Dhanteras 2025 Gold Buying Guide : బంగారం కొంటున్నారా? 2025లో ఈ ధన్‌తేరాస్ సందర్భంగా బంగారం ధరలు దాదాపు 60శాతం మేర పెరిగాయి. ధన్‌తేరాస్ రోజున దేశవ్యాప్తంగా అనేక భారతీయ కుటుంబాల్లో ఫిజికల్ గోల్డ్ ఏదో ఒక రూపంలో కొనుగోలు చేయడం అనేది ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. అది గోల్డ్ కాయిన్స్ లేదా ఆభరణాలు లేదా బంగారు కడ్డీలు కావచ్చు. మతపరమైన భావాలతో పండుగ సమయంలో చాలా మంది భారతీయులు కూడా బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతారు.
అయితే, ఈ ఏడాదిలో బంగారం ధరలు పెరగడం వల్ల కొంతమంది సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా బంగారం కొనుగోళ్లు చేయకపోయే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక పేర్కొంది.
ఈ ధన్‌తేరాస్‌కు మీరు ఫిజికల్ గోల్డ్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మీకు ఇప్పుడు కొనాలా లేదా వాయిదా వేయాలా? ఎలా కొనాలి? కొనుగోలు చేసే ముందు ఏంటి చెక్ చేయాలి వంటి అనేక సందేహాలు ఉండవచ్చు. ఈ ధన్‌తేరాస్ బంగారం కొనుగోలు పూర్తి గైడ్ ద్వారా అనేక ప్రశ్నలకు చాలా వరకు సమాధానం దొరుకుతుంది.
Dhanteras 2025 : బంగారం ఎలా కొనాలి? ఎలా చెక్ చేయాలి? :
ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేసే ముందు మీరు తప్పనిసరిగా రెండు విషయాలను తప్పనిసరిగా చెక్ చేయాలి. మొదటగా ధర, స్వచ్ఛత. బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ధంతేరాస్ కొనుగోళ్ల రద్దీ మధ్య కొంతమంది ఆభరణాల వ్యాపారులు వాస్తవ ధర కన్నా ఎక్కువ వసూలు చేస్తుంటారు. మీరు వివిధ బంగారు షాపుల్లో ధరలను పోల్చడం ద్వారా ఈజీగా అంచనా చేయవచ్చు. స్వచ్ఛమైన బంగారు నాణేలను విక్రయించే కొన్ని మంచి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఉన్నాయి.
మీరు బంగారం ధరలు, డిస్కౌంట్ ఆఫర్‌లు ఏవైనా ఉంటే వెంటనే చెక్ చేయవచ్చు. రెండవది.. బంగారు వస్తువు ధర స్వచ్ఛతను బట్టి మారుతుంది. 24 క్యారెట్ల బంగారు వస్తువుకు మీరు చెల్లించాల్సిన మొత్తం 18 క్యారెట్లు లేదా 22 క్యారెట్ల బంగారు వస్తువుకు భిన్నంగా ఉంటుంది. మీరు కొనాలనుకుంటున్న బంగారానికి మీరు డబ్బులు చెల్లిస్తున్నారని నిర్ధారించుకోవాలి.
ముఖ్యంగా, హాల్‌మార్క్ చేసిన బంగారు వస్తువులను కొనడం ఎంతైనా మంచిది. మీరు BIS అధికారిక మొబైల్ యాప్ (BIS CARE) యాప్ ద్వారా హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాల ప్రామాణికతను చెక్ చేయవచ్చు. ఇందులో హాల్‌మార్క్‌తో పాటు బంగారు ఆభరణాల స్వచ్ఛతను పరీక్షించడానికి మరో 5 మార్గాలు ఉన్నాయి. అందులో మాగ్నెట్ టెస్ట్, వాటర్ టెస్ట్, యాసిడ్ టెస్ట్, స్కిన్ టెస్ట్, XRF స్పెక్ట్రోమీటర్ పరీక్ష వంటివి ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మీరు చెక్ చేయాల్సినవి మరిన్ని ఉన్నాయి..
