Car Insurance Renewal 2025 : మీకు కారుకు ఇన్సూరెన్స్ ఉందా? కారు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించారా? లేదంటే ఇప్పుడే చేయించుకోండి. చాలామంది వాహనదారులు కారు ఇన్సూరెన్స్ తీసుకున్నాక అది రెన్యువల్ సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలను పట్టించుకోరు. అంతేకాదు.. ఇన్సూరెన్స్ తీసుకున్న (Car Insurance Renewal) సమయంలో కారు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ, కొన్ని కీలకమైన అంశాలను నిర్లక్ష్యం చేయడం వల్ల భారీగా ఖర్చులు పెరుగుతాయి.
అంతేకాదు.. మీ బీమా కవరేజీని తగ్గిస్తుంది. అనవసరమైన ఒత్తిడికి దారితీయొచ్చు. ప్రస్తుతం ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి అన్ని వివరాలను తెలుసుకునేందుకు అనేక ఆన్‌లైన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి.
2025లో కారు ఇన్సూరెన్స్ రెన్యువల్ చాలా ఈజీ అయిపోయింది. కానీ, మీరు చేయాల్సిందిల్లా.. కారు బీమా రెన్యువల్ సమయంలో ఏయే విషయాలను చెక్ చేయాలి? ఎప్పుడు అలర్ట్‌గా ఉండాలి అనేది అవగాహన కలిగి ఉండాలి. మీ కారు ఇన్సూరెన్స్ పాలసీని ఎలా రెన్యువల్ చేయాలో పూర్తి గైడ్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం..
Car Insurance Renewal : మీ పాలసీ గడువు ముగిసేది ఎప్పుడు? :
మీ కారు ఇన్సూరెన్స్ ఎప్పుడు ముగుస్తుందో కచ్చితంగా తెలుసుకోవాలి. చాలా మంది ఈ రెన్యువల్ ప్రాసెస్ పెద్దగా పట్టించుకోరు. గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ కవర్ గడువు ముగిసిందని బాధపడిపోతుంటారు. ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. ఒక మాటలో చెప్పాలంటే చట్టవిరుద్ధం. మీరు క్లెయిమ్ దాఖలు చేయాల్సి వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
గడువు తేదీ కన్నా చాలా ముందుగానే నోటిఫికేషన్ సెట్ చేయండి. సాధారణంగా 2 వారాల నుంచి 3 వారాల లీడ్ టైమ్ సరిపోతుంది. చాలా మంది బీమా సంస్థలు, ఇమెయిల్ లేదా SMS అలర్ట్స్ కూడా పంపుతాయి. రెన్యువల్ ప్రాసెస్ చేసేందుకు వీలుగా రిమైండర్‌లుగా ఉంటాయి.

మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ కవరేజీని రివ్యూ చేయండి :
మీరు రెన్యువల్ చేసే ముందు మీ ప్రస్తుత కారు ఇన్సూరెన్స్ పాలసీని ఇతర ఆఫర్లతో పోల్చాలి. మీ రోజువారీ ప్రయాణం మారిందా? మీరు గత ఏడాదిలో కన్నా ఎక్కువ లేదా తక్కువగా డ్రైవింగ్ చేస్తున్నారా?
మీ కారులో ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ అవసరమయ్యే ఏవైనా పెద్ద మార్పులు చేశారా? మీరు చేసే అతి చిన్న మార్పులు కూడా పెద్ద ఇంఫాక్ట్ కలిగిస్తాయి. అందుకే ఏ రకమైన పాలసీ అవసరమో మీకు అవగాహన కలిగి ఉండాలి. మీరు థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకుంటే వైడ్ కవరేజ్ ఉన్న కంప్రన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కి మారడంపై తప్పనిసరిగా ఆలోచించాలి.
