Make Money Online : అందరికి డబ్బులు సంపాదించాలని ఉంటుంది. కానీ, కొందరు మాత్రమే అనుకున్న విధంగా డబ్బును సంపాదించగలరు. అంతే మొత్తంలో డబ్బును కూడబెట్టగలరు. ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్ ద్వారా అద్భుతమైన ఆదాయాన్ని సంపాదించేవారు చాలామంది ఉన్నారు. ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ తమకు ఉన్న టాలెంట్, స్కిల్స్ బేస్ చేసుకుని మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
చాలామంది ఎక్కువగా (Make Money Online) ఆసక్తి చూపించేది ఒక్కటే.. ఇంట్లో ఉండి ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవాలి? ఇందుకు అనేక మంచి మార్గాలు ఎన్నో ఉన్నాయి. రియల్ వే ద్వారా అద్భుతమైన ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందిల్లా మీలోని ప్రతిభను బయటపెట్టడమే. అంటే.. ఇక్కడ మీకు మీ ప్రతిభే పెట్టుబడి అనమాట..
సాధారణంగా ప్రతిఒక్కరికి ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉండే ఉంటుంది. దాన్ని బయటకు తీయగలిగితే అదే ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఇందుకోసం అనేక మార్గాల్లో ఆన్‌లైన్ ద్వారా డీసెంట్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అది కూడా జన్యున్ గానే.. మీకు ఏదైనా వెబ్ సైట్ల డిజైన్ పట్ల అవగాహన ఉంటే వెబ్ డిజైనింగ్ ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.
ఏదైనా ఫ్రిలాన్సింగ్ ట్రై చేయొచ్చు. డెలివరీ డ్రైవర్‌గా కూడా చేయొచ్చు. బాగా డబ్బులు సంపాదించుకోవాలంటే సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఇందుకు మార్కెట్లో అనేక మార్గాలు, మరెన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఎలా డబ్బులు సంపాదించుకోవాలో తెలుసుకునేందుకు ఈ 10 గోల్డెన్ ట్రిక్స్ ఓసారి ట్రై చేయండి.
1. ఆన్‌లైన్‌లో ఫ్రీలాన్స్ వర్క్ ఎంచుకోండి :
ప్రతిఒక్కరిలో స్పెషల్ స్కిల్స్, విజయం సాధించాలనే తపన ఉంటే చాలు.. మీకోసం ఉద్యోగవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. మీ ప్రొఫైల్‌ను క్లయింట్‌లను ఆకట్టుకునేలా ఉంచుకోవాలి. ఆన్‌లైన్‌లో అనేక ఫ్రీలాన్స్ వెబ్‌సైట్‌లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు.. Upwork , Fiverr, Freelancer.com ఇలా అనేక ప్లాట్‌ఫారమ్‌లు రైటింగ్, ప్రోగ్రామింగ్, మార్కెటింగ్, డిజైన్, డేటా ఎంట్రీ, వర్చువల్ అసిస్టెన్స్ వంటి ఉద్యోగ అవకాశాలను అందిస్తాయి.
మీరు అడిగిన వర్క్ చేసి పెట్టేందుకు ఎంత రేటు నిర్ణయించాలో తెలిసి ఉండాలి. దీనికోసం మీరు బాగా రీసెర్చ్ చేయాలి. కొంతమంది ఫ్రీలాన్సర్లు తమ ఫ్రీలాన్స్ రైటింగ్ సర్వీసులకు గంటకు 100 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు.
అన్ని ఫ్రీలాన్స్ ప్లాట్ ఫారాల్లో ఏఐ టెక్నాలతో అవకాశాలు (Make Money Online) ఉండవని ఆందోళన అవసరం లేదు. ప్రస్తుత ఏఐ టెక్నాలజీని మీ ప్రతిభకు అనుగుణంగా ఎలా ఉపయోగించుకోవచ్చో ఆలోచించండి. అప్‌వర్క్ ఇటీవలి రీసెర్చ్ ప్రకారం.. AI ఏజెంట్లతో సహకరించే హ్యుమన్ రీసోర్సెస్ వాస్తవానికి ప్రాజెక్ట్ పూర్తి రేట్లను 70శాతం వరకు పెంచారట.
