఆఫర్ కనిపిస్తుంది. మీరు కొన్ని డాక్యుమెంట్లను అప్ లోడ్ చేస్తే సరిపోతుంది.. డబ్బు వెంటనే మీ అకౌంటులో క్రెడిట్ అవుతుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది. కానీ, చాలా మంది పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

Personal Loan EMI
Personal Loan EMI

వాస్తవం ఏమిటంటే.. పర్సనల్ లోన్లు అత్యంత ఖరీదైనవి.. తొందరపడి తీసుకుంటే చిన్న నిర్ణయాలు కూడా ఏళ్ల తరబడి అధిక వడ్డీని చెల్లించే పరిస్థితికి దారితీస్తాయి. సాధారణంగా అప్పు తీసుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు కన్నా వెనుకా ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నందుకే ఇబ్బందుల్లో పడతారు. మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలని చూస్తుంటే కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పక గుర్తుంచుకోవడం ఎంతైనా మంచిది.

Personal Loan : తక్కువ ఈఎంఐతో చిక్కులే :

చాలా మంది ఈఎంఐ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. తక్కువ ఈఎంఐ అంటే తరచుగా ఎక్కువ కాలం ఉంటుంది. మీరు ఎక్కువ నెలలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీ వడ్డీని గణనీయంగా పెంచుతుంది. కొంచెం ఎక్కువ ఈఎంఐ చెల్లించి తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం వల్ల దీర్ఘకాలికంగా భారీ వడ్డీని ఆదా చేయవచ్చు. ఏదైనా నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి.

బ్యాంకు ఆఫర్లు బాగున్నా వడ్డీ రేట్లతో చుక్కలే :

కొన్నిసార్లు బ్యాంకు ఆఫర్లు మంచిగా అనిపిస్తాయి. కానీ, బ్యాంకులు విధించే వడ్డీ రేట్లతో జేబు ఖాళీ అవ్వాల్సిందే.. మీరు తరచుగా మీ మొబైల్ ఫోన్‌లో లోన్ ఆఫర్‌లను చూస్తుంటారు. చాలా మంది బ్యాంకు ఆఫర్ ద్వారా లోన్ తీసుకుంటారు. ఈ బ్యాంకు రుణాలు త్వరగా లభిస్తాయి.

Dhanteras 2025 Gold Buying Guide
Dhanteras 2025 : ధన్‌తేరాస్‌‌‌కు ముందు బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయి? గోల్డ్ ఎలా కొనుగోలు చేస్తే మంచిది?

అయితే, ఈ లోన్లపై వడ్డీ రేట్లు భారీ మొత్తంలో ఉంటాయి. ఆఫర్ల ట్రాప్‌లో పడి కస్టమర్లు తరచుగా వడ్డీ రేట్లను పోల్చడం మర్చిపోతుంటారు. పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఒక్కో రుణదాతల మధ్య భారీగా తేడాలు ఉండొచ్చు. ఇలాంటి బ్యాంకు ఆఫర్‌లను పోల్చడం వల్ల మీరు మంచి బ్యాంకులో పర్సనల్ లోన్ తక్కువ వడ్డీకే తీసుకునేందుకు వీలుంటుంది.

ప్రాసెసింగ్ ఫీజులు కూడా పిండేస్తాయి :

చాలా మంది ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులను కొద్దిగా కదా అని భావించి పెద్దగా పట్టించుకోరు. అయితే, ఈ చిన్న ఖర్చులు కూడా భారీ మొత్తంలో రుణాన్ని మరింత ఖరీదైనవిగా చేస్తాయి. కొంతమంది రుణదాతలు ఈ లోన్లపై విధించే రుసుములను కూడా మీ లోన్ మొత్తం నుంచి తీసివేస్తారు. ఫలితంగా తక్కువ మొత్తంలో లోన్ వస్తుంది. ఈ రుసుములను అర్థం చేసుకోవడం తప్పక తెలుసుకుని ఉండాలి.

EMI తక్కువగా ఉంటే భారీగా వడ్డీ చెల్లించాలి :

పర్సనల్ లోన్లు తీసుకునే చాలా మంది ఈఎంఐలను తక్కువగా ఉంచుకుంటారు. ప్రతినెలా చెల్లించడానికి ఈజీగా ఉంటుందని అనుకుంటారు. ప్రస్తుత ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు ఎక్కువ సంవత్సరాలు టర్మ్ ఎంచుకుంటారు. అయితే, ఇలా ఎక్కువ కాలం ఉంచుకోవడం వల్ల మీరు అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. మీ దీర్ఘకాలిక లక్ష్యాలు అనగా ఇల్లు కట్టడం లేదా మీ పిల్లల విద్యకు సంబంధించి డబ్బులను ఆదా చేయలేరు.