ప్లాన్‌లు, ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌లను పోల్చండి :
మీరు ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ చేసే ముందు అల్ట్రానేట్ ఇన్సూరెన్స్ ఆప్షన్లను రీసెర్చ్ చేస్తుండాలి. మీకు అవసరమైన ప్రొటెక్షన్ లెవల్ మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీ తక్కువ కవరేజీ ఉండకపోవచ్చు. పాపులర్ ఇన్సూరెన్స్ కంపేర్ చేసేందుకు వెబ్‌సైట్‌లలో ప్లాన్‌లను సరిపోల్చండి.
కేవలం అతి తక్కువ ప్రీమియం కోసం వెళ్లవద్దు. అలాగే, జీరో డిప్రిసియేషన్ కవర్, ఇంజిన్ ప్రొటెక్షన్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి యాడ్-ఆన్‌లను చెక్ చేయండి. ప్రొవైడర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, కస్టమర్ సర్వీస్ క్వాలిటీ కూడా ప్రభావితం చేస్తాయి.
యాడ్ ఆన్ వాల్యూ ఏంటి? :
యాడ్-ఆన్ వాల్యూ అనేవి మీ బేసిక్ ఇన్సూరెన్స్ పాలసీ కన్నా అధిక మొత్తంలో బెనిఫిట్స్ పొందవచ్చు. అంటే బేస్ పాలసీని పొడిగించే అదనపు కవరేజీలు. వీటిని ఎంచుకుంటే మీకు అదనపు భారం పడుతుంది.
కానీ, చాలా సందర్భాలలో మీకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా మారతాయి. కొన్ని యాడ్ ఆన్ వాల్యూ కవరేజీలతో చాలామంది పాలసీదారులకు అత్యంత ప్రయోజనకరంగా నిలిచాయి. అలాంటి బాగా పాపులర్ పొందిన కొన్ని యాడ్-ఆన్‌లు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
- జీరో డిప్రిసియేషన్ కవర్ : ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ సమయంలో కారు పార్టుల డిప్రిసియేషన్ అసలు తగ్గదని గమనించాలి.
- రోడ్‌సైడ్ అసిస్టెన్స్ : మీ కారు చెడిపోయిన సందర్భంలో మీకు అత్యవసర సాయాన్ని అందిస్తుంది.
- ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ : వరదలకు గురయ్యే ప్రదేశాల్లోని కార్లకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.
- నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ : మీరు ఒకసారి చిన్న క్లెయిమ్ చేయాల్సి వచ్చినప్పటికీ మీ బోనస్‌ను అలానే ఉంచుకోవచ్చు.
- మీ డ్రైవింగ్ స్టయిల్, ప్రాంతానికి సంబంధించిన యాడ్-ఆన్‌లను ఎంచుకోవడం బెటర్.
నో క్లెయిమ్ బోనస్ (NCB)ని చెక్ చేసి అప్లయ్ చేయండి :
మీ గత కారు ఇన్సూరెన్స్ పాలసీ కాలంలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయలేదా? మీరు స్పెషల్ డిస్కౌంట్ పొందవచ్చు. మీరు క్లెయిమ్ చేయనంత వరకు ఇది ప్రతిఏటా పెరుగుతుంది. కాలక్రమేణా 50శాతం వరకు పొందవచ్చు.
మీరు ఇన్సూరెన్స్ (Car Insurance Renewal) కంపెనీలను మార్చినట్లయితే మీ NCB కూడా ముందుకు తీసుకెళ్లవచ్చు. కానీ, అలా చేయడానికి మీరు అఫీషియల్ డాక్యుమెంట్ కోసం మీ ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించాలి. రెన్యువల్ సమయంలో NCBని ఉపయోగించడం వల్ల ప్రీమియం ఖర్చులు భారీగా తగ్గించుకోవచ్చు.
మీ పాలసీ గడువు దాటకుండా జాగ్రత్త పడండి :
మునుపటి ఇన్సూరెన్స్ పాలసీ వ్యవధిలో మీరు క్లెయిమ్ చేయకపోతే NCB అనేది ప్రీమియంపై డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ బేస్ రేటుకు అప్లయ్ అవుతుంది. తర్వాతి క్లెయిమ్-రహిత సంవత్సరాలకు యాడ్ అవుతుంది. టాప్ బెనిఫిట్ 50శాతం వరకు ఉండవచ్చు.
NCB ఎలా ప్రొటెక్ట్ చేయాలి? ఎలా ఉపయోగించాలి :
- ఇన్సూరెన్స్ కంపెనీలను మార్చుకుంటే మీ కొత్త ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయండి.
- మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ సంస్థ నుంచి NCB సర్టిఫికెట్‌ను రిక్వెస్ట్ చేయండి.
- మీ తర్వాత పాలసీ రెన్యువల్ సమయంలో NCB కోసం అప్లయ్ చేసుకోండి.
- మీ నో క్లెయిమ్ బోనస్ డిస్కౌంట్ అలానే ఉండాలంటే మీరు చిన్న క్లెయిమ్‌ల కోసం అప్లయ్ చేయొద్దు.
Car Insurance Renewal : ఆన్‌లైన్‌లో రెన్యువల్ వల్ల సమయం ఆదా :
ఆన్‌లైన్ కారు ఇన్సూరెన్స్ రెన్యువల్ ఇప్పుడు అత్యంత వేగవంతమైనది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీదారుల కోసం సులభమైన ఆన్‌లైన్ పోర్టల్‌ను అందిస్తాయి.
మీరు మీకు నచ్చిన ఇన్సూరెన్స్ పాలసీలను మీరు ప్లాన్‌లతో కంపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాతే మీ ప్రీమియం చెల్లించవచ్చు. మీ పాలసీ డాక్యుమెంట్లను నిమిషాల వ్యవధిలో స్వీకరించవచ్చు. ఈ విధానం మీకు పేపర్ వర్క్ లేకుండా నివారిస్తుంది. ఆన్‌లైన్‌లో డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు.
మీ కారు రెన్యువల్ కోసం ఒక కాపీని ప్రింట్ తీసుకోండి. మీ పాలసీని రెన్యువల్ చేసే సమయంలో మీ ఫోన్‌లో డిజిటల్ కాపీని తీసుకెళ్లండి. రెండు ఎడిషన్‌లను కలిగి ఉండటం ఉంటే మీకు ఇన్సూరెన్స్ ఉందని ఈజీగా చూపించుకోవచ్చు. అప్పుడు మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు.
మీ కారు మెయింట్‌నెన్స్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఎలా లింక్ చేయాలంటే?
ప్రతిఒక్కరి జీవితంలో కారు లేదా ఏదైనా వెహికల్ అనేది ఒక ఆర్థికపరమైన పెట్టుబడిగా మారింది. కార్ల యజమానులు అందరూ వాహనాల విషయంలో సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. మీ కారు ఇన్సూరెన్స్ కవరేజీతో క్రమం తప్పకుండా మెయింట్‌నెన్స్ జత చేయడం వల్ల లాంగ్ టైమ్ మీ ప్రాపర్టీని రక్షించుకోవచ్చు. ఈ గైడ్‌లో స్మార్ట్, సేఫ్, ఒత్తిడి లేని డ్రైవింగ్ రెండింటినీ సద్వినియోగం చేసుకోవచ్చు. మీ కారుకు ప్రొటెక్షన్ అందించే మీ ఇన్సూరెన్స్ స్కీమ్‌తో ఎలా అనుసంధానం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కారు మెయింట్‌నెన్స్ ఎందుకు ముఖ్యమంటే? :
కారు సాధారణ మెయింట్‌నెన్స్ అనేది మీ కారును సక్రమంగా రన్ అయ్యేలా చేస్తుంది. తద్వారా ఖరీదైన రీపేరింగ్ ఖర్చులను నివారించవచ్చు. సేఫ్టీని పెంచుకోవచ్చు. రీసేల్ వాల్యూ కూడా పెంచుకోవచ్చు. మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల ప్రక్రియను కూడా ప్రభావితం చేయవచ్చు. నిర్లక్ష్యం కారణంగా చాలా వాహనాలు కాలక్రమేణా ఇంజిన్ సమస్యలు, పవర్ లోపాలు వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటాయి. అందుకే సూచించిన సర్వీసు షెడ్యూల్‌ను ఫాలో చేయడం ఎంతైనా మంచిది.