- ఛార్జీలు వసూలు చేయడం
- వివరణాత్మక బిల్లు
- తిరిగి కొనుగోలు విధానం
- జీఎస్టీ ఛార్జీలు
- వృధా ఛార్జీలు
- ఈ ధన్‌తేరాస్‌కు బంగారం కొనడానికి ముందు మీ చెక్‌లిస్ట్‌లో పైన పేర్కొన్న అంశాలను తప్పక తెలుసుకుని ఉండాలి.
బంగారం ధరలు పెరుగుదల ఎందుకంటే? :
బంగారం ధరలు అనేక కారణాల వల్ల పెరిగాయి. ధంతేరాస్, దీపావళి సందర్భంగా బంగారం కొనుగోళ్ల రద్దీ పెరగడం ఒక కారణమైతే.. టాటా మ్యూచువల్ ఫండ్ ఇటీవలి నివేదిక ప్రకారం.. ఈ కింది అంశాలు బంగారం ధర పెరుగుదలకు కారణమయ్యాయి. ఇందులో రూపాయి (INR) విలువ తగ్గడం వల్ల బంగారం రాబడి పెరుగుతుంది. బంగారు ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్ మొదలైన వాటికి బలమైన డిమాండ్ పెరుగుతుంది. ఇందులో కేంద్ర బ్యాంకు కొనుగోలు, ప్రపంచ అనిశ్చితి, అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు వంటి అంశాలు ఉంటాయి.

మారకం విలువ :
కొత్త ఇల్లు, కొత్త ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు పాత బంగారు ఆభరణాలను తరచుగా మార్పిడి చేస్తుంటారు. అయితే, పాత ఆభరణాల మార్పిడి విలువ మార్కెట్ ధర ఆధారంగా మీరు ఆశించే దానికన్నా చాలా తక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే.. ఆభరణాల వ్యాపారులు కొనుగోలు సమయంలో తయారీ ఖర్చులు, జీఎస్టీని వసూలు చేస్తారు. అయితే, మీరు బంగారాన్ని అమ్మకానికి పెట్టినప్పుడు తయారీ ఛార్జీలను తగ్గించిన తర్వాత మీకు బంగారం ప్రస్తుత ధర మాత్రమే లభిస్తుంది.
బంగారంపై పన్ను విధింపు ఇలా :
ఫిజికల్ గోల్డ్ అమ్మడం ద్వారా వచ్చే ఏదైనా లాభం మూలధన లాభంగా పరిగణిస్తారు.
స్వల్పకాలిక లాభం (2 సంవత్సరాలలోపు అమ్మితే) : ఆదాయపు పన్ను స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు.
దీర్ఘకాలిక లాభం (2 సంవత్సరాల తర్వాత అమ్మకం ) : 12.5 శాతం చొప్పున పన్ను విధంపు (సర్‌ఛార్జ్, సెస్‌తో పాటు)
బంగారం అమ్మకంపై ఇండెక్సేషన్ ప్రయోజనం జూలై 23, 2024 నుంచి అందుబాటులో లేదు. బంగారం కొనుగోలు చేసేటప్పుడు మీరు బంగారం విలువపై 3శాతం జీఎస్టీ, తయారీ ఛార్జీలపై సుమారు 5శాతం జీఎస్టీ చెల్లించాలి.
బంగారం కొనేందుకు శుభ సమయమేనా? :
ఏదైనా ఆస్తిని కొనడం అనేది వ్యక్తి వ్యక్తిగత నిర్ణయం. మీరు ఎందుకు ఆస్తిని కొనాలనుకుంటున్నారు అనేదానిపై కూడా ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడి, సంపద సంరక్షణ, పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణ కోసం మీ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని బంగారం వంటి విలువైన లోహాలకు కేటాయించవచ్చు. అయితే, మీ ఆర్థిక లక్ష్యాలు, నష్టాన్ని కూడా అంచనా వేయడం చాలా ముఖ్యం. బంగారంపై స్వల్పకాలిక లాభాల కోసం మార్కెట్ టైమ్ నిర్ణయించడం కష్టమే.
ముఖ్యంగా ప్రస్తుత బంగారం ధరల విషయంలో తొందరపాటు నిర్ణయం పనికిరాదు. మార్కెట్ నిపుణులు ఒకరు మాట్లాడుతూ.. గత ఏడాదిలో బంగారం 50శాతం కన్నా ఎక్కువ భారీ రాబడిని అందించిందని చెప్పారు. ఇందుకు ప్రపంచ వాణిజ్య అనిశ్చితి, పెరుగుతున్న రుణ స్థాయిలు, కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు కారణమని తెలిపారు. ఈ స్థాయిలలోకి ప్రవేశించడం రిస్క్ కావచ్చు. అందుకే పెట్టుబడిదారులు ఇప్పుడు స్వల్పకాలంలో జాగ్రత్తగా బంగారంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
బంగారం ధర పెరుగుతూనే ఉంటుందా? :
బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయా? అంటే అతి కష్టమైన ప్రశ్న. దీనికి ఏ ఎక్స్‌పర్ట్ కూడా కచ్చితంగా సమాధానం చెప్పలేడు. చారిత్రాత్మకంగా, పసిడి లోహం ధర తగ్గుదలలను చూసింది. కానీ, దీర్ఘకాలికంగా స్థిరంగా పెరిగింది.
క్రెడిట్ కార్డ్ ఆఫర్లు :
ప్రస్తుతం మార్కెట్లో అనేక ఆభరణాల వ్యాపారులు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై తయారీ ఛార్జీలపై డిస్కౌంట్లను అందిస్తాయి. కొన్ని క్రెడిట్ కార్డులు ఆభరణాల కొనుగోలుపై అందించే రివార్డ్ పాయింట్లపై ఇ-వోచర్‌లను కూడా అందిస్తాయి. ఉదాహరణకు.. జోయాలుక్కాస్ HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా బంగారు ఆభరణాలపై తయారీ ఛార్జీలపై 20శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.
అదేవిధంగా, SBI కార్డ్ కళ్యాణ్ జ్యువెలర్స్‌లో కొనుగోలుపై ఇ-వోచర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌లు బంగారం కొనుగోలు సమయంలో మారవచ్చని గమనించాలి. అయితే, మీరు ధన్‌తేరాస్ రోజున బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మీ క్రెడిట్ కార్డ్‌లో ఏదైనా డిస్కౌంట్ ఆఫర్ ఉందో లేదో చెక్ చేయడం బెటర్.
Dhanteras 2025 : బంగారం ధరల పెరుగుదలకు 5 కారణాలివే :
2025 థంతేరాస్‌కు ముందుగానే బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఇందుకు అనేక కారణాలు లేకపోలేదు. బంగారం ధరల పెరుగుదలతో దాదాపు 60శాతం రాబడిని అందించాయి. చాలా మంది పెట్టుబడిదారులు ఈ బంగారం పెరుగుదలకు గల కారణాలపై అంచనాలు వేస్తున్నారు. బంగారం ధర పెరగడానికి గల కారణాలను హైలైట్ చేస్తూ టాటా మ్యూచువల్ ఫండ్ ఇటీవల ఒక నివేదికను వెల్లడించింది. ఆ ఐదు కారణాలేంటి? ఎలాంటి మార్పులు ఉండొచ్చు అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం..
1. తగ్గిన రూపాయి విలువ.. పెరిగిన బంగారం రాబడి :
బంగారంపై అధిక దిగుమతి సుంకం ఉన్నప్పటికీ భారత్ దాదాపు 86శాతం బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. దేశీయ మార్కెట్లలో బంగారం ధరల పెరుగుదలకు దారితీస్తుంది. అధిక దిగుమతి సుంకం ఉన్నప్పటికీ దాదాపు 86శాతం బంగారం భారత్‌కు దిగుమతి అవుతుంది.
యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోయినప్పుడు దేశీయంగా బంగారం అత్యంత ఖరీదైనదిగా మారుతుంది. స్థానికంగా బంగారానికి కూడా ఫుల్ డిమాండ్ పెరుగుతుంది. అందుకే బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుతాయని నివేదిక తెలిపింది. తద్వారా బంగారం రాబడిపై కూడా ప్రభావం పడుతుంది. ఉదాహరణకు.. నివేదిక ప్రకారం గత 30 ఏళ్లలో బంగారం నుంచి వార్షిక రాబడి డాలర్ (USD) పరంగా 7.6శాతం అయితే INR (రూపాయి) పరంగా 11శాతానికి చేరింది.
2. గోల్డ్ ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్‌కు భారీ డిమాండ్ :
బంగారం ధర పెరగడం వల్ల బంగారు ఆభరణాల డిమాండ్ తగ్గవచ్చు. ఆర్థికీకరణ పెరుగుదలతో డిజిటల్ గోల్డ్ పెట్టుబడి ప్రత్యామ్నాయాలైన గోల్డ్ ఈటీఎఫ్స్, డిజిటల్ గోల్డ్ వంటి వాటికి ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ పెట్టుబడి డిమాండ్ కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమైంది. భారతీయ ఆభరణాల డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నప్పటికీ ర్యాలీ తీవ్రతరమై పెట్టుబడి డిమాండ్ (గోల్డ్ ఇటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్) పెరుగుతోందని నివేదిక పేర్కొంది.
3. సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు :
భారత్, చైనా, రష్యా, జపాన్, ఇతర దేశాలలోని కేంద్ర బ్యాంకులు గత 10 ఏళ్లుగా బంగారం కొనుగోలుపై జోరుందుకున్నాయి. కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం దాదాపు రెట్టింపు అయింది. గత 10 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. గత 10 ఏళ్లలో దాదాపు రెట్టింపు అయ్యాయి. ఉదాహరణకు.. రష్యా, భారత్‌లోని కేంద్ర బ్యాంకులు 10 ఏళ్లలో బంగారాన్ని 1.6 రెట్లు పెంచగా చైనా 1.3 రెట్లు పెంచేసింది.

4. ప్రపంచ అనిశ్చితి :
రష్యా-ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచం పశ్చిమాసియాలో అశాంతి, వాణిజ్య-సుంకం సంఘర్షణలు వంటి అనేక భౌగోళిక రాజకీయ అనిశ్చితులను చవిచూసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో వాణిజ్య యుద్ధాలు తీవ్రమయ్యాయి. పెట్టుబడిదారులు బంగారం వంటి సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గుచూపుతున్నారు.
5. యూఎస్ ఫెడ్ రేటు తగ్గింపు :
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గించడంతో బంగారం ధరలపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికా ఫెడ్ రేట్లను మరింత తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలాంటి రేటు కోతలు డాలర్ విలువ తగ్గడానికి దారితీస్తాయి. ఫలితంగా బంగారం ధరలు పెరిగి మరింత డిమాండ్ పెరుగుతుంది. సెప్టెంబర్ 17, 2025న (FED) రిజర్వ్ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. బులియన్ మార్కెట్ బలహీనపడగా అక్టోబర్ సమావేశంలో యూఎస్ ఫెడ్ రేటును మళ్ళీ 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని అంచనా.
అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన ఉపాధి రెండింటి రిస్క్ ఎదుర్కొంటున్నందున యూఎస్ ఫెడ్ తదుపరి నిర్ణయాలకు ముందు రాబోయే ఆర్థిక డేటాను పర్యవేక్షిస్తుంది. ఫెడ్ రేటు కోతలు సాధారణంగా డాలర్ తగ్గుదలకు కారణమవుతాయి. బంగారానికి అధిక డిమాండ్, ధరలకు పెరుగుదలకు దారితీస్తుందని నివేదిక పేర్కొంది.