సంపాదించిన మొత్తం ఇలా వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ ఈఎంఐ పెట్టుకోగలిగితే అది కూడా సౌకర్యవంతంగా మేనేజ్ చేయగలిగితే కొంత కాలానికి తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడమే ఎల్లప్పుడూ మంచిదని గమనించాలి. ఇలా చేస్తే వడ్డీ రేటు భారీగా తగ్గుతుంది. కానీ, ఇలా చేస్తే కూడా మీకు వచ్చే ఆదాయం కూడా త్వరగా ఖాళీ అవుతుంది.

Personal Loan : పర్సనల్ లోన్ తీసుకునే ముందు రీపేమెంట్ ప్లానింగ్ తప్పనిసరి :

పర్సనల్ లోన్ పొందిన తర్వాతే చాలామంది ఈఎంఐ పేమెంట్ల గురించి ఆలోచించడం మొదలుపెడతారు. కానీ, డబ్బు వారి అకౌంటులో క్రెడిట్ అయిన తర్వాత ఈఎంఐ ఎలా మేనేజ్ చేయొచ్చు కదా అని భావిస్తారు.

అయితే, పర్సనల్ లోన్ ఈఎంఐలు నెలవారీగా నిర్ణీత వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా డబ్బు ఖర్చు చేసే ముందు రీపేమెంట్ ప్లానింగ్ రూపొందించడం అత్యత్తుమైన పని. ఆటో-డెబిట్‌ను సెటప్ చేయండి. ఫస్ట్ ఈఎంఐ కోసం చిన్న బ్యాలెన్స్‌ను కూడా పక్కన పెట్టండి. వీలైతే ముందస్తు పేమెంట్ కోసం కూడా తప్పక ప్లాన్ చేయండి.

పర్సనల్ లోన్ తీసుకోవడం తప్పు కాదు.. కానీ జాగ్రత్త అవసరం :

పర్సనల్ లోన్ తీసుకోవడంలో తప్పు లేదు. సరైన సమయంలో తీసుకున్న లోన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సాయపడుతుంది. సేవింగ్ తగ్గుతుంది. మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు సమస్యలు తలెత్తుతాయి. వడ్డీ రేటు, రుసుములు, కాలపరిమితి, రీపేమెంట్ ప్లానింగ్, మొత్తం ఖర్చును రివ్యూ చేసేందుకు కొన్ని నిమిషాలు కేటాయించడం వల్ల నెలల తరబడి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

పర్సనల్ లోన్లపై అపోహలు.. మీరు ఈ 5 అపోహలను అసలు నమ్మొద్దు..

సాధారణంగా పర్సనల్ లోన్లను ఎమర్జెన్సీ లోన్లు అని కూడా పిలుస్తారు. మీరు తీసుకున్న లోన్లను సరిగా వినియోగిస్తే.. అత్యంత ప్రయోజనకరంగా మారతాయి. అయితే, ఈ పర్సనల్ లోన్ విషయంలో జనాల్లో అనేక అపోహలు ఉన్నాయి. చాలామంది ప్రజలు తరచుగా ఇలాంటి పుకార్లనే ఎక్కువగా నమ్ముతారు. మీకు డబ్బు అవసరమైన సమయాల్లో మరెక్కడా డబ్బు దొరకకపోతే చాలామంది పర్సనల్ లోన్ తీసుకోవాలని చూస్తుంటారు.

Read Also : Make Money Online : ఇంట్లోనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో డబ్బు సంపాదించడం ఎలా? ఈ 10 గోల్డెన్ ట్రిక్స్ ఎవరూ చెప్పరు!

అందుకే ఈ పర్సనల్ లోన్ అత్యవసర రుణంగా చెబుతారు. అయితే, పర్సనల్ లోన్లు తీసుకునే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలలో ఈ లోన్లపై అనేక అపోహలు నెలకొన్నాయి. మీరు పుకార్లను అసలు నమ్మొద్దు.. ఈ అపోహలను వదిలేయండి.. అలాంటి అపోహలకు సంబంధించి కొన్ని విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Third-party insurance 2025
Third-Party Insurance 2025 : కారు, బైక్ ఏదైనా ఈ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ మస్ట్.. లేదంటే భారీగా నష్టపోతారు.. ఎందుకు తీసుకోవాలి? బెనిఫిట్స్ ఏంటి?