ఇన్సూరెన్స్ పాలసీలు మెయింట్‌నెన్స్‌తో ఎలా వర్క్ అవుతాయంటే? :
చాలా బేసిక్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రమాద నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తాయి. మెయింట్‌నెన్స్ విస్మరించినప్పుడు కవర్ లెవల్ మారవచ్చు. ఉదాహరణకు.. విస్మరించిన ఆయిల్ సర్వీస్ కారణంగా ఇంజిన్ ఫెయిల్ అయితే మీ జనరల్ పాలసీ పూర్తి రీపేరింగ్ ఖర్చులను కవర్ చేయకపోవచ్చు.
మెయింట్‌నెన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. దీని ఆధారంగానే ACKO వంటి ప్రముఖ డిజిటల్-ఫస్ట్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ పూర్తి ప్లాన్లను అందిస్తుంది. ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్, కీ లాస్ కవర్ వంటి యాడ్-ఆన్‌లతో కస్టమైజ్ ఆప్షన్లతో మీరు https://www.acko.com/ నుంచి కొనుగోలు చేయవచ్చు.
మెయింట్‌నెన్స్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ పొందడానికి అవసరమయ్యే టిప్స్ ఇవే :
1. మెయింట్‌నెన్స్ షెడ్యూల్‌ను క్రియేట్ చేయండి :
బ్రేక్ ఫ్లూయిడ్ మార్పులు, ఏసీ సర్వీసింగ్ వంటి సాధారణ మెయింట్‌నెన్స్ టాస్కులు, గైడ్ లైన్స్ సిఫార్సు చేసిన ఫ్రీక్వెన్సీతో పాటు ఓనర్ మాన్యువల్‌ను చూడండి. మీరు సాధారణ చెకింగ్ ఎప్పటికీ మిస్ చేయకుండా మీ ఫోన్ క్యాలెండర్‌లో రిమైండర్‌లను సెట్ చేసుకోండి.
2. పూర్తి స్థాయిలో రికార్డులను భద్రపరచండి :
మెయింట్ నెన్స్ హిస్టరీ వ్యక్తిగత లాగ్‌తో పాటు అన్ని రిపేరింగ్ సర్వీసు ఇన్‌వాయిస్‌లను జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రతి మెయింట్ నెన్స్ ప్రతి సర్వీసు వర్క్ కోసం ఉపయోగించే మైలేజ్, తేదీ, స్పేర్ పార్టులు, వినియోగ వస్తువులను వివరంగా రాసి పెట్టుకోండి. పూర్తి డాక్యుమెంటేషన్ జాగ్రత్త చదివి భద్రంగా దాచుకోండి.
3. సరైన ఇన్సూరెన్స్ స్కీమ్ ఎంచుకోండి :
మీ కారు వినియోగానికి సరిపోలే సరైన ప్లాన్ ఎంచుకోండి. ముందుగా ఆఫర్‌లను బాగా చదివి అర్థం చేసుకోండి. క్లెయిమ్‌ల సమయంలో సాధారణ వాహన సంబంధించిన వినియోగ వస్తువులు, స్పేర్ పార్టుల అరుగుదల ఇతర అదనపు అంశాలను కవర్ చేస్తుంది.
4. సమస్యలను వెంటనే పరిష్కరించండి :
చిన్న చిన్న మార్పులు లేదా లోపాలు, వింత శబ్దాలు వంటివి కూడా ఎప్పుడూ విస్మరించవద్దు. చిన్నపాటి సమస్యలు పెద్దవిగా మారకముందే ప్రారంభ దశలోనే క్లియర్ చేయండి. ముందస్తుగా రాబోయే విపత్తులను కూడా నివారిస్తుంది.
5. పాలసీ నిబంధనలను అర్థం చేసుకోండి :
పాలసీ నిబంధనలను తప్పక నివారించండి. పాలసీలో ప్రతి చిన్న వివరాలను తప్పక చదవండి. వెయిటింగ్ పీరియడ్ టైమ్, మినహాయింపులు, క్లెయిమ్ విధానాలు అవసరమైన డాక్యుమెంటేషన్ గురించి తెలుసుకోండి. అలాగే, మీరు రీపేరింగ్ కోసం క్లెయిమ్ చేస్తే వర్తించే వినియోగ వస్తువులు, జీరో డిప్రిషియేషన్ రేట్లు వంటి కవర్లపై పరిమితుల గురించి తెలుసుకోండి.
కారు మెయింట్‌నెన్స్ విషయంలో నివారించాల్సిన సాధారణ తప్పులివే :
డెయిలీ మెయింట్‌నెన్స్ స్కిప్ చేయడం :
కేర్ లెస్ సర్వీసు అలవాట్లు అనేవి వాహన వారంటీ నిబంధనలను రద్దు అయ్యేలా చేస్తాయి. ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు తిరస్కరణకు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే అవి నిర్లక్ష్యం వల్ల సంభవించి బ్రేక్‌డౌన్ లేదా ప్రమాద నష్టానికి దారితీస్తాయి. షార్ట్‌కట్‌ల జోలికి వెళ్లొద్దు.
డాక్యుమెంటింగ్ సర్వీసులొద్దు :
చాలామంది ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల సమయంలో వివరణాత్మక సర్వీసు రికార్డులను సమర్పించలేకపోతారు. తద్వారా వ్యాలీడ్ అయ్యే రీపేరింగ్ అవసరాలకు కూడా జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మెయింట్‌నెన్స్ కు సంబంధించి వివరాలను ఖాళీగా ఉంచవద్దు.
వార్నింగ్ అలర్ట్స్ విస్మరించడం :
పరిష్కరించలేని సమస్యలు క్రమంగా తీవ్రంగా మారతాయి. చెక్ ఇంజిన్ లైట్ వంటి ఇండికేషన్లు ఎప్పుడూ తోసిపుచ్చకండి. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న సమస్యలు సైతం పెద్ద సమస్యలుగా మారవచ్చు.
తగినట్టుగా ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం :
వినియోగ వస్తువుల కవర్ లేదా ఇంజిన్ రక్షణ వంటి అదనపు వస్తువులు లేకుండా ప్రాథమిక మూడవ పక్ష ప్రణాళికలను ఎంచుకోవడం అంటే మీరు మీ స్వంత జేబులో నుండి అన్ని సంబంధిత మరమ్మతు బిల్లులను చెల్లించాలి, ఇది ఖరీదైన తప్పుగా మారుతుంది!
మెయింట్ నెన్స్, ఇన్సూరెన్స్ ద్వారా కలిగే ప్రయోజనాలివే :
ఈ మెయింట్ నెన్స్, ఇన్సూరెన్స్ రెండూ కలపడం ద్వారా అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో వివరంగా చూద్దాం..
ఫైనాన్స్ సేవింగ్స్ :
యాంత్రిక సమస్యల నుంచి ఊహించని ఖర్చులను తగ్గించుకోవడానికి కంప్రన్సీవ్ ఇన్సూరెన్స్, కారు మెయింట్ నెన్స్ అత్యంత ముఖ్యమని చెప్పవచ్చు. అలాగే మీ పెట్టుబడులను తెలివిగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీ కారు పనితీరు, ఊహించని రిపేరింగ్ వంటివి ఉన్నప్పుడు ఈ పాలసీ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు అన్ని ప్రాథమిక అంశాలను తెలుసుకుని ఉండాలి.
లాంగ్ టైమ్ కారు వాల్యూ :
మీరు మీ కారును క్రమం తప్పకుండా మెయింట్ నెన్స్, బ్రేక్‌డౌన్ ఖర్చులు, కవరేజ్‌తో పాటు అన్ని సరిచూసుకోవాలి. తద్వారా మీ కారును అమ్మినప్పుడు భవిష్యత్తులో రీసేల్ వాల్యూ కూడా పెరుగుతుంది.