టాటా మ్యూచువల్ ఫండ్ బంగారం ధరలు స్వల్పకాలంలో 3,500 డాలర్ల నుంచి 4000 డాలర్ల మధ్య వైడ్ రేంజ్ అవుతాయని అంచనా వేస్తోంది. ఎందుకంటే.. ప్రపంచం యూఎస్ టారిఫ్ పాలసీ మార్పుల నేపథ్యంలో భౌగోళిక రాజకీయ నష్టాలతో యూఎస్ వృద్ధి ఆందోళనలను పెంచుతుంది. స్వల్పకాలికంగా బంగారం ధరల్లో తగ్గుదల ఉంటే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను కొనసాగించవచ్చు.
FAQs : Dhanteras 2025 Gold Buying Guide
1. భారత్‌లో ధంతేరాస్ సమయంలో బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయి?
ధంతేరాస్ సమయంలో అధిక డిమాండ్, పండుగ కొనుగోళ్లు, మార్కెట్ ఊహాగానాల కారణంగా ధంతేరాస్ కన్నా ముందు బంగారం ధరలు తరచుగా పెరుగుతాయి. ఆభరణాల వ్యాపారులు నిల్వలు పెంచుతారు. పెట్టుబడిదారులు ఆశతో బంగారాన్ని కొనుగోళ్లు చేస్తారు. తాత్కాలికంగా బంగారం ధరలు పెరుగుతాయి.
2. ధంతేరాస్ 2025 బంగారంలో పెట్టుబడికి మంచి సమయమా?
అవును.. భారత బులియన్ మార్కెట్లో బంగారం కొనడానికి ధంతేరాస్ శుభదినంగా భావిస్తారు. మార్కెట్ ట్రెండ్‌లు, ధరల అంచనాలు అనుకూలంగా కనిపిస్తే.. దీర్ఘకాలిక హోల్డింగ్‌కు తెలివైన పెట్టుబడి అవకాశంగా ఉంటుంది.
3. ధంతేరాస్ 2025 భారత్‌లో బంగారం పెట్టుబడికి టాక్స్ రూల్స్ ఏంటి?
రూ. 2 లక్షలకు పైగా బంగారం కొనుగోళ్లకు పాన్ కార్డ్ తప్పనిసరి. బంగారంపై 3 శాతం జీఎస్టీ ఉంది. మీరు బంగారం అమ్మినప్పుడు మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. దీర్ఘకాలిక లాభాలకు (3 ఏళ్ల తర్వాత) ఇండెక్సేషన్‌తో 20శాతం పన్ను విధిస్తారు.
4. ధంతేరాస్‌లో బంగారం కొనుగోలుకు ముందు స్వచ్ఛతను ఎలా చెక్ చేయవచ్చు?
బంగారు ఆభరణాలపై ఎల్లప్పుడూ BIS హాల్‌మార్క్ ఉందో లేదో చెక్ చేయండి. ఈ స్టాంపులో BIS లోగో, క్యారెట్లలో స్వచ్ఛత (ఉదా.. 22K లేదా 24K) ఒక ప్రత్యేక కోడ్, ఆభరణాల వ్యాపారి గుర్తింపు ఉంటాయి.
5. ఈ ధంతేరాస్ 2025కి ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయాలా?
మీరు సాంప్రదాయ ఆభరణాలు కొనాలని భావిస్తే.. ఫిజికల్ గోల్డ్ కొనడం మంచిది. కానీ సురక్షితమైన, నిల్వ-రహిత పెట్టుబడికి డిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) మెరుగైన రాబడిని, పన్ను ప్రయోజనాలను అందిస్తాయి.