మీకు CIBIL స్కోరు తక్కువగా ఉంటే పర్సనల్ లోన్ రాదా? :
చాలా మందిలో ఇదే సందేహం ఉంటుంది. CIBIL స్కోరు 750 కన్నా తక్కువగా ఉంటే వారికి పర్సనల్ లోన్ రాదని భావిస్తుంటారు. కానీ, అలా కాదు.. మీకు ఇంకా లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ సిబిల్ స్కోరు 750 కన్నా ఎక్కువ ఉంటే మీరు త్వరగా తక్కువ వడ్డీ రేటుతో లోన్ పొందవచ్చు. కానీ, మీకు సిబిల్ తక్కువ స్కోర్లు ఉంటే లోన్ వస్తుంది.. కానీ, ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి రావొచ్చు. మీకు వచ్చే ఆదాయం, చేస్తున్న ఉద్యోగంతో పాటు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందా లేదా అనేది మీరు బ్యాంకుకు నిరూపించాల్సి ఉంటుంది.

Applying for A Personal Loan
Applying for A Personal Loan

అప్పుడు బ్యాంకు మీ వివరాలను పరిశీలించి ఆ తర్వాత లోన్ ఇచ్చేందుకు ముందుకు వస్తుంది. అయితే, బ్యాంకులు, NBFC సంస్థలు అనేక ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు కూడా తక్కువ సిబిల్ స్కోర్‌లు ఉన్న కస్టమర్లకు కూడా పర్సనల్ లోన్లను అందిస్తాయి. ఇందులో ఒకే ఒక తేడా ఏమిటంటే.. బ్యాంకులు తక్కువ సిబిల్ స్కోర్‌ను కొంచెం ప్రమాదకరంగా భావిస్తాయి. అందుకే వడ్డీ రేటును భారీగా పెంచవచ్చు. కొన్ని షరతులు కూడా కఠినంగా ఉండొచ్చు. అయితే, తక్కువ సిబిల్ స్కోరుతో రుణం పొందలేరనేది పూర్తిగా అవాస్తవం.

వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది.. దీనిపై ఎలాంటి మార్పు ఉండదు :
చాలా సందర్భాల్లో లోన్ తీసుకునే వినియోగదారులు తమకు బ్యాంకు కోట్ చేసిన వడ్డీ రేటునే ఫైనల్ అనుకుంటారు. అందులో నిజం లేదు.. ఒక్కమాటలో చెప్పాలంటే వడ్డీ రేట్లు ఎప్పుడూ స్థిరంగా ఉండవని గమనించాలి. మీకు మంచి క్రెడిట్ స్కోరు ఉండి స్థిరమైన ఉద్యోగం కలిగి ఉంటే మీ బ్యాంకుతో దీర్ఘకాలిక సంబంధం ఉండి ఉన్న సమయంలో మీ వడ్డీ రేటును మాట్లాడుకోవచ్చు. కొన్నిసార్లు, మీరు మరో బ్యాంకు ఆఫర్‌ను చూస్తే అప్పుడు మీ బ్యాంకు మీకు మెరుగైన వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది.

పర్సనల్ లోన్ తీసుకోవడం మంచి నిర్ణయం కాదంటారా?
చాలా మందిలో ఇదే భయం ఉంటుంది. పర్సనల్ లోన్ తీసుకోవడం ఎప్పుడు తప్పు కాదు.. మీరు తీసుకునే రుణం సరైన అవసరానికి ఉపయోగపడాలి. మీరు తీసుకున్న రుణం ఉద్దేశ్యంపై ఆధారపడి ఉంటుంది. సరైన అవసరానికి వాడినప్పుడే ఆ లోన్ తీసుకున్నందుకు ప్రయోజనం ఉంటుంది. సరైన ప్లానింగ్ లేని సరైన ఈఎంఐతో పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

పర్సనల్ లోన్ ఫండ్స్ ఎక్కడికి మళ్లీస్తున్నారో బ్యాంకు కన్నేసి ఉంటుందా?

కొంతమంది పర్సనల్ లోన్ తీసుకుంటే బ్యాంకు వాళ్ళు ఆ డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టారని అడుగుతారని భయపడిపోతుంటారు. వాస్తవానికి, ఇందులో ఎలాంటి నిజం లేదు. పర్సనల్ లోన్ అనేది అసురక్షిత రుణం.. దీనికి ఎలాంటి భద్రత ఉండదు. మీరు ఆ డబ్బును దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట.