ఫస్ట్ టైమ్ మీరు ఏదైనా ఫ్రీలాన్స్ వర్క్ తీసుకుంటే కొంత సమయం పట్టవచ్చు. అందుకే మీ వర్క్ టైమ్ 24 గంటల నుంచి 48 గంటలు సెటప్ చేసుకోవచ్చు. ఇక మీకు కావాల్సిందిల్లా మీకు స్కిల్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది. ఏజ్ లిమిట్ సాధారణంగా 16 ఏళ్లు నుంచి 18 ఏళ్లకు పైగా ఉండాలి. మీరు చేసే వర్క్ ఆయా సైట్ బట్టి మీకు వచ్చే ఆదాయం ఎంత అనేది ఉంటుంది.
2. వెబ్‌సైట్లు, యాప్‌లను టెస్టింగ్ చేయడం :
ఇంటి నుంచి ఈజీగా డబ్బు సంపాదించే మార్గాల్లో ఇది రెండోది. (UserTesting.com) వంటి వెబ్‌సైట్‌లలో ఉంటుంది. కొన్ని వెబ్‌సైట్‌లు బాగుంటాయి.. కొన్ని సైట్లు అంత బాగా ఉండవు అనేదానిపైనే మీరు డబ్బులు రావడం ఉంటుంది. మీరు అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆపై మీరు వివిధ పరీక్షా ఫార్మాట్‌లలో వెబ్‌సైట్‌లు లేదా యాప్ కొన్ని ఫీచర్లను టెస్టింగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.

ఈ వర్క్ పనిచేయడానికి మీకు అప్రూవల్ రావడానికి కొన్ని రోజుల సమయం పట్టవచ్చు. అంటే ఒక గంట కన్నా తక్కువ సమయమే ఉంటుంది. మొదలుపెట్టడం కూడా చాలా ఈజీ అనమాట.
మీకు టెక్నికల్ డివైజ్‌లు ఉండాలి. ఈ వర్క్ చేయడానికి ఏజ్ లిమిట్ 18 ఏళ్లకు పైగా ఉండాలి. సాధారణంగా 14 రోజుల తర్వాత మీ చేసిన వర్క్ ఆధారంగా డబ్బులు చెల్లిస్తారు.
3. డబ్బుల కోసం లీగల్ సర్వేలు, ఆన్‌లైన్ గేమ్స్ ఆడండి :
మీరు ఆన్‌లైన్ సర్వేలు తీసుకోవచ్చు. లేదంటే గేమ్స్ ఆడటం ద్వారా ఇంటి నుంచి డబ్బు సంపాదించవచ్చు. కానీ, పెద్దగా సంపాదించాలని ఆశించకండి. ఈ సైట్‌లు తక్కువ మొత్తంలో ఆదాయాలను అందించగలవు అంతే.
చాలా సైట్‌లు క్యాష్ కన్నా గిఫ్ట్ కార్డులను సంపాదించేందుకు బాగా ఉపయోగకరంగా ఉంటాయి. స్వాగ్‌బక్స్, సర్వే జంకీ అనేవి కేవలం రెండు పాపులర్ సర్వే ఫర్ మనీ సైట్‌లు ఉన్నాయి. ప్రోలిఫిక్ అనేది మరో ఆప్షన్. తక్కువ అంచనాలతో సర్వేలు, ఆన్‌లైన్ గేమ్స్ ప్రారంభించండి. పాకెట్ చేంజ్‌తో సరే.
ఈ సర్వేలు, గేమ్స్ ఆడటం ద్వారా డబ్బులు సంపాదించేందుకు కొంత సమయం పట్టవచ్చు. ఇందుకు కేవలం నిమిషాల సమయం పడుతుంది. ప్రారంభించడం కూడా చాలా ఈజీ. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని వర్క్ ప్రారంభించాలి. ఈ వర్క్ కోసం ఏజ్ లిమిట్ 13 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు పైగా ఉండాలి. సైట్ ఆధారంగా మీకు వచ్చే డబ్బు అంత త్వరగా ఉంటుంది. అయితే, అది కూడా మీరు ఎంచుకున్న సైట్‌ను బట్టి మారుతుంది.
4. అఫిలేటెడ్ లింక్‌లతో బ్లాగ్ నుంచి డబ్బు సంపాదన :
మీకు మంచి ట్రాఫిక్ వచ్చే బ్లాగర్ అయితే అఫిలేటెడ్ నెట్‌వర్క్‌లో జాయిన్ కావడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఇతర ప్రొడక్టులను రివ్యూ చేసే క్రియేటర్లు డబ్బు సంపాదించుకోవడానికి ఇదో అద్భుతమైన మార్గం. ఏదైనా బ్రాండ్ లేదా మార్కెట్‌ప్లేస్ అఫిలేటెడ్ సంస్థగా, ఎవరైనా వెబ్‌సైట్ నుంచి పార్టనర్ సైట్‌కు క్లిక్ చేసి ఏదైనా కొనుగోలు చేసినప్పుడు మీకు పేమెంట్ కమిషన్ మాదిరిగా పొందవచ్చు.
అఫిలేటెడ్ మార్కెటింగ్ మీ బ్లాగ్, వీడియో లేదా సోషల్ మీడియా ఛానెల్‌లో వర్క్ అవుతుంది. మీరు అఫిలేటెడ్ లింక్స్ ద్వారా ఫాలోవర్లను పొందాలంటే చాలా సమయం పడుతుంది. మీరు బ్లాగ్ టెంప్లేట్‌లతో సైట్‌ను డిజైన్ చేయడం చాలా సులభం కూడా దీనికి వయస్సుతో ఎలాంటి సంబంధం ఉండదు. మీకు డబ్బులు రావడానికి సగటున ఒకటి లేదా రెండు నెలల సమయం పడుతుంది.
5. మీ వస్తువులను (Etsy)లో అమ్మేయండి :
నగల తయారీ, చెక్క పని, ఎంబ్రాయిడరీ లేదా కుండల తయారీపై ఇష్టం ఉందా? చేతివృత్తుల వస్తువులను విక్రయించేందుకు గో-టు సైట్ (Etsy)లో మీ చేతిపనులను అమ్మండి. Etsy ప్రకారం.. కంపెనీకి 95 మిలియన్లకు పైగా యాక్టివ్ కొనుగోలుదారులు ఉన్నారు.
ఆసక్తిగల కస్టమర్‌లు మిమ్మల్ని రీచ్ అవ్వడానికి చాలా సమయం పట్టవచ్చు. మీరు చేయాల్సిందిల్లా ఇందులో జాయిన్ కావడమే. ప్రారంభించడం కూడా చాలా ఈజీ. ఈ పనిచేయడానికి వయస్సు పరిమితి 13ఏళ్లకు పైగా ఉండాలి. మీ ప్రాధాన్యతను బట్టి రోజువారీ, వారం, రెండు వారాలకు ఒకసారి లేదా నెలవారీగా డబ్బులు సంపాదించుకోవచ్చు.
6. e-బుక్స్ స్వయంగా పబ్లీష్ చేయండి :
ప్రస్తుత రోజుల్లో ఒక మంచి పుస్తకం రాయడం చాలా కష్టం. కానీ, ఇంటర్నెట్ ఆయా బుక్స్ మార్కెట్‌కు తీసుకురావడాన్ని ఈజీ చేస్తుంది. మీరు మంచి స్టోరీలను రాయగల రచయిత అయితే, మీరు అమెజాన్ కిండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్ సాయంతో మీ పుస్తకాలను కిండిల్ స్టోర్‌లో అమ్మవచ్చు. పుస్తకాన్ని పబ్లీష్ చేయడం ఉచితం. మీరు ప్రతి అమ్మకంలో 70శాతం వరకు రాయల్టీలలో సంపాదించవచ్చు. మీ పుస్తకాన్ని రాయండి. స్పష్టమైన వివరణతో పాటు అవసరమైన వివరాలను రిజిస్టర్ చేయండి.
మీ మాన్యుస్క్రిప్ట్‌ను అప్‌లోడ్ చేయండి. ఆ పుస్తకం ధరను నిర్ణయించండి. అది అమ్ముడవుతుందో లేదో చెక్ చేయండి. మీ పుస్తకం అమ్మకానికి రెడీ అయ్యాక KDPలో త్వరగా అమ్ముకోవచ్చు. వయస్సు పరిమితి 18ఏళ్లకు పైగా ఉండాలి.
కానీ, తల్లిదండ్రులు, సంరక్షకులు మైనర్‌ల పుస్తకాలను విక్రయించేందుకు వారి అకౌంట్లను ఉపయోగించవచ్చు. నెలవారీగా వైర్ లేదా చెక్ పేమెంట్ల ద్వారా మీరు 100 డాలర్ల థ్రెషోల్డ్‌ను రీచ్ అవ్వాలి. అప్పుడే మీకు డబ్బులు చేతికి వస్తాయి.
8. మీ బ్లాగ్ యూట్యూబ్ ఛానెల్ యాడ్స్‌తో ఆదాయం :
మీ యూట్యూబ్ వీడియోలు(Youtube.com) లేదా బ్లాగ్ పోస్ట్‌లు ఫాలోవర్లను ఆకట్టుకుంటే మీరు వీడియోపై ప్లే అయ్యే యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. మీరు మీ ఛానెల్‌లో యాడ్స్ రన్ చేయాలంటే యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు అప్లయ్ చేసుకోవాలి. సాధారణంగా యూట్యూబ్ 1,000 మంది సబ్‌స్క్రైబర్‌లను బెంచ్‌మార్క్‌గా నిర్ణయించింది.
ఛానెల్ మెంబర్‌షిప్‌లు వంటి ఇతర మానిటైజింగ్ ఫీచర్‌ల కోసం మీరు 500 మంది సబ్‌స్క్రైబర్‌లతో అప్లయ్ చేసుకోవచ్చు. మీ సంపాదన పెంచుకోవడానికి మీ బ్లాగ్ లేదా వెబ్‌సైట్‌లో సంబంధిత యాడ్స్ రన్ చేయడానికి మీరు యూట్యూబ్‌లో అదే యాడ్ ప్లాట్‌ఫామ్ అయిన గూగుల్ యాడ్‌సెన్స్ (Google AdSense)ని కూడా ఉపయోగించవచ్చు.
ఈ యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించడానికి అనేక వారాలు పట్టవచ్చు. లేదంటే నెలలు కూడా పట్టొచ్చు. ఎవరైనా ఈజీగా ప్రారంభించవచ్చు. ఆసక్తికరమైన వీడియోలను క్రియేట్ చేయడంపైనే రెవిన్యూ ఆధారపడి ఉంటుంది.
దీనికి వయస్సు పరిమితి 18ఏళ్లు పైబడి ఉండాలి. ఫస్ట్ టైమ్ పేమెంట్ వచ్చేందుకు చాలా సమయం పట్టవచ్చు. ఆ తర్వాత నెలవారీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు 100 డాలర్ల థ్రెషోల్డ్‌ను రీచ్ అవ్వాలి. అప్పుడే ఇందులో నుంచి డబ్బులు వస్తాయి.
9. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వండి :
చాలా కంపెనీలు తమ ప్రొడక్టులను ప్రమోట్ చేసేందుకు ఇన్‌స్టాగ్రామ్ (Instagram.com) ఇన్‌ఫ్లుయెన్సర్‌లను ప్లాట్‌ఫామ్‌లో భారీ సంఖ్యలో డెడికేటెడ్ యాక్టివ్ యూజర్లను సంప్రదిస్తున్నాయి. అయితే, ఆ స్థాయికి చేరుకోవడం చాలా కష్టం. ప్రొఫెషనల్‌గా మారేందుకు చాలా సమయం పట్టొచ్చు.
మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉండండి. మీ పోస్టులు బాగా వైరల్ అయితే మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ అవుతారు. అప్పుడు ఓపెన్ ఇన్ఫ్లుయెన్స్ లేదా ఆస్పైర్ వంటి మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా మీరు వర్క్ చేయాలనుకునే బ్రాండ్‌లను సంప్రదించేందుకు అప్లయ్ చేసుకోవచ్చు.
మీరు ఈ విధంగా TikTokలో కూడా డబ్బు సంపాదించవచ్చు. మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యేందుకు క్రమం తప్పకుండా పోస్టులు పెడుతూనే ఉండాలి. మీకు ఫాలోవర్లు లేకుండా మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వలేరు. ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యేందుకు వయస్సు పరిమితి: 13 ఏళ్లకు పైబడి ఉండాలి. మీకు వచ్చే పార్టనర్ల బట్టి మీ ఆదాయం మారుతుంది.
10. మీ ట్విచ్ (Twitch) ఛానెల్‌ని మానిటైజ్ చేయండి :
ప్రత్యేకించి గేమర్స్ కోసం గో-టు సైట్ ట్విచ్‌లో మంచి రెవిన్యూ సంపాదించుకోవచ్చు. మీకు స్టేబుల్ ఫాలోవర్లు ఉంటే అద్భుతమైన ఆదాయాన్ని పొందవచ్చు. లైవ్-స్ట్రీమింగ్ గేమ్ ప్లే ఇంటి నుంచి డబ్బు సంపాదించడానికి అద్భుతమైన మార్గంగా చెప్పొచ్చు. లైవ్ స్ట్రీమర్‌లు వీక్షకుల వర్చువల్ చీర్స్ లేదా బిట్స్ నుంచి డబ్బును పొందవచ్చు.
అఫిలేటెడ్ లేదా పార్టనర్ స్టేటస్ చేరుకుంటే సబ్‌స్క్రిప్షన్, యాడ్ రెవిన్యూతో షేర్ కూడా పొందవచ్చు. ట్విచ్‌లో డబ్బు సంపాదించడం చాలా కష్టమే. ప్రారంభించడం సులభమే కానీ ఫాలోవర్లను తెచ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. దీనికి వయస్సు పరిమితి 13ఏళ్లకు పైబడి ఉండాలి. నెలవారీగా డబ్బులు సంపాదించుకోవచ్చు.
FAQs : ఇంట్లో నుంచి డబ్బు సంపాదనపై అడిగే ప్రశ్నలివే :
1. ఇంటి నుంచి డబ్బు సంపాదించేందుకు ఈజీ మార్గం ఏంటి?
ఇంట్లో నుంచి డబ్బులు సంపాదించుకోవాలంటే ఫ్రీలాన్సింగ్, ఫైవర్ (Fiverr) లేదా అప్‌వర్క్ (Upwork) వంటి ప్లాట్‌ఫామ్‌లలో రైటింగ్, గ్రాఫిక్ డిజైన్ లేదా వర్చువల్ అసిస్టెన్స్ వంటి స్కిల్స్ ద్వారా బాగానే డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు ఎంత నేర్చుకుంటారో అంత మొత్తంలో సంపాదిస్తూనే ఉంటారు.
2. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఇంటి నుంచి డబ్బు సంపాదించవచ్చా?
అవును.. సంపాదించుకోవచ్చు. మీరు ఆన్‌లైన్ సర్వేలు, వాడని వస్తువులను అమ్మడం చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్, ట్యూటరింగ్ వంటివి అందించడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. వీటిలో కేవలం డబ్బు మాత్రమే కాదు.. సమయంతో పాటు కృషి కూడా చాలా అవసరం.
3. ఇంటి నుంచి వర్క్ చేసి ఎంత సంపాదించవచ్చు?
ఇంట్లో నుంచి వర్క్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. అది కేవలం మీరు చేసే పని బట్టి సంపాదన ఉంటుంది. సాధారణంగా ఏదైనా వర్క్ రోజుకు 5 డాలర్ల నుంచి 20 డాలర్ల వరకు సంపాదించవచ్చు. అయితే, మీ స్కిల్ కలిగిన వర్క్ (కోడింగ్ లేదా మార్కెటింగ్) గంటకు 20 డాలర్ల నుంచి 100 డాలర్ల వరకు సంపాదించవచ్చు. స్టేబిలిటీతో పాటు మీ స్కిల్ లెవల్ కూడా అత్యంత ముఖ్యమని గమనించాలి.
4. ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదన మార్గాలు సురక్షితమేనా?
అన్ని సురక్షితం కాదు.. మీరు స్కామ్‌ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. జాబ్ ఆఫర్ల కోసం ఎప్పుడూ తొందరపడి డబ్బులు చెల్లించవద్దు. అలాగే మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసే ముందు ఎల్లప్పుడూ ఆయా వెబ్‌సైట్‌లను చెక్ చేయండి. పాపులర్ వెబ్‌సైట్ ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే ఉపయోగించండి.
5. ఆఫ్‌లైన్‌లో ఇంట్లో నుంచే సంపాదించేందుకు మార్గాలేంటి?
మీకు టాలెంట్ ఉంటే.. టైలరింగ్, బేబీ సిట్టింగ్, బేకింగ్, ట్యూటరింగ్ లేదా ఇతర వస్తువులను రిపేర్ చేయడం వంటివి చేయడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు ఇంట్లో తయారుచేసిన చేతిపనులు లేదా ప్రొడక్టులను నేరుగా ఇంటి నుంచి ఆఫ్ లైన్ ద్వారా అమ్ముకోవచ్చు.