ఏయే నిర్దిష్ట ప్రయోజనంతో సంబంధం ఉండదు. మీరు ఆ డబ్బును పెళ్లి, వైద్య అవసరాలు, ప్రయాణం లేదా పాత అప్పులను తిరిగి చెల్లించడం వంటి ఎలాంటి అవసరాలకైనా ఈజీగా వాడుకోవచ్చు. బ్యాంకు ఈ విషయంలో మిమ్మల్ని అసలు ఎలాంటి వివరణ అడగదు. బ్యాంకు పట్టించుకోదు కూడా.. కేవలం మీరు తీసుకున్న లోన్ ఈఎంఐ సరిగా క్రమం తప్పకుండా చెల్లిస్తే చాలు..

పర్సనల్ లోన్ లాంగ్ ప్రాసెస్ ఉంటుందా? పేపవర్ వర్క్ ఎక్కువగా ఉంటుందా?

మీరు పర్సనల్ లోన్ పొందడానికి బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుందా? అని అనుకుంటారు. వాస్తవానికి, చాలా బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్లను అందిస్తున్నాయి. కేవైసీ నుంచి పేమెంట్ వరకు, అన్ని దశల్లో మొబైల్ ద్వారా పూర్తవుతాయి. కొన్ని గంటల్లోనే రుణాలు అప్రూవల్ అవుతాయి.

తీసుకున్న పర్సనల్ లోన్ ఎక్కడ వినియోగించుకోవచ్చు. అన్ని అవసరాలకు వాడుకోవచ్చా? లేదా కొన్నింటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలా? అనేది చాలామందిలో అపోహాలు ఉంటాయి. వాస్తవానికి మీరు తీసుకునే పర్సనల్ లోన్ అన్ని అవసరాలకు వాడుకోవచ్చు. కానీ కొన్నింటికి ఖర్చు చేయకూడనవి కూడా ఉన్నాయి.. అందులో ప్రధానంగా ఈ కింది విధంగా ఉంటాయి. ఓసారి లుక్కేయండి.

  • మెడికల్ ఎమర్జెన్సీ
  • పాత రుణాలు, క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్
  • ఎడ్యుకేషన్ లేదా స్కిల్స్ పెంచుకోవడం కోసం కోర్సులు
  • మ్యారేజీ లేదా ఇంటికి అవసరమైన కొనుగోళ్లు చేయడం
  • పర్సనల్ లోన్లు దుర్వినియోగం చేయడం
  • హాలిడే పేరుతో జల్సాలు చేయడం
  • ఖరీదైన మొబైల్ కొనడం లేదా గాడ్జెట్ కోసం ఖర్చు చేయడం
  • స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అంతా పొగట్టుకోవడం

FAQs : పర్సనల్ లోన్ తీసుకునే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..

1. తక్కువ CIBIL స్కోరు ఉంటే పర్సనల్ లోన్ తీసుకోవచ్చా?

అవును.. తప్పకుండా తీసుకోవచ్చు. చాలావరకు అనేక బ్యాంకులు, NBFCs, ఫిన్‌టెక్ కంపెనీలు తక్కువ సిబిల్ స్కోర్‌లు ఉన్నవారికి కూడా లోన్లు ఇస్తాయి. వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది.

2. పర్సనల్ లోన్ వడ్డీ రేటును బ్యాంక్ మార్చగలదా?

కచ్చితంగా మార్చవచ్చు. మీ క్రెడిట్ స్కోరు, ఆదాయం, బ్యాంక్ రిలేషన్ బట్టి లోన్ వడ్డీ రేటును మార్చుకోవచ్చు.

3. పర్సనల్ లోన్ డబ్బులను మీరు ఎక్కడ వాడారో బ్యాంక్ చెక్ చేస్తుందా?

లేదు.. చేయదు.. పర్సనల్ లోన్ అంటే అన్‌సెక్యూర్డ్ లోన్.. ఎలాంటి అవసరానికైనా ఆ లోన్ డబ్బులను వాడుకోవచ్చు.

4. ఆన్‌లైన్ పర్సనల్ లోన్లు నిజంగా సురక్షితమేనా?

మీరు RBI కంట్రోలింగ్ బ్యాంకు లేదా NBFC నుంచి పర్సనల్ లోన్ తీసుకుంటే అలాంటి ఆన్‌లైన్ లోన్లు పూర్తిగా సురక్షితమే..

5. పర్సనల్ లోన్లు ఎల్లప్పుడూ మంచిది కాదా?

అలాఏమి కాదు. సరైన అవసరాల కోసం ప్లానింగ్ ప్రకారం సరైన EMIతో తీసుకున్న లోన్లు ప్రయోజనకరంగా ఉంటుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

నాకు జర్నలిజంలో 5 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ‘రీడ్ తెలుగు వాయిస్’లో డిజిటల్ కంటెంట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ వార్తలను రాస్తుంటాను. తెలుగు మీడియా సంస్థల్లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది.